వాస్తవ తనిఖీ: డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్విట్టర్ సీఈఓ గా నియమించబడలేదు, వైరల్ క్లెయిమ్ నకిలీది
- By: Pragya Shukla
- Published: Jan 22, 2023 at 12:36 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): మాజీ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, డొనాల్డ్ జాన్ ట్రంప్ జూ. ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓ అని క్లెయిమ్ చేసే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాన్ మస్క్ ట్విట్టర్ యొక్క అత్యున్నత పదవిని వదిలేశారని మరియు ఆ పదవికి డొనాల్డ్ జాన్ ట్రంప్ ను ఎంపిక చేశారని పేర్కొనబడింది.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి వాస్తవ తనిఖీ నిర్వహించింది మరియు ఇది నకిలీది అని కనుగొనింది. డొనాల్డ్ జాన్ ట్రంప్ జూ. ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓ గా ఎంపిక చేయబడలేదు. ఆయనే ఇది తప్పు వార్త అని చెప్పారు. ది స్మాట్టరింగ్ న్యూస్ అనే ఒక సటైరికల్ వెబ్సైట్ ఈ నివేదికను ప్రచురించింది, దీని తరువాత ఈ వార్త నిజమే అనుకొని ప్రజలు షేర్ చేయడం ప్రారంభించారు.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ ఎస్టి మాన్ ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేసి, ఇలా వ్రాశారు, “బ్రేకింగ్ న్యూస్: ఎలాన్ మస్క్ పదవి నుండి తప్పుకొని డొనాల్డ్ ట్రంప్ జూ. ను ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓ గా నియమించారు”
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు:
వైరల్ క్లెయిమ్ లోని వాస్తవాన్ని తెలుసుకొనుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ పై సెర్చ్ చేశాము. కాగా, క్లెయిమ్ కు సంబంధించి మాకు ఎలాంటి ప్రామాణికమైన మీడియా రిపోర్ట్ అందలేదు.
దర్యాప్తును కొనసాగిస్తూ, మేము ఇలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ ఖాతా ను శోధించాము, కాని ఇక్కడ కూడా వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారము మాకు లభించలేదు. ఆ తరువాత మేము డొనాల్డ్ జాన్ ట్రంప్ జూ. యొక్క ట్విట్టర్ ఖాతా ను శోధించడం ప్రారంభించాము. ఈ ప్రక్రియలో వైరల్ క్లెయిమ్ కు సంబంధించి మాకు డిసెంబరు 22, 2022 నాటి ఒక ట్వీట్ లభించింది. ఒక నివేదికను షేర్ చేస్తూ, ఆయన ఈ క్లెయిమ్ ను నకిలీదిగా పేర్కొన్నారు.
వైరల్ క్లెయిమ్ కు సంబంధించి ‘ది స్మాట్టరింగ్ న్యూస్’ అనే ఒక వెబ్సైట్ పై డిసెంబరు 19 నాడు ప్రచురించబడిన ఒక రిపోర్ట్ మాకు లభించింది. వెబ్సైట్ ను తనిఖీ చేసిన తరువాత, ఇది ఒక వ్యంగ్యపు వెబ్ పోర్టల్ అని మాకు తెలిసింది. ఈ వెబ్సైట్ పై ప్రచురించబడే అన్ని వార్తలు మరియు నివేదికలు వినోదము కోసం మాత్రమే వ్రాయబడినవి.
మరింత సమాచారము కోసం, మేము దైనిక్ జాగరణ్ యొక్క బిజినెస్ విలేఖరి మనోజ్ కుమార్ గారిని సంప్రదించాము. వారు ‘ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము’ అని మాకు చెప్పారు.
ట్విట్టర్ యొక్క ముఖ్య పదవి నుండి వైదొలగాలా అని ప్రజలను అడుగుతూ ఇలాన్ మస్క్ December 19, 2022 నాడు ఒక పోల్ నిర్వహించారు, దీనికి 57.5 శాతము మంది అవును అని జవాబు ఇచ్చారు. దీని తరువాత ఈ పదవికి ఎవరైనా సరైనవారిని కనుగొన్నప్పుడు ఆయన ఈ పదవి నుండి వైదొలగుతానని చెప్పారు. అప్పటి నుండి సోషల్ మీడియాపై అనేక రకాలైన వార్తలు వైరల్ అవుతున్నాయి.
దర్యాప్తు యొక్క అంతిమ దశలో విశ్వాస్ న్యూస్, వైరల్ పోస్ట్ షేర్ చేసిన ప్రొఫైల్ యొక్క నేపథ్య తనిఖీ నిర్వహించింది. ఈ యూజర్ తన ప్రొఫైల్ పై ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయలేదని మేము కనుగొన్నాము.
ముగింపు: వైరల్ పోస్ట్ కు సంబంధించి విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ నిర్వహించింది మరియు డొనాల్డ్ జాన్ ట్రంప్ జూ. ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓ గా ఎంపిక చేయబడలేదు అని కనుగొనింది. ఈ వార్త తప్పు అని ఆయనే తెలిపారు. ‘ది స్మాట్టరింగ్ న్యూస్’ అనే ఒక వ్యంగ్య వెబ్సైట్ ఈ నివేదికను ప్రచురించింది, దీని తరువాత ఈ వార్త నిజమని అనుకొని ప్రజలు దీనిని షేర్ చేయడం ప్రారంభించారు.
- Claim Review : బ్రేకింగ్ న్యూస్: ఎలాన్ మస్క్ పదవి నుండి తప్పుకొని డొనాల్డ్ ట్రంప్ జూ. ను ట్విట్టర్ యొక్క కొత్త సీఈఓ గా నియమించారు
- Claimed By : ఎస్టి మాన్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.