కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఫ్రాన్స్ హింసకు సంబంధించినది అనే ఒక క్లెయిమ్ తో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఒక భవనముపై నుండి కార్లు పడిపోవడం మరియు పేలిపోవడం చూడవచ్చు. ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగ్నింది. ఈ వీడియో ఒక చలనచిత్రములోని దృశ్యము.
వైరల్ వీడియో వెంబడి ఉన్న శీర్షిక అసత్యపు క్లెయిమ్ తో ఒక వీడియో ఉపయోగించి రాజకీయ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో ఇలా ఉంది: నమ్మదగిన జాతీయవాద మహిళను వదిలి, ఫ్రాన్స్ సెక్యులర్ లిబరల్ ఇమ్మాన్యుయల్ మాక్రన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది, ఫలితం చూడండి.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు:
విశ్వాస్ న్యూస్ వీడియోలోని కీవర్మ్స్ నుండి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. ఈ వీడియో యొక్క పూర్తి వర్షన్ హాలీవుడ్ నిర్మాత జస్టిన్ కింగ్ ద్వారా 2017 లో చేసిన ట్వీట్ లో చూడవచ్చు. ఈ ట్వీట్ లో ఇది క్లేవ్లాండ్ లో జరిగిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8’ అనే ఒక చలనచిత్రము యొక్క షూటింగ్ నుండి దృశ్యము అని తెలిపింది. జస్టిన్ కింగ్ యొక్క ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఈ క్లిప్ యొక్క మరింత పెద్ద వర్షన్ ప్రముఖ యూఎస్ న్యూస్ అవుట్లెట్ ఏబిసి న్యూస్ యొక్క ధృవీకరించబడిన ఫేస్బుక్ పేజ్ పై 2016లో అప్లోడ్ చేయబడింది. దీని వెంబడి ఉండే శీర్షిక ఈ విధంగా ఉంది: కొత్త ‘ఫాస్ట్ & ఫ్యూరియస్’ అనే చలన చిత్రము షూటింగ్ నుండి విన్యాసాల మాదిరిగా భవనాల నుండి కార్లు పడి పేలిపోతున్న దృశ్యం సంగ్రహించబడింది.”
మాకు ఈ క్లిప్ ప్రజా సమీక్ష వెబ్సైట్ రాటెన్ టొమాటోస్ చే నిర్వహించబడే మూవీక్లిప్స్ అనే ఒక ధృవీకరించబడిన యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడి కనిపించింది. వేరే కోణము నుండి ఇదే దృశ్యాలను చూడవచ్చు. నటీమణి చార్లిజ్ థెరాన్ ను కూడా ఈ క్లిప్ లో ఒక పాత్రలో చూడవచ్చు.
ధృవీకరణ కోసం విశ్వాస్ న్యూస్ జాగరణ్ యొక్క సీనియర్ ఎంటర్టెయిన్మెంట్ విలేఖరి స్మిత శ్రీవాత్సవ్ ను కలిసింది, ఆమె ఈ వీడియో 2017 లో విడుదల అయిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8’ అనే ఒక చలన చిత్రము నుండి తీసుకోబడింది అని ధృవీకరించారు.
ఈలోపు, జూన్ 27 లో పారిస్ సబర్బ్ లో పోలీసు కాల్పులలో ఒక యుక్తవయస్కుడు మరణించిన తరువాత ఫ్రాన్స్ లో ఉన్న అల్లార్ల-వంటి పరిస్థితి నెలకొనింది. ఫ్రాన్స్ లోని ప్రస్తుత పరిస్థితి గురించి మరిన్ని వివరాలను ఈ కథనము లో చదవవచ్చు.
ఈ వైరల్ పోస్ట్ ఒక అసత్యపు క్లెయిమ్ తో ‘అమాత్య రాక్షస్’ అనే పేరు ఉన్న యూజర్ షేర్ చేశారు, ఈ యూజర్ కు ఫేస్బుక్ పై 5,000 స్నేహితులు ఉన్నారు.
ముగింపు: సమగ్ర దర్యాప్తు తరువాత, ఒక భవనముపై కార్లు పడిపోతున్న వీడియోకు ఫ్రాన్స్ హింసకు సంబంధం లేదని, అది ఒక చలన చిత్రములోని ఒక దృశ్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
క్లెయిమ్ సమీక్ష: ఫ్రాన్స్ లోని హింసకు సంబంధించిన వీడియో
క్లెయిమ్ చేసినది: ఫేస్బుక్ యూజర్
వాస్తవ తనిఖీ: అసత్యము
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923