వాస్తవ తనిఖీ: సడక్‌ 2 ట్రైలర్‌కు భారీగా డిస్‌లైక్‌లు అంటూ మహేష్ భట్ పాత వీడియో లింక్ చేసి తప్పుడు ప్రచారం

ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుక్కొంది. ఈ వీడియో పాతది. వాస్తవానికి ఈ వీడియో పాతది. ఈ వైరల్ వీడియో యేడాది క్రితానికి సంబంధించినది, సడక్‌ 2 ట్రైలర్ ఈ యేడాది ఆగస్టు 12వ తేదీన విడుదలయ్యింది.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిత్ర దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ కోపంగా మాట్లాడటం కనిపిస్తుంది. సడక్‌ 2 సినిమా ట్రైలర్‌ను చాలామంది డిస్‌లైక్‌ చేయడంతో మహేష్‌భట్‌ చాలాకోపంగా ఉన్నారంటూ.. వైరల్ వీడియోతో పాటు.. రైటప్‌లో పేర్కొన్నారు. ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో తేల్చింది. వాస్తవానికి ఈ వీడియో పాతది. ఈ వైరల్ వీడియో యేడాది క్రితానికి సంబంధించినది, సడక్‌ 2 ట్రైలర్ ఈ యేడాది ఆగస్టు 12వ తేదీన విడుదలయ్యింది.

వైరల్ అవుతున్నది ఏంటి?
వైరల్ వీడియోలో, చిత్ర దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ కోపంగా మాట్లాడటం చూడవచ్చు. ”90 #లక్షల డిస్‌లైక్‌లు వస్తే ఎలా ఉంటుందో చూడండి #పిచ్చి వాడయ్యాడు #మహేష్‌భట్‌”

వైరల్ పోస్ట్‌కు సంబంధించిన లింక్ ఇక్కడ చూడవచ్చు.

ఆ పోస్ట్‌కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.

దర్యాప్తు :
ఈ వీడియోను పరీక్షించడానికి, మేము మొదట ఇన్విడ్ టూల్‌ సహాయంతో ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను సేకరించడం జరిగింది. ఆపై వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్‌ సెర్చ్‌తో పాటు.. ‘మహేష్ భట్ షూటింగ్’ అనే కీ వర్డ్స్‌తో శోధించాము. ఈ వీడియోను 2019 డిసెంబర్ 8వ తేదీన news18.com/ లో ప్రచురించిన వార్తాకథనంలో మేము కనుగొన్నాము. ఆ కథనం ప్రకారం, మహేష్ భట్ కుమార్తె షాహీన్ భట్ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్‌కు సంబంధించిన వీడియో అది. మహేష్ భట్ ఏదో ఒక విషయం గురించి కలత చెందినప్పుడు అలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019 డిసెంబర్ 9వ తేదీన ఎన్‌డిటివిలో ప్రచురించిన వార్తలో కూడా ఈ వీడియో కనిపించింది.

అయితే.. ఈ అంశంపై మరింత ధృవీకరణ కోసం, మేము సీనియర్ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ పరాగ్ చాపేకర్‌ను సంప్రదించాము. ఆయన మాకు, “ఈ వీడియో పాతది. దీనికి సడక్‌ 2 ట్రైలర్‌తో సంబంధం లేదు. ” అని సమాధానమిచ్చారు.

జాగరణ్‌.కామ్ లో ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం, “బాలీవుడ్ నటి అలియా భట్, సంజయ్ దత్ నటించిన చిత్రం సడక్‌ -2 ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్‌ను ఇష్టపడే వాళ్లకంటే డిస్‌లైక్స్‌ చాలా వేగంగా పెరుగుతున్నాయి. చాలా అరుదుగా ఒక వీడియోకు లైక్స్‌ కంటే డిస్‌లైక్స్‌ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్వాభిమానంపై చర్చల మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కూడా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ట్రైలర్‌ను ఇష్టపడేవాళ్లకంటే డిస్‌లైక్స్‌ చేసేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.”

ఈ పోస్ట్‌ను ఎస్ మౌర్య అనే ఫేస్‌బుక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ యూజర్ తన ప్రొఫైల్‌ను 2018లో క్రియేట్‌ చేశారు. ఈ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌కు మొత్తం 1,558 మంది ఫాలోవర్లు ఉన్నారు.


निष्कर्ष: ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుక్కొంది. ఈ వీడియో పాతది. వాస్తవానికి ఈ వీడియో పాతది. ఈ వైరల్ వీడియో యేడాది క్రితానికి సంబంధించినది, సడక్‌ 2 ట్రైలర్ ఈ యేడాది ఆగస్టు 12వ తేదీన విడుదలయ్యింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు