కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। లోక్సభ ఎన్నికలు 2024 నేపథ్యములో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది యూజర్లు ఈ పోస్ట్ ను షేర్ చేస్తూ దానిని రాహుల్ గాంధి భారత్ జోడో న్యాయ యాత్రతో జతచేస్తున్నారు. ఎలెక్టోరల్ బాండ్ సమాచారము జనాంతికము అయిన తరువాత రాహుల్ గాంధి చేసిన మొదటి బహిరంగ సభలో జనం గుమిగూడారు అని యూజర్స్ క్లెయిమ్ చేస్తున్నారు.
బహిరంగ సభ యొక్క వైరల్ వీడియో కర్ణాటకలో జరిగిన ఎద్దులబండి రేసుకు చెందినది అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. ఇది రాహుల్ గాంధి యొక్క బహిరంగ సభకు చెందినది అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేస్తున్నారు. ఎలెక్టోరల్ బాండ్ యొక్క సమాచారము మార్చ్ 14 న జనాంతికం చేయబడితే, వైరల్ వీడియో మార్చ్ 5 నుండి ఇంటర్నెట్ లో ఉంది.
ఫేస్బుక్ యూజర్ ధీరేంద్ర ప్రకాష్ రాయ్ (ఆర్కైవ్ లింక్) మార్చ్ 15 న వీడియోను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు,
“ఎలెక్టోరల్ బాండ్ వెల్లడించబడిన తరువాత, రాహుల్ గాంధి యొక్క మొదటి భారీ బహిరంగ సభ”
వైరల్ క్లెయిమ్ ను విచారించడం కోసం మేము గూగుల్ యొక్క ఇన్విడ్ టూల్ సహాయముతో వీడియో యొక్క కీఫ్రేమ్ తీసుకొని దానిని గూగుల్ లెన్స్ సహాయముతో సెర్చ్ చేశాము. మాకు ఫేస్బుక్ యూజర్ ఫారూక్ జేలాని బాబు షేర్ చేసిన వీడియో లభించింది. ఈ యూజర్ మార్చ్ 10 నాడు ఇన్స్టా పోస్ట్ (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేశారు. యూజర్ ఇన్స్టా యూజర్ అభిజీత్__కలగే__33k యొక్క పోస్ట్ ను షేర్ చేస్తూ దీనిని రాహుల్ గాంధితో జతచేశారు.
మేము ఇన్స్టా యూజర్ అభిజీత్__కలగే__33k (ఆర్కైవ్ లింక్) మార్చ్ 5 న చేసిన పోస్ట్ ను స్కాన్ చేశాము. దీనిలో చాలామంది ఇతర యూజర్లు కామెంట్ విభాగములో ఈ వీడియో ఎద్దులబండి రేస్ కు చెందినది అని తెలిపారు. ఒక యూజర్ ఈ ప్రదేశాన్ని ఎగ్జాంబ సావర్కర్ మైదాన్ గా పేర్కొన్నారు. దీనితో వైరల్ అయిన వీడియో మార్చ్ 5 నుండి ఇంటర్నెట్ పై ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
దీని తరువాత మేము కీవర్డ్ సహాయముతో గూగుల్ పై సెర్చ్ చేశాము. దీని ద్వారా మాకు యూట్యూబ్ ఛానల్ పై కొన్ని వీడియో లభించాయి.
యూట్యూబ్ ఛానల్ @నాడ్_ఫక్త్_బైల్గాడా (ఆర్కైవ్ లింక్) గుంపులో తొక్కిసలాట జరిగినట్లు ఒక వీడియో పోస్ట్ చేసింది
దీనిలో ఎద్దులబండ్లను మరియు వైరల్ అయిన వీడియోలో కనిపించే భారీ కటౌట్ కూడా చూడవచ్చు.
యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ చికోడి (ఆర్కైవ్ లింక్) కూడా ఎద్దులబండి రేస్ కు చెందిన మరొక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో ఎగ్జాంబ, సావర్కర్, ప్రకాష్ హుక్కేరీ మరియు గణేష్ హుక్కేరి యొక్క హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించింది. ఈ వీడియోలో కూడా వైరల్ వీడియోలో కనిపించే భారీ కటౌట్ ను చూడవచ్చు.
మార్చ్ 7, 2024 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో ప్రచురించబడిన వార్త ప్రకారం, కర్ణాటకకు చెందిన బెలగావిలోని చికోడి తాలూకాలో ఉన్న ఎగ్జాంబ మైదాల్ లో ఎద్దులబండి రేస్ ఏర్పాటు చేయబడింది. దీనిని ఎంఎల్సీ ప్రకాష్ హుక్కేరీ ఏర్పాటు చేయించారు. పోటీలో గెలిచినవారికి 64లక్షల రూపాయల బహుమతులు ఉన్నాయి. దీనిలో మహారాష్ట్ర మరియు కర్ణాటకకు చెందిన చాలామంది పాల్గొన్నార్.
మేము బెలగావిలో పుఢారి న్యూస్ విలేఖరి అక్షత నాయిక్ ను సంప్రదించాము. ఆమెకు వైరల్ అయిన వీడియోను పంపించాము. ఈ వీడియో బెలగావిలో జరిగిన ఎద్దులబండి రేస్ కు చెందినది అని ఆమె స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి శాసనసభ్యుడు గణేష్ హుక్కేరి కార్యక్రమాన్ని చికోడీలో ఆయన ఏర్పాటు చేయించారు అని అన్నారు .
మార్చ్ 14 నాడు భారత ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ పై ఎలెక్టోరల్ బాండ్ యొక్క సమాచారాన్ని జనాంతికం చేయబడింది.
మార్చ్ 15 నాడు రాహుల్ గాంధి మహారాష్ట్రలోని పూణెలో ఉన్నారు.
తప్పు క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. గోరఖ్పూర్ లో ఉండే యూజర్ కు 6 వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: కర్ణాటకలో జరిగిన ఎద్దులబండి రేస్ కు సంబంధించిన వీడియో రాహుల్ గాంధి యొక్క బహిరంగ సభకు జతచేసి వైరల్ చేయబడింది. దీనికి రాహుల్ గాంధి యొక్క బహిరంగ సభకు ఎలాంటి సంబంధము లేదు. ఎలెక్టోరల్ బాండ్ యొక్క సమాచారము మార్చ్ 14 నా ఎన్నికల సంఘం వెబ్సైట్ పై అప్లోడ్ చేయబడింది, కాని వైరల్ వీడియో మార్చ్ 5 నాటి నుండి ఇంటర్నెట్ పై ఉంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923