షెఫాలి వైద్యకు ఆపాదించబడిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడిందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. వైరల్ అవుతున్న వాదనల ప్రకారం ఆమె ట్వీట్ చేయలేదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): కాలమిస్ట్ షెఫాలి వైద్య పేరుతో పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విస్తృతంగా వైరల్ అవుతున్న ఓ ట్వీట్‌ను విశ్వాస్ న్యూస్ కనుగొంది. వివాదాస్పదమైన తనిష్క్ ప్రకటనపై ఆగ్రహాన్ని తన ట్వీట్‌లో చూపించిందని ఆ వైరల్ దావా పేర్కొంది. అయితే, వైరల్ ట్వీట్ నకిలీదని, షెఫాలి వైద్య తన ప్రొఫైల్‌లో ఈ ట్వీట్ చేయలేదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది.
దావా :
ఫేస్‌బుక్ పేజ్, ‘Muslims of India’లో షెఫాలి వైద్య యొక్క మార్ఫింగ్ ట్వీట్ ను షేర్ చేశారు, అక్కడ ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు, ‘గత సంవత్సరం నేను ప్రకాశించే బంగారు నెక్లెస్ కొన్నాను. ఆ నెక్లెస్ సెట్ 1,12,484 రూపాయలకు తనిష్క్ జువెల్లరీలో కొనడం నా జీవితంలోనే అదో చెత్త నిర్ణయం. నేను ఈ జిహాదీ బ్రాండ్‌ను ఏ లోకల్ షాపులోనైనా అమ్మబోతున్నాను. ఎందుకంటే నా ఇంట్లో అలాంటి హిందూఫోబిక్ బ్రాండ్ అక్కరలేదు. #BoycottTanishq’
ఈ ట్వీట్‌లో ఉన్న ఆభరణాలను పోలిన మరొక ఫోటో ఇంటర్నెట్‌లో కనిపించింది, ఇది ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో కేవలం 199 రూపాయలకు లభిస్తోంది.
ఆ మార్ఫింగ్ ట్వీట్‌తో పాటు, ఆ పేజీలో ఇంకా ఇలా రాశారు, ‘ట్విట్టర్‌లో #BoycottTanishq ఏమిటి మరియు వాస్తవానికి ఇది ఏమిటి.
లక్ష పన్నెండు వేల రూపాయల నుండి 200 రూపాయల వరకు.
©️ https://t.co/lGWjgsqRx2“
ఆ వైరల్ పోస్ట్‌ను మరియు దాని ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడొచ్చు.
మరో ఫేస్‌బుక్ పేజీ, ‘Mahua Moitra Fans’లో కూడా ఈ ట్వీట్ ఫోటోను షేర్ చేశారు. మరియు ‘రియాలిటీ ఆఫ్ #BoycottTanishq ఉద్యమం. శాంతి మరియు ఐక్యతను ఎవరైనా ప్రోత్సహించాలని బిజెపి కోరుకోదు. దేశంలో శాంతిని పునరుద్ధరిస్తే, మోడీ తన మొదటి ఉద్యోగాన్ని మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుంది.’ అని రాశారు.
ఆ పోస్ట్‌ను మరియు దాని ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్‌చేసి చూడొచ్చు.
మరో ట్విట్టర్ యూజర్ ‘Ayodhya Poul’ – अयोध्या. చాలా మంది ఆ ట్వీట్ యొక్క అదే ఫోటోను షేర్ చేశారు. మరియు ఇలా రైటప్ ఇచ్చారు, ‘देवा रे देवा! Woman facepalmingRolling on the floor laughing @ShefVaidya ‘ कडू ”न काढलेले 24 112484 ₹ दागिने दागिने 199 ₹ मध्ये आहेत आहेत.Rolling on the floor laughing
@narendramodi जी जो एैसे महान कार्यकर्तावों को संभालते @SardesaiVarun @Raja_Africa @AnaghaAcharya @kundanAvhad19 @real230799 @shwetasuryava19 @PomaneSpeaks’
మొత్తం పోస్ట్ మరియు దాని ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్‌చేసి చూడండి.
దర్యాప్తు :
జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ తన తాజా ప్రకటనపై సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలిన తరువాత అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి దానిని తొలగించింది. ఆ ప్రకటనలో ఏముందంటే.. హిందూ మహిళ, ఆమె ముస్లిం అత్తగారు, ఇది #BoycottTanishq ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అందులో ఓచోట, కాలమిస్ట్ షెఫాలి వైద్యకు ఆపాదించబడిన ట్వీట్ యొక్క ఫోటో ఉంది.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తు యొక్క మొదటి దశలో కాలమిస్ట్ షెఫాలి వైద్య యొక్క ట్విట్టర్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసింది, వైరల్ ట్వీట్‌లో ఉన్న విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసిందా అని ధృవీకరించడానికి. ఆమె ట్విట్టర్ ప్రొఫైల్‌లో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆమెకు ఆపాదించబడిన వైరల్ ట్వీట్ మేము కనుగొనలేదు.
తరువాత మేము వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడుతున్న ట్వీట్ యొక్క ఫోటోను శోధించాము.
విశ్వాస్ న్యూస్ ట్వీట్ యొక్క ఫోటోను తనిఖీ చేసినప్పుడు, షెఫాలి వైద్య యొక్క యూజర్‌నేమ్‌లో ఉన్న అక్షరాలు ప్రొఫైల్ దిగువ నుండి కత్తిరించబడ్డాయని మేము కనుగొన్నాము, పేరులోని ‘@’ మరియు ‘Y’ ప్రముఖంగా గమనించవచ్చు.
మేము షెఫాలి వైద్య యొక్క ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను శోధించాము. అక్కడ ఆమె నకిలీ పోస్ట్ ఫోటో విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది. ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు.
ట్విట్టర్‌లో కూడా నకిలీ ట్వీట్ యొక్క ఇమేజ్‌ను ఆమె ప్రస్తావించారు
దర్యాప్తు చివరి దశలో విశ్వాస్ న్యూస్ షెఫాలి వైద్యను సంప్రదించింది. ఆమె విశ్వాస్ న్యూస్‌తో మాట్లాడుతూ, ‘ట్వీట్‌లో నాకు ఆపాదించబడిన ఫోటో నకిలీ. ఆ వైరల్ ట్వీట్‌లో వాడుతున్న దానికంటే నా ఇంగ్లీష్ మంచిదని నన్ను అనుసరించే వారికి తెలుస్తుంది. అలాగే, ఇలాంటివి నా పేరుతో జరగడం ఇదే మొదటిసారి కాదు. అయితే, చివరికి నిజం ప్రబలంగా ఉంటుంది.’
చివరికి మేము ఈ వైరల్‌పోస్ట్‌ను షేర్ చేసుకున్న ప్రొఫైల్‌ను సోషల్ స్కానింగ్ చేసాము, ‘Muslims of India’ అనే పేజీని 37,004 మంది అనుసరిస్తున్నారు మరియు 31,791 మంది ఈ పేజీని లైక్ చేశారు.
निष्कर्ष: షెఫాలి వైద్యకు ఆపాదించబడిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడిందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. వైరల్ అవుతున్న వాదనల ప్రకారం ఆమె ట్వీట్ చేయలేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923