వాస్తవ తనిఖీ: కాంగ్రెస్ నాయకుడి పేరును జోడించి భోజ్‌పురి సినిమాలోని ఒక సీన్ వైరల్
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో భోజ్‌పురి చిత్రంలోని సన్నివేశంలో ఉన్న వ్యక్తి ఒక కాంగ్రెస్ నాయకుడిగా కొంతమంది వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. వైరల్ పోస్ట్ నకిలీ అని తేలింది.
- By: Ashish Maharishi
- Published: Aug 26, 2020 at 01:09 PM
- Updated: Sep 14, 2020 at 01:25 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ట్విట్టర్‌లో ఒక ఫోటో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత ఫరూక్ ఇమామ్ హుస్సేన్ ఒక దళిత మహిళ దుస్తులను తొలగించారని రైటప్ జోడించారు. ఇలాంటి రైటప్‌లతో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ ఫోటో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ మాత్రమే కాకుండా వాట్సప్‌లో కూడా ఈ ఫోటో చాలా వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్‌పై దర్యాప్తు చేసింది, మరియు ఈ వాదన తప్పు అని దర్యాప్తులో నిరూపించబడింది. కాంగ్రెస్ నాయకుడిగా అభివర్ణించబడుతున్న ఈ చిత్రం వాస్తవానికి భోజ్‌పురి సినిమాలోని ఒక సీన్‌కు సంబంధించిన సన్నివేశం.
వైరల్ అవుతున్నది ఏంటి ?
దశరథ గోస్వామి (@DASHRTH_GOSWAMI) అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై ఒక ఫోటోను ట్వీట్ చేస్తూ, “ఇలాంటి అవమానకరమైన చర్య కాంగ్రెస్ సభ్యుడు మాత్రమే చేయగలడు. కాంగ్రెస్ నాయకుడు ఫరూక్ ఇమామ్ హుస్సేన్ దళిత మహిళ దుస్తులను లాగేశాడు” అని కామెంట్ చేశారు.
ట్విట్టర్ యూజర్ దీనిని ఆగస్టు 12 న ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ వైరల్ చిత్రాన్ని శోధించినప్పుడు, ఈ ఫోటో ఇంతకు ముందు చాలాసార్లు వైరల్ అయిందని మాకు తెలిసింది. ఈ చిత్రాన్ని బెంగాల్‌లో హింస సమయంలో కూడా ఉపయోగించారు. దర్యాప్తులో, ఈ చిత్రం ‘ఔరత్ ఖిలౌనా నహిన్’ (మహిళ బొమ్మకాదు) అనే భోజ్‌పురి సినిమాలోని ఒక సన్నివేశం అని మాకు తెలిసింది.
దీని తరువాత మేము ‘ఔరత్ ఖిలౌనా నహిన్’ అని టైప్ చేసి యూట్యూబ్‌లో శోధించాము. మాకు మొత్తం సినిమా లింక్ వచ్చింది. ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు 2:10 నిమిషాల తర్వాత అందులో ఉన్న ఒక దృశ్యమే ఇలా నకిలీ దావాలతో వైరల్ అవుతోందని మాకు తెలిసింది. మీరు మొత్తం సినిమాను ఈలింక్‌లో చూడవచ్చు.
దర్యాప్తులో, మేము భోజ్‌పురి సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న సంజయ్ భూషణ్‌ను సంప్రదించాము. అతనికి ఈ వైరల్ ఫోటోను పంపించి, అందులో కనిపించే ఆర్టిస్ట్ పేరు అడిగినప్పుడు, తెల్ల చొక్కా ఉన్న ఆర్టిస్ట్ పేరు అవధేశ్ మిశ్రా అని చెప్పాడు.
దీని తరువాత మేము నేరుగా అవధేశ్ మిశ్రాను సంప్రదించాము. ఈ ఫోటో ఇంతకు ముందు చాలాసార్లు వైరల్ అయిందని ఆయన చెప్పారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని నేనే. అయితే.. ఇది సినిమాలోని సన్నివేశం.
చివరగా మేము ట్విట్టర్ హ్యాండిల్ దశరథ గోస్వామి ప్రొఫైల్‌ను తనిఖీ చేసాము. ఈ హ్యాండిల్‌లోనే సినిమాలోని సన్నివేశం ఫోటోలో ఉన్నవ్యక్తి కాంగ్రెస్ నాయకుడు అని వైరల్ చేశారు. ట్విట్టర్ యూజర్ గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా మేము తెలుసుకున్నాం. ఈ అకౌంట్‌ను రెండు వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ ట్విట్టర్ హ్యాండిల్ జూన్ 2020లో క్రియేట్ చేశారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో భోజ్‌పురి చిత్రంలోని సన్నివేశంలో ఉన్న వ్యక్తి ఒక కాంగ్రెస్ నాయకుడిగా కొంతమంది వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. వైరల్ పోస్ట్ నకిలీ అని తేలింది.
- Claim Review : కాంగ్రెస్ నేత ఫరూక్ ఇమామ్ హుస్సేన్ ఒక దళిత మహిళ దుస్తులను తొలగించారు
- Claimed By : ట్విట్టర్ హ్యాండిల్ దష్రత్ గోస్వామి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.