MR వ్యాక్సిన్ వంధ్యత్వానికి కారణమని పేర్కొన్న పోస్ట్ అబద్ధం. విశ్వాస్ న్యూస్ ఈ తప్పుడు ప్రచారంపై వాస్తవ తనిఖీ చేసిన ఒక సంవత్సరం తరువాత ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తిరిగి కనిపించింది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మళ్లీ కనిపించింది, కేరళలోని పాఠశాలల్లో ముస్లిం బాలికలకు బలవంతంగా టీకాలు ఇస్తున్నారని, అది వంధ్యత్వానికి గురి చేస్తుందని ఆ వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో ఉన్న ఫోటోలలో ఒకటి MR-VAC అనే టీకాను చూపిస్తోంది, ఇది సాధారణ మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్. విశ్వాస్ న్యూస్ ఇంతకుముందు ఈ పోస్ట్‌పై దర్యాప్తు చేసి, ఇలాంటి ప్రచారం అబద్ధమని తేల్చింది.
దావా :
వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో ఒక పోస్ట్ అందుకుంది. కేరళలోని ఒక పాఠశాలలో ముస్లిం విద్యార్థినులకు బలవంతంగా టీకాలు వేస్తున్నట్లు ఆ పోస్ట్‌లో ఉంది. దావా ప్రకారం, టీకా మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతుంది. టీకా యొక్క ఫోటో కూడా షేర్ చేయబడింది.
దర్యాప్తు :
వైరల్ పోస్ట్ యొక్క చిత్రాలలో ఒకదానిలో ఉన్న MR-VAC medicine ఔషధం యొక్క వివరాలను శోధించడం ద్వారా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. పరిశోధనలో ఈ మందు మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్ అని తెలిసింది. మేము గూగుల్ సెర్చింజన్ ఉపయోగించి ఈ మెడిసిన్ గురించి శోధించాము, మరియు ఆ మెడిసిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోందని కనుగొన్నాము.
తయారీదారు వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరణ ప్రకారం.. శిశువులు, పిల్లలు, కౌమారదశలో ఉన్నవాళ్లు మరియు పెద్దలకు కూడా MR-VAC సిఫార్సు చేయబడింది, మరియు ఇది చాలా సురక్షితమైనది మరియు బాగా తట్టుకోగలదని పేర్కొన్నారు.
ఈ వైరల్‌పోస్ట్‌కు సంబంధించిన పూర్తి వాస్తవ తనిఖీ కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.
ఈ వైరల్ పోస్టుకు సంబంధించి యునిసెఫ్‌కు చెందిన డాక్టర్ ప్రఫుల్ భరద్వాజ్‌ను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. ఈ పోస్ట్‌లో పేర్కొన్న వివరాలు అబద్ధమని ఆయన చెప్పారు.
निष्कर्ष: MR వ్యాక్సిన్ వంధ్యత్వానికి కారణమని పేర్కొన్న పోస్ట్ అబద్ధం. విశ్వాస్ న్యూస్ ఈ తప్పుడు ప్రచారంపై వాస్తవ తనిఖీ చేసిన ఒక సంవత్సరం తరువాత ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తిరిగి కనిపించింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923