కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో క్లెయిమ్ చేసిన పోస్ట్, ఫేస్‌బుక్ తన గోప్యతా నియమాలను మార్చింది, యూజర్లు షేర్ చేసుకున్న ఫోటోలు, పోస్టులను తమపై దావాల్లో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ కనిపించింది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో ఒక నకిలీ పోస్ట్ మళ్లీ చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో, ఫేస్‌బుక్ తన గోప్యతా నియమాల్లో మార్పులు చేసిందన్నది ఆ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో యూజర్లు యూజర్లు షేర్ చేసుకున్న పోస్ట్‌లను తమపై దావాల్లో ఉపయోగించడానికి ఈ కొత్త నియమం అనుమతిస్తుందని ఈ పోస్ట్ పేర్కొంది. విశ్వాస్ న్యూస్ ఇంతకుముందే ఈ పోస్ట్‌ను విచారించి, అది నకిలీదని తేల్చింది.
దావా :
ఫేస్‌బుక్‌లో ‘టామీ మక్కాయ్’ అనే వినియోగదారు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ కనిపించింది. ఆ పోస్ట్‌లో ఉన్న సారాంశం చూస్తే… : ”ఈ సమాచారం నిజమైతే, కోవిడ్ 19 నేపథ్యంలో మరింత గందరగోళమే. రేపటినుంచి మన ఫోటోలను ఫేస్‌బుక్ ఉపయోగంచుకునే కొత్త నిబంధనను అమలు చేయబోతుందని మర్చిపోవద్దు. దానికి గడువు ఈ రోజే అని గుర్తుంచుకోండి. మనపై వేసే దావాల్లో వాటిని ఉపయోగించవచ్చు. ఒకవేళ మెస్సేజ్‌లు డిలీట్ చేసినప్పటికీ.. ఇవాళ మనం చేసే పోస్ట్‌లు పబ్లిక్‌గానే ఉంటాయి. సింపుల్‌గా కాపీ, పేస్ట్ చేయడానికి ఇది ఏమీ తీసుకోదు : క్షమించండి కంటే సురక్షితం. ‘నా ఫోటోలు, సమాచారం, సందేశాలు లేదా పోస్ట్‌లను ఇంతకుముందే షేర్ చేసినవి గానీ, భవిష్యత్తులో చేయబోయేవి గానీ.. ఫేస్‌బుక్ లేదా ఫేస్‌బుక్ ట్రైనింగ్ గురించి ఉపయోగించడానికి నేను ఒప్పుకోను.’ నా ప్రొఫైల్ లేదా నా అకౌంట్‌లోని వివరాలను బహిర్గతం చేయడం, కాపీ చేయడం, ఇతరులకు పంపిణీ చేయడం లేదా ఇతర చర్యలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ.. ఈ స్టేట్‌మెంట్‌తో నేను ఫేస్‌బుక్‌కు నోటిఫికేషన్ ఇస్తున్నాను. ఈ ప్రొఫైల్ యొక్క కంటెంట్ వ్యక్తిగతం మరియు రహస్య సమాచారం. నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లితే చట్టం ద్వారా శిక్షించే అవకాశం ఉంది. గమనిక: ‘ఫేస్‌బుక్’ ఇప్పుడు ప్రజలకు చెందిన పరిధి. ఫేస్‌బుక్ ఉపయోగించే వాళ్లంతా ఇలాంటి నోట్‌ను పోస్ట్ చేయాలి. మీరు కావాలనుకుంటే, ఈ పోస్ట్‌ను కాపీ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారైనా ఈ స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేయకపోతే, మీ ఫోటోలను మరియు ప్రొఫైల్ అప్‌డేట్ సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి మీరు మౌనంగా అనుమతించినట్లే. ‘షేర్’ చేయడం కాదు, కానీ ‘కాపీ + పేస్ట్’ వారి కొత్త అల్గోరిథం మీ పోస్ట్‌లను చదివేందుకే మీ చుట్టూ ఉండే 25 మంది వ్యక్తులను ఎన్నుకుంటుంది. ఈ కారణంగా : ఈ పోస్ట్‌ను మీ వేలితో టచ్‌చేసి పైనుంచి కిందకు సెలెక్ట్ చేయండి. ఇది కాపీని పాపప్ చేస్తుంది. కాపీపై క్లిక్ చేసి, ఆపై మీ పేజీ ఓపెన్ చేసి, కొత్త పోస్ట్‌ను ఓపెన్ చేయండి, ఖాళీ ఫీల్డ్‌లో ఎక్కడైనా మీ వేలిని ఉంచండి. టచ్ చేయగానే వచ్చే ఆప్షన్‌లలో పేస్ట్ సెలెక్ట్ చేయండి. ఇది వ్యవస్థను బైపాస్ చేస్తుంది. నేను వారి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఏదైనా మెస్సేజ్‌ను షేర్ చేయడానికి ఫేస్‌బుక్‌ను నేను అనుమతించను. నేను గతంలో చేసిన పోస్టుల్లో గానీ, ఇప్పుడు చేయబోయే వాటిలో నుంచి గానీ, పోటోలు, పోస్టులు, ఫోన్ నెంబర్లు, ఇ-మెయిళ్లు నా రాతపూర్వక అనుమతి లేదా మౌఖిక అనుమతి లేకుండా ఖచ్చితంగా ఏ రూపంలోనూ ఉపయోగించలేరు.
ఈ పోస్ట్ యొక్క పూర్తి సమాచారం ఇక్కడ దాని ఆర్కైవ్ వెర్షన్‌లో చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఇంతకుముందు దర్యాప్తు చేసినప్పుడు, ఫేస్‌బుక్ యొక్క ‘నిబంధనలు మరియు షరతులు’ ప్రకారం, వారు ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్న పోస్టుల యొక్క మేధో సంపత్తి హక్కులను పూర్తిగా యూజర్లే కలిగి ఉన్నారని మేము కనుగొన్నాము. ఆ ఫ్యాక్ట్‌చెక్ ఆర్టికల్ పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు. వినియోగదారులు తమ కంటెంట్‌ను వారు కోరుకున్న చోట ఎవరితోనైనా పంచుకునేందుకు స్వేచ్ఛ ఉందని దీని ద్వారా అర్ధమవుతుంది.
ఫేస్‌బుక్ యొక్క ‘హెల్ప్ కమ్యూనిటీ‘ పేజీ ఈ వైరల్ పోస్ట్ ఎదుటివాళ్లను వంచించడమే అని పేర్కొంది. అంతేకాదు.. ఎవరైనా యూజర్లు ఈ పోస్ట్ చూసినప్పుడల్లా రిపోర్ట్ చేయాలి. ఇది ఆ యూజర్ లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఉంటుందని తెలిపింది.
వాస్తవ తనిఖీకి సంబంధించిన పూర్తి కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో భాగంగా ఎంక్వైరీ చేసినప్పుడు.. ఫేస్‌బుక్ ప్రతినిధి మెయిల్ ద్వారా స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించారు : ‘గోప్యతను ఫేస్‌బుక్ తీవ్రంగా పరిగణిస్తుంది, మరియు మా ప్రొడక్ట్‌లో అనేక రకాల నియంత్రణలు ఉన్నాయి, అవి ఫేస్‌బుక్‌లో వారు షేర్ చేసుకునే కంటెంట్‌ను ఎవరు చూడాలో ఎంచుకునేందుకు యూజర్లకు అవకాశం కల్పిస్తుంది. ఎక్స్‌ప్రెస్ కాన్సెంట్ లేకుండా మేము ఎప్పుడూ ఏకపక్షంగా ప్రైవేట్ పోస్టులు మరియు ఫోటోలను బహిరంగపరచము.’
ఫేస్‌బుక్ యూజర్ మెహ్మెట్ యిల్దిరిమ్ ఈ పోస్ట్ షేర్ చేశారు. మేము ఈ యూజర్ యొక్క ప్రొఫైల్‌ను అన్వేషించడం జరిగింది. ఆ యూజర్ టర్కీకి చెందిన వ్యక్తి అని కనుగొన్నాము.
DISCLAIMER: #కరోనావైరస్‌ఫ్యాక్ట్స్ డేటాబేస్ కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభం నుండి ప్రచురించబడిన వాస్తవాలు-తనిఖీలను నమోదు చేస్తుంది. మహమ్మారి మరియు దాని పర్యవసానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రోజులు, వారాలు గడిచే సరికి ఖచ్చితమైన డేటా మారవచ్చు. కాబట్టి దీనిని ఎవరికైనా షేర్ చేయడానికి ముందు మీరు చదువుతున్న ఫాక్ట్-చెక్ స్టోరీ ప్రచురించబడిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి.
निष्कर्ष: కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో క్లెయిమ్ చేసిన పోస్ట్, ఫేస్‌బుక్ తన గోప్యతా నియమాలను మార్చింది, యూజర్లు షేర్ చేసుకున్న ఫోటోలు, పోస్టులను తమపై దావాల్లో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మళ్లీ కనిపించింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923