విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఇది తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. అనంత్ అంబాని వివాహములో ప్రధాని మోడి స్వామి సదానంద్ సరస్వతి మరియు స్వామి అవిముక్తేశ్వరానంద, ఇద్దరి నుండి ఆశీస్సులు తీసుకున్నారు.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ముఖేష్ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు, అనంత్ అంబాని వివాహము రాధిక మర్చెంట్ తో జులై 12, 2024 నాడు అంగరంగవైభవంగా జరిగింది. ఈ వివాహానికి హై-ప్రొఫైల్ బాలీవుడ్ సెలెబ్రెటీలు, హాలీవుడ్ తారలు, పారిశ్రామికవేత్తలు, మరియు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడితో సహా పలువురు రాజకీయనాయకులు హాజరు అయ్యారు. ప్రధాని మోడి ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి నుండి ఆశీస్సులు తీసుకుంటున్నట్లు చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా పై చక్కర్లు కొడుతోంది. శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతి నుండి ప్రధాని మోడి ఆశీస్సులు తీసుకున్నారని, ఆయన అయోధ్య రామమందిరము ప్రతిష్ఠాపన వేడుకను బహిష్కరించిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందను ఉపేక్షించారని క్లేయిమ్ సూచించింది.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఇది తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. అనంత్ అంబాని వివాహములో ప్రధాని మోడి స్వామి సదానంద్ సరస్వతి మరియు స్వామి అవిముక్తేశ్వరానంద, ఇద్దరి నుండి ఆశీస్సులు తీసుకున్నారు.
జులై 18 నాడు, ఒక ఫేస్బుక్ పేజ్ ‘సనాతన ధర్మ్’ (ఆర్కైవ్) ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ప్రధానమంత్రి మోడి అంబాని వేడుకకు హాజరు అయిన ఇద్దరు శంకరాచార్య స్వాములలో ఒకరి పాదాలను మాత్రమే స్పృశించడం చూడవచ్చు. దీనికి “మోడిగారు అంబాని వేడుకలో హాజరు అయిన ఇద్దరు శంకరాచార్య స్వామీజీలలో ఒకరి పాదాలను మాత్రమే స్పృశించారు మరియు రామమందిరాన్ని వ్యతిరేకించి దాని ప్రారంభానికి వచ్చేందుకు తిరస్కరించిన శంకరాచార్య స్వామిని ఉపేక్షించారు” అనే శీర్షిక వ్రాయబడింది.
వైరల్ క్లెయిమ్ ను ధృవీకరించుటకు, మేము గూగుల్ కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించాము. అనేక వార్తా వెబ్సైట్స్ ప్రధాని మోడి అనంత్ అంబాని వివాహములో ఇద్దరు శంకరాచార్య స్వామీజీల నుండి ఆశీస్సులు తీసుకున్నారు అని రిపోర్ట్ చేశాయి .
ఒక X హ్యాండిల్ మరొక కోణములో ‘బాలియన్’ ద్వారా జులై 13న పోస్ట్ చేయబడిన ఒక వీడియో, ప్రధాని మోడి ముందుగా శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద నుండి ఆశీస్సులు తీసుకున్నారని స్పష్టంగా చూపుతుంది. ఆ తరువాత ప్రధాని శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వతి నుండి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ వేడుకకు సంబంధిన అనేక వీడియోలు ప్రధాని మోడి ముందుగా స్వామి అవిముక్తేశ్వరానంద నుండి, ఆ తరువాత స్వామి సదానంద్ సరస్వతి నుండి ఆశీస్సులు అందుకున్నారని ధృవీకరించాయి.
విశ్వాస్ న్యూస్ శ్రీ విద్యామఠం, వారణాసి యొక్క మీడియా ఇన్-చార్జ్ శ్రీ సంజయ్ పాండే ను కలిశారు, ఆయన “ప్రధానమంత్రి నరేంద్రమోడి అనంత్ అంబాని వివాహ వేడుకలో జ్యోతిర్మఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద పాదాలు స్పృశించి ఆశీస్సులు తీసుకున్నారని, వైరల్ పోస్ట్ లోని క్లెయిమ్ పూర్తిగా నిరాధారమైనది మరియు శంకరాచార్య పేరుప్రతిష్ఠలను కించపరచుటకు చేసినదే అని ధృవీకరించారు”.
ఫేస్బుక్ పేజ్ ‘సనాతన ధర్మ్’ ను సమీక్షించిన పిదప, దీనికి 75000 ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
ముగింపు: వైరల్ క్లెయిమ్ నకిలీది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. అనంత్ అంబాని వివాహ వేడుకలో, ప్రధాని మోడి ఇద్దరు శంకరాచార్య స్వామీజీల నుండి ఆశీస్సులు తీసుకున్నారు; జ్యోతిర్మఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద మరియు ద్వారకాపీఠాధిపతి స్వామి సదానంద్ సరస్వతి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923