తక్షణ వాస్తవ తనిఖీ: నాసా 13 వ రాశిచక్రం ‘ఓఫిచస్’ ను జోడించిందన్న ప్రచారం అబద్ధం
నాసా 13 వ రాశిచక్రం ‘ఓఫిచస్’ ను జోడించలేదు. 2020 జూలైలో విశ్వాస్ న్యూస్ ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ వైరల్ పోస్ట్ అబద్ధం అని తేల్చింది. ఈ నకిలీపోస్ట్ ఇప్పుడు మళ్లీ కనిపించింది.
- By: Urvashi Kapoor
- Published: Oct 22, 2020 at 01:15 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : నాసా 13 వ రాశిచక్రం ఓఫిచస్ను చేర్చిందని పేర్కొన్న వైరల్ పోస్ట్‌పై వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఒక పోస్ట్ అందుకుంది. విశ్వాస్ న్యూస్ ఇంతకుముందు ఈ పోస్ట్‌ను ఫ్యాక్ట్‌చెక్ చేసి, అది నకిలీదని తేల్చింది. ఈ పోస్ట్ జూలై 2020 లో కూడా వైరల్ అయ్యింది, మరియు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో తిరుగుతోంది.
దావా :
సోషల్ మీడియాలో తిరిగి కనిపించిన ఒక పోస్ట్, నాసా “ఒఫిచస్” అనే 13 వ రాశిచక్ర చిహ్నాన్ని ఇప్పటికే ఉన్న 12 రాశిచక్ర గుర్తుల జాబితాలో చేర్చిందని పేర్కొంది.
విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఫాక్ట్ చెక్ కోసం కూడా ఈ సందేహాన్ని ఓ యూజర్ నుంచి అందుకుంది.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ తగిన కీలకపదాలను ఉపయోగించి గూగుల్‌లో ఈ చిత్రంకోసం శోధించడం ద్వారా తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అంతరిక్ష సంస్థ నాసా పోస్ట్ చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము.
జూలై 17, 2020న చేసిన ట్వీట్ ఇలా పేర్కొంది : ప్రతి కొన్ని సంవత్సరాలకు తిరిగి వెలువడే రాశిచక్ర కథ గురించి మీ వ్యాఖ్యలను మేము చూస్తున్నాము. లేదు, మేము రాశిచక్రాన్ని మార్చలేదు. 3,000 సంవత్సరాల క్రితం బాబిలోనియన్లు నక్షత్ర రాశులను కనుగొన్నప్పుడు, వారు 13 వ గుర్తును వదిలివేయాలని ఎంచుకున్నారు. కాబట్టి, మేము దాన్ని బట్టి గణించాము : https://go.nasa.gov/3gZnBwK
ఈ పోస్ట్ అబద్ధమంటూ నాసా తన వెబ్సైట్లో పేర్కొంది.
పూర్తి వాస్తవ తనిఖీ కథనం ఇక్కడ చదవవచ్చు.
విశ్వాస్ న్యూస్ నాసాలోని అమెస్ పబ్లిక్ ఎంక్వైరీలను సంప్రదించింది. అక్కడి ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం, ‘వైరల్ పోస్ట్‌లోని సమాచారం నిజం కాదు. నాసా 13 వ రాశిచక్ర చిహ్నాన్ని జోడించలేదు.’
निष्कर्ष: నాసా 13 వ రాశిచక్రం ‘ఓఫిచస్’ ను జోడించలేదు. 2020 జూలైలో విశ్వాస్ న్యూస్ ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ వైరల్ పోస్ట్ అబద్ధం అని తేల్చింది. ఈ నకిలీపోస్ట్ ఇప్పుడు మళ్లీ కనిపించింది.
- Claim Review : నాసా 13 వ రాశిచక్రం 'ఓఫిచస్'ను జోడించింది
- Claimed By : Whatsapp chatbot
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.