విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పు అని తేలింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్న ఫోటోలో ఉన్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అత్యాచారం చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో, పంజాబ్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడవేసినట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ మహిళ పోలీసు యూనిఫాం ధరించి ఉంది. అలాగే ఆమె ఐడి కార్డును కూడా షేర్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్నది ఏమిటి?
“కిసాన్ కా పుత్ర్ హూ @ సంజయ్_మిష్రా 91”, అనే ట్విట్టర్ యూజర్ అక్టోబర్ 2వ తేదీన ఈ ఫోటోలను షేర్ చేశాడు. “కాంగ్రెస్ నాయకుల్లారా మీ నోర్లు తెరవండి. @ ప్రియాంక గాంధీ, @రాహుల్ గాంధీ జీ… ఈమె కూడా ఒక మహిళ, మీ నోటిలో నాలుక ఉందో లేదో చూడండి. పంజాబ్ ఫతేగర్ చురియన్ రోడ్ యార్డ్ షాంగనా ప్లేస్ సంగత్‌పురా సమీపంలో ఒక మహిళా కానిస్టేబుల్ మృతదేహం కనుగొన్నారు, ఆమెపై అత్యాచారం చేసి హత్యచేశారు. # 210prsr #రేపిస్ట్ గెహ్లాట్ ప్రభుత్వం.’ అని దీనికి కామెంట్ చేశాడు.
ఈ ఫోటోలను సంజు రావత్ కొట్‌పుట్లి ‘అనే యూజర్ కూడా షేర్ చేశాడు. ‘పంజాబ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేశారు. పోలీసులు కూడా సురక్షితంగా లేరు, వారు మాత్రమే హత్రాస్‌పై రాజకీయాలు చేస్తారు, రాజస్తాన్, ఛత్తీస్‌ఘర్‌లో అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి, అమ్మాయిలు సురక్షితంగా లేరు.’ అని ఆ పోస్ట్‌కు రైటప్ రాశాడు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌లను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
దర్యాప్తు :
మేము మొదట ఈ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. వైరల్ పోస్ట్‌లో, మహిళా కానిస్టేబుల్ యొక్క ఐడి కార్డ్ కూడా షేర్ చేశారు. ఆమె పేరు నోమి మరియు పోస్ట్ ‘ఎల్ / కానిస్టేబుల్’ అని ఆ ఐడికార్డ్‌లో ఉంది. ఐడి కార్డ్ ప్రకారం, ఆమె అమృత్‌సర్ సిటీలో పనిచేస్తోంది.
దర్యాప్తు చేయడానికి మేము తొలుతగా కీవర్డ్ శోధనను ఉపయోగించాము. మేము “నోమి + కానిస్టేబుల్ + అమృత్‌సర్” అనే కీలక పదాలతో గూగుల్‌లో శోధించాము. అక్టోబర్ 1వ తేదీన దైనిక్ జాగరణ్ ప్రచురించిన వార్తకు సంబంధించిన లింక్ మాకు వచ్చింది. అక్టోబర్ 1 న, అదే పేరుతో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ యొక్క స్కూటీ స్కార్పియో కారును ఢీకొనడంతో, ఆమె అక్కడికక్కడే మరణించిందని, ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు మాకు తెలిశాయి.
ఆ కీవర్డ్స్ శోధనలో తరువాత, ‘ట్రిబ్యూన్‘ మరియు ‘పంజాబ్ కేసరి‘ వెబ్‌పోర్టల్స్‌లో కూడా ఈ వార్త మాకు దొరికింది. అన్ని వార్తా కథనాల ప్రకారం, మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీ స్కార్పియో కారును ఢీకొట్టింది, దీంతో, ఆమె అక్కడికక్కడే మరణించింది. ఎక్కడా అత్యాచారం గురించి ప్రస్తావించలేదు.
ఈ విషయంలో మరింత ధృవీకరణ కోసం మేము జాగరణ్ అమృత్‌సర్ రిపోర్టర్ నితిన్ ధీమన్‌ను సంప్రదించాము. దీంతో, ఆయన మాకు వైరల్ పోస్ట్‌కు సంబంధించి అవసరమైన వాస్తవ సమాచారం తెలియజేశారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలో ఉన్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె అమృత్‌సర్‌లో ఉద్యోగం చేస్తోంది. అత్యాచారం చేసి హత్య చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు.” అని నితిన్ వివరించారు.
వైరల్ చిత్రాన్ని తప్పుడు వాదనతో షేర్ చేసిన యూజర్ ‘సంజు రావత్ కొట్‌పుట్లి’ ప్రొఫైల్‌ను పరిశీలించగా.. ఆ ప్రొఫైల్ ప్రకారం యూజర్ రాజస్థాన్‌కు చెందినవాడు. ఆ యూజర్‌కు ఫేస్‌బుక్‌లో మొత్తం 21,427 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పు అని తేలింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్న ఫోటోలో ఉన్న మహిళా కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అత్యాచారం చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923