వాస్తవ తనిఖీ: తలపై రాళ్ళు మోస్తున్న మహిళ ఎస్ఐ పద్మశిల తిర్పుడే కాదు, తప్పుదారి పట్టిస్తోన్న వైరల్‌ పోస్ట్‌

శ్రామిక మహిళ యొక్క వైరల్ ఫోటో పద్మశిల తిర్పుడేకు చెందినది కాదు. పద్మశిల చెప్పిన వివరాల ప్రకారం, ఆమె సబ్ ఇన్స్పెక్టర్ కావడానికి ముందు కూలీ పని చేయలేదు. వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది.

వాస్తవ తనిఖీ: తలపై రాళ్ళు మోస్తున్న మహిళ ఎస్ఐ పద్మశిల తిర్పుడే కాదు, తప్పుదారి పట్టిస్తోన్న వైరల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : రెండు వేర్వేరు ఫోటోలతో కూడిన ఒక ఇమేజ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి చిత్రంలో, ఒక కార్మికురాలు తన బిడ్డను చంకలో ఎత్తుకొని.. తలపై రోళ్ళు మోస్తుండటం చూడవచ్చు, రెండవ ఫోటోలో ఉన్నది ఒక మహిళా పోలీస్. ఈ ఫోటోలు రెండూ పద్మశిల తిర్పుడేకు చెందినవని, ఆమె భర్త ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రోళ్లను అమ్మేవారని, తరువాత ఆమె మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్స్పెక్టర్‌గా చేరారని ఈ వైరల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

తలపై రోళ్ళు మోస్తున్న ఫోటోలో ఉన్న శ్రామిక మహిళ.. పద్మశిల తిర్పుడే కాదని, గతంలో ఆమె ఏ కూలీ పని కూడా చేయలేదని విశ్వాస్ న్యూస్ కనుగొంది.

దావా :

ఫేస్‌బుక్ యూజర్ ‘సక్సేనా విషు’ ఈ పోస్ట్‌ను హిందీలో సుమారుగా అనువదించిన ఒక శీర్షికతో షేర్‌ చేశారు – ఈ మహిళ పేరు పద్మశిల తిర్పుడే. ఆమె భండారా జిల్లాలో నివసిస్తుంది, మరియు ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, కాబట్టి రోళ్ళు అమ్మేటప్పుడు ఆమె తన బిడ్డను కూడా వెంట తీసుకెళ్లేది. తరువాత ఆమె యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి, ఎంపీఎస్సీలో పిఎస్ఐ పరీక్ష పాసయ్యింది. ఆమె బౌద్ధుల కుటుంబం నుండి వచ్చింది. ఆమె పోరాటానికి మేము వందనం చేస్తున్నాము. పరిస్థితి ఒక సాకు మాత్రమే, ఈ మహిళ దీనిని నిరూపించింది.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ప్రతి దావా కోసం వెతుకుతూ మేము మా దర్యాప్తును ప్రారంభించాము.

ఈ మహిళ పేరు పద్మశిల తిర్పుడే

పోలీసు యూనిఫాంలో ఉన్న మహిళ పద్మశిల తిర్పుడే అని విశ్వాస్ న్యూస్‌ దర్యాప్తులో తేలింది. ఆమె బ్యాడ్జిలో కూడా ఆమె పేరు చూడవచ్చు, కాని ఫోటోలో ఉన్న శ్రామిక మహిళ పద్మశిల కాదు. మేము పద్మశిలతో మాట్లాడాము, శ్రామిక మహిళ తనతో అద్భుతమైన పోలికను కలిగి ఉందని ఆమె ధృవీకరించింది, కానీ ఇది ఆమె ఫోటో కాదు. అయితే, మేము ఫోటోలో ఉన్న శ్రామిక మహిళ ఎవరన్నది గుర్తించలేకపోయాము.

ఆమె భండారా జిల్లాలో నివసిస్తుంది, మరియు ఆమెకు ప్రేమ వివాహం జరిగింది.

పద్మశిల చెప్పిన వివరాల ప్రకారం, ఇవి రెండూ వాస్తవం.

పద్మశిల విశ్వాస్ న్యూస్‌తో చెప్పిన వివరాల ప్రకారం, ఆమె భర్త యొక్క ఆర్థిక పరిస్థితి రోళ్ళు అమ్మేంత దీన స్థితిలో లేదు. ఆమె ఎప్పుడూ ఏ కూలీ పని చేయలేదు, బదులుగా ఆమె గృహిణి.

ఆమె యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో చదివి, ఎంపిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు.

పద్మశిల విశ్వాస్‌న్యూస్‌తో చెప్పిన వివరాల ప్రకారం, తన ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత, ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పిఎస్ఐ పరీక్షలో పాసయ్యింది.

ఆమె బౌద్ధ కుటుంబం నుండి వచ్చింది

పద్మశిల ఈ విషయాన్ని ధృవీకరించారు.

విశ్వాస్ న్యూస్‌తో పద్మశిల మాట్లాడుతూ.. ‘ఈ పోస్ట్ మూడేళ్ల క్రితం కూడా వైరల్ అయిందని, ఆ సమయంలో కూడా ఇది తన ఫోటో కాదని చెప్పినట్లు తెలిపారు. తాను గతంలో ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె నాగ్‌పూర్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.

ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో ‘సక్సేనా విషు’ అనే యూజర్ షేర్ చేశారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు ఈ యూజర్ ఢిల్లీకి చెందిన వారని కనుగొనడం జరిగింది.

निष्कर्ष: శ్రామిక మహిళ యొక్క వైరల్ ఫోటో పద్మశిల తిర్పుడేకు చెందినది కాదు. పద్మశిల చెప్పిన వివరాల ప్రకారం, ఆమె సబ్ ఇన్స్పెక్టర్ కావడానికి ముందు కూలీ పని చేయలేదు. వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు