వాస్తవ తనిఖీ:డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ అరెస్ట్ చేయబడలేదు, ఒక పరిహాసం వాస్తవంగా వైరల్ అవుతోంది

డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కొరకు అరెస్ట్ చేయబడలేదు అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ అయిన క్లెయిమ్ అసత్యము. ఒక వ్యంగ్య వ్యాసము వాస్తవముగా షేర్ చేయబడింది.

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): ఫేస్‎బుక్ పై విస్తృతంగా షేర్ చేయబడుతున్న డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధానం గాబ్రియేసస్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కొరకు అరెస్ట్ చేయబడ్డారు అనే ఒక క్లెయిమ్ విశ్వాస్ న్యూస్ దృష్టికి వచ్చింది. అయితే ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ అరెస్ట్ చేయబడలేదు.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ మైఖేల్ జే కసాలె జులై 25న ఫేస్‎బుక్ ప్రొఫైల్ లో ఇలా వ్రాశారు: వావ్! డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కొరకు అరెస్ట్ చేయబడ్డారు. పెద్ద మొత్తం నగదుతో ఆయన ఆఫ్రికాకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా విమానములో ఆయన పట్టుబడ్డారు. ఈ చిత్రము చాలా సందడిగా మారింది.

పోస్ట్ మరియు ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి

ఇటువంటి క్లెయిమ్స్ తో ఉన్న కొన్ని ఇతర పోస్ట్స్ కూడా ట్విట్టర్ పై మాకు కనిపించాయి.

దర్యాప్తు:

గూగుల్ కీవర్డ్ సెర్చ్ తో విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ వార్తను తెలిపే ఎటువంటి ప్రామాణిక మీడియా సంస్థలు మాకు కనిపించలేదు.

ఒకవేళ డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ అరెస్ట్ చేయబడి ఉంటే, ఇటువంటి ముఖ్యమైన రిపోర్ట్ ను ఏ మీడియా సంస్థ వదులివేయదు.

https://vancouvertimes.org/who-director-arrested-for-crimes-against-humanity/

ఇలాంటి క్లెయిమ్ నే షేర్ చేసిన ట్వీట్స్ ను చూసున్నప్పుడు, ఆ ట్వీట్స్ వెంబడి షేర్ చేయబడిన ఒక లింక్ మాకు లభించింది.

Vancouver Times‘ నుండి ఒక లింక్ షేర్ చేయబడింది.

డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ అరెస్ట్ కు సంబంధించి ప్రజలు షేర్ చేస్తున్న వార్త ఈ వెబ్సైట్ లో లేదు.

ఈ వెబ్సైట్ ను మేము కూలంకషంగా పరీక్షించాము.

వెబ్సైట్ యొక్క మా గురించి విభాగాన్ని కూడా మేము పరీక్షించాము మరియు ఇది ఒక వ్యంగ్యపు వెబ్సైట్ అని మేము తెలుసుకున్నాము.

ఈ వెబ్సైట్ లో ఇలా ఉంది: వాన్కోవర్ టైమ్స్ పశ్చిమ తీరముపై వ్యంగ్యాల కొరకు విశ్వసనీయమైన సోర్స్. సంప్రదాయ వాదులను ప్రభావితం చేసే సమస్యల గురించి మేము వ్యంగ్యమైన కథనాలను వ్రాస్తాము.

ఈ వ్యంగ్యాలలో ఒక భాగము వాస్తవముగా షేర్ చేయబడింది అని స్పష్టం అయ్యింది.

దర్యాప్తు యొక్క తరువాతి దశలో మేము డబ్ల్యూహెచ్‎ఓ మీడియా సంప్రదింపులు, మార్గరెట్ హ్యారిస్ మరియు టారిక్ జేసరవిక్ లను సంప్రదించాము, ఈ డబ్ల్యూహెచ్‎ఓ ప్రతినిధులు ఇద్దరు ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని చెప్పారు. డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ అరెస్ట్ చేయబడలేదు.

దర్యాప్తులోని చివరి దశగా మేము ఈ క్లెయిమ్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ పై ఒక సామాజిక నేపథ్య తనిఖీ నిర్వహించాము. మైఖేల్ జే కసాలే డాగ్స్బోరో, దెలావరే నివాసి మరియు ఫేస్‎బుక్ పై 1.7k స్నేహితులు ఉన్నారు.

निष्कर्ष: డబ్ల్యూహెచ్‎ఓ డైరెక్టర్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కొరకు అరెస్ట్ చేయబడలేదు అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ అయిన క్లెయిమ్ అసత్యము. ఒక వ్యంగ్య వ్యాసము వాస్తవముగా షేర్ చేయబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు