X
X

వాస్తవ తనిఖీ: ‘7 మెదడుకు ప్రమాదకరమైన అలవాట్లు’ వైరల్ దృశ్యసమాచారము డబ్ల్యూహెచ్ఓ కు తప్పుగా ఆపాదించబడింది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీసే ఏడు అతిపెద్ద మెదడుకు ప్రమాదకరమైన అలవాట్లను వివరిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‎ఓ) నుండి వచ్చిన ఒక దృశ్యసమాచారము సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ వైరల్ టెంప్లేట్ అంతర్జాతీయ ప్రజా ఆరోగ్యము కొరకు బాధ్యత వహించే యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీకి తప్పుగా ఆపాదించబడింది అని కనుగొనింది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ పిజస్ కాంతి గిరి, తన ప్రొఫైల్ పై సెప్టెంబరు 19, 2022 నాడు ఒక దృశ్య సమాచారాన్ని షేర్ చేశారు.

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

పై క్లెయిమ్ ను విశ్లేషించిన తరువాత, విశ్వాస్ న్యూస్, వైరల్ అయిన దృశ్యసమాచారములో అనేక అసాధారణతలను గమనించింది. ఇందులో అనేక వ్యాకరణ సంబంధ పొరపాట్లు, స్పేసింగ్ సమస్యలు, మరియు ఫాంట్స్ అసమానంగా ఉండటముతో సింటాక్స్ తప్పులు ఉన్నాయి మరియు డబ్ల్యూహెచ్‎ఓ లోగో ఉపయోగించబడలేదు. ‘డోంట్ జస్ట్ రీడ్‎ఫార్వర్డ్ టు హూమ్ యూ కేర్ యాస్ ఐ కేర్ ఫర్ యు’ అనే పదాలలో కూడా స్పేసింగ్ సమస్యలు ఉన్నాయి మరియు ‘వైఓయు’ బదులుగా ‘యు’ వినియోగము కూడా అంతర్జాతీయ సంస్థలు తీసుకోని ఒక సాధారణ ధోరణిని వివరించాయి.

‘7 మెదడుకు ప్రమాదకరమైన అలవాట్లు’ అనే కీవర్డ్స్ తో ఫేస్‎బుక్ పై సెర్చ్ చేసిన తరువాత, ఇటువంటి కొన్ని క్లెయిమ్స్ మేము ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ, కనుగొన్నాము. అన్నిటిలో ఒకే విషయము ఉంది, కాని టెంప్లేట్స్ వేరుగా సృష్టించబడ్డాయి. ఇంటర్నెట్ పై మేము క్లెయిమ్ ను సెర్చ్ చేసినప్పుడు, ఆ క్లెయిమ్ కూడా 2017 మరియు 2020 లో కూడా సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది అని మేము కనుగొన్నాము.

మరింత పరిశీలించుటకు, మేము డబ్ల్యూహెచ్‎ఓ యొక్క ఫేస్‎బుక్ and ట్విట్టర్ పేజీలను తనిఖీ చేశాము కాని వాటిల్లో ఇటువంటి ప్రకటనలు ఏవి కనిపించలేదు.

అలాగే మేము షామిలా శర్మ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆగ్నేయ ఆసియా ప్రాంతం కమ్యూనికేషన్స్ అధికారి, ని సంప్రదించాము. ఆమె చక్కర్లు కొడుతున్న సమాచారము “నకిలీ” ది అని ఆమె స్పష్టత ఇచ్చారు.

బ్రెయిన్ స్ట్రోక్ యొక్క కారణాలను అర్థం చేసుకొనుటకు, విశ్వాస్ న్యూస్, దృశ్యసమాచారములో చేయబడిన క్లెయిమ్స్ ను తోసివేసిన నిపుణులను సంప్రదించింది మరియు చదువరుల కొరకు కొన్ని స్పష్టీకరణలను అందించింది:

A. డా. రాజీవ్ జయదేవన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ యొక్క కో-చెయిర్మెన్ ఇలా అన్నారు, “దృశ్యసమాచారములో చేయబడిన క్లెయిమ్స్ ఏవి ఒక స్ట్రోక్ ను ట్రిగ్గర్ చేయలేవు. ఇది ఒక నకిలీ సందేశము.” అన్నిక్లెయిమ్స్ పై సరైన సమాచారాన్ని కూడా ఆయన విశదీకరించారు:

సాధారణంగా సిఫారసు చేయబడని బ్రేక్‎ఫాస్ట్ దాటవేయడము అనే అంశానికి స్ట్రోక్ కు ఏ విధమైన సంబంధం లేదు. చాలామంది దీనిని సహించినప్పటికీ, కొంతమంది ఫంక్షనల్ డిస్పెప్సియా అనే ఒక జీర్ణక్రియ సమస్యతో బాధపడతారు. ఆకలితో ఉండటం ఉదయం సమయములో ఉత్పాదకత మరియు ఏకాగ్రత నష్టానికి కూడా దారి తీయవచ్చు. మిగత శరీర భాగాల కంటే మెదడు ఎక్కువ శక్తిని వినియోగించడమే దీనికి కారణం మరియు దీనిని గ్లూకోజ్ కావాలి. ఒకవేళ రాత్రంగా ఉపవాసం ఉన్న తరువాత శరీరానికి గ్లూకోజ్ అందించకపోతే, అది “సెల్లింగ్” ద్వారా తయారు చేయబడాలి లేదా ప్రోటీన్ వంటి ఇతర కణజాలాల నుండి మార్పిడి చేయబడాలి. అందుచేత రోజును ప్రారంభించే ముందు బ్రేక్ ఫాస్ట్ తినడం మంచిది.

అనేక శారీరిక పనులు బాగా నిర్వహించబడుటకు తగినంత నిద్ర అవసరం. ఇవి జీవక్రియ నుండి బేస్ లైన్ మెదడు కణజాల క్లీన్ అప్ పనుల వరకు ఉండవచ్చు. నిద్ర ఆవశ్యకతలు భిన్నంగా ఉండవచ్చు, కాని దీర్ఘకాలికంగా ఉన్న నిద్రలేమి అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు.

చక్కెర అనేది కొత్త కొవ్వు. తక్కువ మోతాదులలో తీసుకోబడే చక్కెర హానికరంకానప్పటికీ, అత్యధిక మోతాదులలో చక్కెరను నేరుగా లేదా పేస్ట్రీలు లేదా శీతల పానీయాలు మరియు పళ్ళరసాల ద్వారా తీసుకోవడం ఉదర ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, ఫాట్టీ కాలేయం, అధిక రక్తపోటు, మధుమేహం మరియు గుండెజబ్బులకు దారితీయవచ్చు.

టెలివిజన్, సోషల్ మీడియా లేదా సంభాషణలతో పరధ్యానంగా భోజనం చేయడం అనుకోకుండానే అధిక క్యాలరీలు తీసుకోవడానికి దారి తీయవచ్చు. మనం మన అలవాట్ల ఉత్పత్తులం. కాలక్రమేణ, ప్రభావాలు చేరుతాయి. అంతేకాకుండా, పరధ్యానంగా తినడం వలన గొంతులో ఎముకలు లేదా ఆహారం ఇరుక్కోవడం వంటి సమస్యలు కలగవచ్చు. శరీర నిర్మాణ స్థానం ఆధారంగా ఇది అకస్మాత్ మరణం లేదా మింగటానికి ఇబ్బంది వంటివి కలిగించవచ్చు.

నిద్రపోయేటప్పుడు ఒక టోపి లేదా సాక్స్ ధరించడం ప్రమాదకరం కాదు. కాని పొడవైన ఒక స్కార్ఫ్ ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మెడ చుట్టూ చుట్టుకోవచ్చు మరియు ఉక్కిరిబిక్కిరి కలిగించవచ్చు.

బి. డా మిని మెహతా, పాలియేటివ్ కేర్ ఫిజీషియన్, రాజీవ్ గాంధి క్యాన్సర్ ఆసుపత్రి, ఢిల్లీ, ఇలా అన్నారు, “పై క్లెయిమ్స్ లో ఏవి నిజము కాదు. బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రధానంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, మధుమేహము, మద్యము మరియు మెదడులో మూసుకొనిపోయిన రక్తనాళాల వలన కలుగుతుంది”

సి. డా జాకోబ్ చాక్కో, సీనియర్ కన్సల్టెంట్ – న్యూరాలజీ, సన్‎రైజ్ ఆసుపత్రి, కొచ్చి, ఇలా చెప్పారు, ‘చేయబడీన క్లెయిమ్స్ అసత్యము. అధిక-క్యాలరీలు తీసుకోవడం, ముఖ్యంగా జన్యుపరంగా హాని కలిగే అవకాశం ఉన్న వ్యక్తులలో, దీర్ఘ-కాలంలో జీవక్రియ సంబంధ సిండ్రోం మరియు గుండెజబ్బు మరియు గుండెనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు.

ఫేస్‎బుక్ యూజర్ ప్రొఫైల్ ను స్కాన్ చేసే సమయములో, పరిశీలించబడవలసిన సమాచారము ఏది మాకు లభించలేదు.

ముగింపు: 7 మెదడుకు ప్రమాదకరమైన అలవాట్లు అని డబ్ల్యూహెచ్‎ఓ జారీ చేసింది అని క్లెయిమ్ చేసే దృశ్య సమాచారము ఆ సంస్థకు తప్పుగా ఆరోపించబడింది. జాబితా చేయబడిన కొన్ని అలవాట్లు ఆరోగ్యముపై ఇతర ప్రతికూల ప్రభావాలు కలిగి ఉండవచ్చు కాని మెదడుపై ప్రత్యక్ష ప్రభావము ఉన్నట్లు ఇంకా రిపోర్ట్ చేయబడలేదు.

  • Claim Review : 7 మెదడుకు ప్రమాదకరమైన అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీయవచ్చు
  • Claimed By : పిజస్ కాంతి గిరి
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later