మీ శ్వాసను కర్సర్ కదలికకు అనుగుణంగా బిగపట్టుకోవడం అనేది కోవిడ్-19 కోసం స్వీయ-పరీక్ష అంటూ వైరల్ అవుతున్న వీడియో నకిలీది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసమంటూ విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ నెంబర్‌లో ఒక వీడియోను రిసీవ్ చేసుకుంది. ఆ వీడియో చతురస్రాకారంలో ఉంది. ఓ బిందువు ఆ వీడియోలో చుట్టూ కదులుతోంది. ఆ వీడియోలో సూచించిన మాదిరిగా కర్సర్ కదలికలను బట్టి మీ శ్వాసను ఆపుకుంటే.. మీకు కరోనా వైరస్ సోకినట్లుకాదు.. అంటూ ఆ వీడియో కింద ఓ రైటప్ కూడా ఇచ్చారు. విశ్వాస్ న్యూస్ ఈ వీడియోపై దర్యాప్తు చేసినప్పుడు.. డాట్-టెస్ట్ లేదా కర్సర్ గేమ్ అనే ఈ వీడియో కరోనావైరస్ కోసం రూపొందించిన స్వీయ తనిఖీ పరీక్ష కాదని మేము కనుగొన్నాము.
దావా :
వాట్సాప్‌లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో చతురస్రాకారం చుట్టూ కదులుతున్న కర్సర్‌ను చూపిస్తోంది. ఈ పోస్ట్ క్లెయిమ్ చేసుకుంటున్న దావా ప్రకారం, వీడియోలో పేర్కొన్న సూచనల ఆధారంగా ఊపిరి పీల్చుకోవడం, గాలి లోపలికి పీల్చి అలాగే కొద్దిసేపు బిగబట్టడం వంటివి చేయడం ద్వారా కరోనా వైరస్ ఉందా, లేదా అన్న విషయాన్ని నిర్ధారించవచ్చు.
దర్యాప్తు :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కరోనావైరస్ (COVID-19) యొక్క లక్షణాలలో ఒకటి. కానీ, జ్వరం, గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు.
వైరల్ వీడియో ‘మీరు ఒక నిర్దిష్ట సమయం వరకు మీ శ్వాసను అలాగే బిగపట్టుకోగలిగితే, మీకు కోవిడ్-19 లేదని నిర్ధారణకు రావచ్చు’ అనే ఒక ఊహపై ఆధారపడి ఉంటుంది. విశ్వాస్ న్యూస్ ఇంతకుముందే ఇలాంటి ఓ నకిలీ పోస్ట్ విషయంలో వాస్తవం ఏంటో తేల్చింది. ఆ పోస్టులో మీ శ్వాసను 10 సెకన్ల పాటు ఉంచడం వల్ల మీకు కరోనావైరస్ ఉందో లేదో చెక్‌చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గానీ, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) గానీ కరోనాకు సంబంధించి ప్రజల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో అలాంటి స్వీయ తనిఖీ పరీక్ష ఏదైనా సూచించాయా ? అనే అంశం తెలుసుకునేందుకు మేము శోధించాము. ఎక్కడా, ఆరోగ్య సంస్థల వెబ్‌సైట్లలో అటువంటి స్వీయ తనిఖీ పరీక్ష ప్రస్తావించబడలేదు.
దానికి బదులుగా, ఆరోగ్య సంస్థలు తమకు కోవిడ్-19 సోకి ఉండవచ్చని భయపడే వ్యక్తులకు సలహాలు ఇస్తాయి, వారు ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలి. అంతేకాదు.. ఆరోగ్య అధికారి నుండి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో వైద్య సహాయం తీసుకోవాలి.
WHO మార్గదర్శకాల ప్రకారం, కోవిడ్-19 యొక్క సాధారణ లక్షణాలు.. పొడి దగ్గు, అలసట మరియు జ్వరం. కొంతమంది న్యుమోనియా వంటి వ్యాధి యొక్క తీవ్రమైన రూపాలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మీకు వైరస్ ఉత్పత్తి చేసే కోవిడ్-19 వ్యాధి ఉందో లేదో నిర్ధారించడానికి ఉత్తమ మార్గం ల్యాబొరేటరీ పరీక్ష. ఈ శ్వాస వ్యాయామంతో మీరు దీన్ని ధృవీకరించలేరు. ఇలా చేయడం కూడా ప్రమాదకరం.
విశ్వాస్ న్యూస్ న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్, క్రిటికల్ కేర్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ రాజేష్ చావ్లాను సంప్రదించింది. ఆయన ఈ వైరల్ వాదనను ఖండించారు. ‘ఇది అస్సలు నిజం కాదు. పరీక్ష కోసం అలాంటి సదుపాయం ఏదీ లేదు. ఇది కరోనావైరస్ చుట్టూ వ్యాపించే తప్పుడు సమాచారం.’ అని చెప్పారు.
మిచిగాన్ విశ్వవిద్యాలయానకి చెందిన మిచిగాన్ మెడిసిన్ వెబ్‌సైట్‌లో చెప్పినట్లుగా, శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి లోతైన శ్వాస ఒకటి అవసరం. ఎందుకంటే మీరు గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు, అది మీ మెదడును శాంతింపజేయడానికి, మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఒక సందేశాన్ని పంపుతుంది. మెదడు ఈ సందేశాన్ని మీ శరీరానికి పంపుతుంది. మీరు ఒత్తిడికి గురైన సమయంలో హృదయ స్పందన రేటు, వేగంగా శ్వాస తీసుకోవడం మరియు అధిక రక్తపోటు వంటివి సంభవిస్తాయి.
ఏదైనా శ్వాస వ్యాయామం కోసం ఇవి సాధారణ సిఫారసు అయిఉండొచ్చు. అంతేగానీ, ప్రత్యేకంగా ఈ గేమ్ కోసం కాకపోవచ్చు. మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, యాదృచ్ఛిక వ్యాయామాలు చేయాలనుకుంటే.. వాటిని ప్రయత్నించే ముందు మీరు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి.
https://www.instagram.com/vishvasnews/?utm_source=ig
DISCLAIMER: #కరోనావైరస్‌ఫ్యాక్ట్స్ డేటాబేస్ కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభం నుండి ప్రచురించబడిన వాస్తవాలు-తనిఖీలను నమోదు చేస్తుంది. మహమ్మారి మరియు దాని పర్యవసానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రోజులు, వారాలు గడిచే సరికి ఖచ్చితమైన డేటా మారవచ్చు. కాబట్టి దీనిని ఎవరికైనా షేర్ చేయడానికి ముందు మీరు చదువుతున్న ఫాక్ట్-చెక్ స్టోరీ ప్రచురించబడిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి.
निष्कर्ष: మీ శ్వాసను కర్సర్ కదలికకు అనుగుణంగా బిగపట్టుకోవడం అనేది కోవిడ్-19 కోసం స్వీయ-పరీక్ష అంటూ వైరల్ అవుతున్న వీడియో నకిలీది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923