ఈ ఆడియో ఏఐ-జనరేట్ చేయబడిన జో బైడెన్ యొక్క కంఠస్వరము యొక్క ఆడియో క్లోన్ ఉపయోగించి సృష్టించబడిన ఒక డీప్‌ఫేక్ అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. అసలైన వీడియో జులై 15, 2024 నాడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తరువాత బైడెన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు తీయబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). జులై 21, 2024 నాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తాను మళ్ళీ-ఎన్నికలను కోరనని మరియు 2024 అధ్యక్ష పోటీ నుండి ఉపసంహరించుకుంటానని ప్రకటించారు. దీనిని అనుసరించి, బైడెన్ దుర్భాషలాడినట్లు కనిపించే ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది అధ్యక్ష పదవికి పోటీ నుండి తాను విరమించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత బైడెన్ యొక్క మొదటి బహిరంగ సభ అనే క్లెయిమ్ తో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఆడియో ఏఐ-జనరేట్ చేయబడిన జో బైడెన్ యొక్క కంఠస్వరము యొక్క ఆడియో క్లోన్ ఉపయోగించి సృష్టించబడిన ఒక డీప్‌ఫేక్ అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. అసలైన వీడియో జులై 15, 2024 నాడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తరువాత బైడెన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు తీయబడింది.
X యూజర్ ‘పవన్‘ వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “బ్రేకింగ్ వార్త: అధ్యక్ష పదవికి పోటీ నుండి విరమించుకున్న తరువాత అధ్యక్షుడు జో బైడెన్ మొదటి వీడియో ప్రసంగం చేశారు.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ఇక్కడ చూడండి.
మా దర్యాప్తును మొదలుపెట్టటానికి మేము ముందుగా వైరల్ వీడియో బాగా పరీక్షించాము. వీడియో యొక్క క్రింది భాగాన ఎడమ వైపున పిఎస్బి న్యూస్ యొక్క లోగో కనిపించింది. మేము కీవర్డ్స్ తో సెర్చ్ చేశాము మరియు పిఎస్బి న్యూస్ నుండి జులై 22, 2024 తేదీ ఉన్న ఒక ట్వీట్ ను కనుగొన్నాము. వీడియో ఒక డీప్‌ఫేక్ అని ఆ ట్వీట్ స్పష్టం చేస్తూ ఇలా పేర్కొనింది: “మా లోగోతో అధ్యక్షుడు జో బైడెన్ యొక్క ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాపై సర్క్యులేట్ చేయబడుతోంది. అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేయలేదు. పిఎస్బి న్యూస్ ఈ వీడియో యొక్క వినియోగానికి అధికారం ఇవ్వలేదు, మరియు ప్రేక్షకులను తప్పుదోవపట్టించగల వార్తా వీడియో లేదా ఆడియో యొక్క మార్పును మేము ఏ విధంగానూ మన్నించము”.
దీని తరువాత, మేము అసలైన వీడియో కోసం సెర్చ్ చేయడం ప్రారంభించాము మరియు పూర్తి వీడియో వైట్ హౌస్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై జులై 15, 2024 నాడు అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని ఖండించారు.
మేము ఈ వీడియోకు సంబంధించి మా డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్ లేదా DAU (మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలియన్స్ యొక్క ఒక కార్యక్రమము) ను సంప్రదించాము, మరియు ఈ వీడియోను ఏఐ పరీక్షించే సాధనాలపై పరీక్షించిన తరువాత, హైవ్ మాడరేషన్ మరియు లోకస్ నిపుణులు ఈ ఆడియో సింథటిక్ అని కనుగొన్నారు. విజువల్స్ సంబంధించినంత వరకు, వీడియోలో చూపించబడిన విజువల్స్ ను డీప్‌ఫేక్ అని హైవ్ మాడరేషన్ గుర్తించింది మరియు ఈ వీడియోలో ఏఐ సంభావ్యత కూడా కనిపించిందని ట్రూమీడియా కూడా పేర్కొనింది.
మేము ఏఐ నిపుణుడు అజ్హర్ మాచ్వే ను సంప్రదించాము, ఆయన ఇది డీప్‌ఫేక్ అని ధృవీకరించారు.
నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన X యూజర్ గురించిన మా దర్యాప్తులో, ‘పవన్’ కు 2000 పైగా ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
ముగింపు: తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ ఈ వీడియో డీప్‌ఫేక్ అని కనుగొనింది. ఇందులో బైడెన్ పెదవుల కదలికలు మరియు ఆయన కంఠస్వరము మార్చబడింది. అసలైన వీడియో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నము తరువాత జులై 15, 2024 నాడు బైడెన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగీంచినప్పటిది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923