Fact Check: ఒక వీడియో కాల్ పై రోహిత్ శర్మ మరియు ఎంఎస్ ధోని మాట్లాడటాన్ని ఉద్దేశపూర్వకంగా చూపించబడుతున్న వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది

తన దర్యాప్తులో, వీడియో తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. రెండు వేరు వేరు వీడియోలను కలిపి ఈ వైరల్ వీడియో సృష్టించబడింది. రోహిత్ శర్మ వీడియో 2020లో ఇన్స్టాగ్రాం లైవ్ పై డేవిడ్ వార్నర్ తో సంభాషణ జరిపినప్పటిది. కాగా, మహేంద్ర సింగ్ ధోని వీడియో 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‎కే) సీఈఓ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపినప్పటిది. ఈ రెండు వీడియోలు కలిపి వైరల్ చేయబడింది.

Fact Check: ఒక వీడియో కాల్ పై రోహిత్ శర్మ మరియు ఎంఎస్ ధోని మాట్లాడటాన్ని ఉద్దేశపూర్వకంగా చూపించబడుతున్న వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది

కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – ఇండియా దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్ అయిన ఐసిసి టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో, ఒక వీడియో సోషల్ మీడియాపై వైరల్ అయ్యింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని మరియు రోహిత్ శర్మ ఒక వీడియో కాల్ పై మాట్లాడటం చూపించబడింది. మ్యాచ్ గెలిచిన తరువాత ధోని ఒక వీడియో కాల్ ద్వారా రోహిత్ శర్మను అభినందించారని క్లెయిమ్ చేయబడుతోంది.

తన దర్యాప్తులో, వీడియో తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. రెండు వేరు వేరు వీడియోలను కలిపి ఈ వైరల్ వీడియో సృష్టించబడింది. రోహిత్ శర్మ వీడియో 2020లో ఇన్స్టాగ్రాం లైవ్ పై డేవిడ్ వార్నర్ తో సంభాషణ జరిపినప్పటిది. కాగా, మహేంద్ర సింగ్ ధోని వీడియో 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‎కే) సీఈఓ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు పంపినప్పటిది. ఈ రెండు వీడియోలు కలిపి వైరల్ చేయబడింది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

జులై 1, 2024 నాడు ఫేస్‎బుక్ యూజర్ ఫ్యాక్ట్స్ భాయ్ (ఆర్కైవ్ లింక్) వైరల్ వీడియోను “ధోని వరల్డ్ కప్ సాధించినందుకు రోహిత్ శర్మను అభినందించారు” అనే శీర్షికతో షేర్ చేసారు. మరొక ఫేస్‎బుక్ యూజర్ సాగర్ సూర్యవంశి కూడా అదేరోజు ఈ వీడియోను (ఆర్కైవ్ లింక్) షేర్ చేస్తూ ఇలా క్లెయిమ్ చేశారు, “మహేంద్ర సింగ్ ధోని చేసిన వీడియో కాల్ కు రోహిత్ శర్మ భావోద్వేగానికి గురి అయ్యారు, వీడియో చూడండి #వరల్డ్‎కప్2024 #వైరల్‎వీడియోఛాలెంజ్ #రోహిత్‎శర్మ45 #ఫాలోఫర్‎ఫాలోబ్యాక్ $విరాట్‎కోహ్లి

దర్యాప్తు:

వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము రెండు వీడియోలను వేరువేరుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాము.

మొదటి వీడియో

మేము గూగుల్ ఇమేజెస్ ఉపయోగించి రోహిత్ శర్మ వీడియో యొక్క స్క్రీన్ షాట్ ను సెర్చ్ చేశాము. ఈ వీడియో మాకు ముంబై ఇండియన్స్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై కనిపించింది. ఈ వీడియో మే 8, 2020 నాడు అప్లోడ్ చేయబడింది. అందించబడిన సమాచారం ప్రకారం, ఈ వీడియో రోహిత్ శర్మ మరియు డేవిడ్ వార్నర్ కు చెందినది.

రోహిత్ శర్మ మరియు డేవిడ్ వార్నర్ మధ్య వీడియో కాల్ ను వార్నర్ యొక్క ధృవీకరించబడిన ఇన్స్టాగ్రాం అకౌంట్ పై కూడా చూడవచ్చు. ఇది మే 8, 2020 నాడు షేర్ చేయబడింది.

రెండవ వీడియో

మా దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము మహేంద్ర సింగ్ ధోని యొక్క వీడియో కోసం సెర్చ్ చేశాము మరియు సంబంధిత వార్తను స్పోర్ట్స్ కీడ వెబ్సైట్ పై కనుగొన్నాము. అక్టోబరు 22, 2023 నాడు ప్రచురించబడిన వార్తలో, ధోని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొనబడింది.

వైరల్ వీడియోకు సంబంధించిన వార్తలు మాకు ఇతర వార్తా వెబ్సైట్స్ పై కూడా లభించాయి.

దైనిక్ జాగరణ్ వెబ్సైట్ పై జూన్ 20, 2024 నాడు ప్రచురించబడిన వార్త ప్రకారం, ధోని భారత క్రికెట్ జట్టును వారి ఫోటోను తన అధికారిక ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై షేర్ చేస్తూ అభినందించారు. శీర్షిక ఈ విధంగా ఉంది, “నా గుండె పరుగెత్తుతూ ఉంది. శాంతంగా ఉన్నందుకు, మిమ్మల్ని మీరు విశ్వసించినందుకు మరియు మీరు చేసినదానికి అభినందనలు. ఇంటి నుండి చూస్తున్న భారతీయుల తరఫున మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వరల్డ్ కప్ ను తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. శుభాకాంక్షలు, విలువైన పుట్టినరోజు బహుమతికి ధన్యవాదములు.”

మేము వీడియోకు సంబంధించి దైనిక్ జాగరణ్ స్పోర్ట్స్ ఎడిటర్ అభిషేక్ త్రిపాఠిని కలిశాము మరియు ఈ వీడియో ఎడిట్ చేయబడినదని మరియు రెండు వీడియో వేరువేరు వీడియోలని ఆయన ధృవీకరించారు.

చివరిగా, మేము వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ క్రికెట్-సంబంధిత పోస్ట్‎లు షేర్ చేస్తూ ఉంటారని కనుగొన్నాము.

ముగింపు: రోహిత్ శర్మ మరియు మహేంద్ర సింగ్ ధోనిల వైరల్ వీడియో ఎడిట్ చేయబడినదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు వెల్లడించింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు