X
X

Fact Check: రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ యొక్క ఎడిట్ చేయబడిన వీడియో వైరల్ అయ్యింది

కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ ఉన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆయన భారతీయ జనతా పార్టి (భాజపా) ను ఓట్ల కోసం నినాదాలపై ఆధారపడే ఒక పార్టీగా పేర్కొనడం వినవచ్చు. భజన్ లాల్ బాజపా ను ఈ విధంగా వర్ణించారు అనే క్లెయిమ్ తో సోషల్ మీడియా యూజర్లు ఈ క్లిప్పింగ్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వైరల్ వీడియో గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఎడిటింగ్ ద్వారా భజన్ లాల్ ప్రసంగం తారుమారు చేయబడిందని, దానితో అసలైన అర్థాన్ని మార్చి ఎంపిక చేయబడినట్లు వినబడుతోంది. ఎడిట్ చేయబడని ఫుటేజ్ ను సమీక్షించినప్పుడు, భజన్ లాల్ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రస్తావించారని, భాజపా నినాదాల ద్వారా ఓట్లు సంపాదిస్తుందని ఆరోపించారని స్పష్టం అయ్యింది. చివరికి మా దర్యాప్తులో వైరల్ పోస్ట్ అసత్యము అని తేలింది.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ పేజ్ ఆర్‎జే.55.పోకరణ్.సిటి ఒక వీడియో ను అప్లోడ్ చేసి ఈ విధంగా వ్రాసింది “భారతీయ జనతా పార్టీ తన నినాదాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతుంది: సిఎం భజన్ లాల్ శర్మ.” ఈ పోస్ట్ నిజమని నమ్మి, ఇతర యూజర్లు కూడా దీనిని సోషల్ మీడియా పై వైరల్ చేస్తున్నారు.


దర్యాప్తు:

వైరల్ వీడియో యొక్క ప్రామాణీకతను పరీక్షించుటకు, విశ్వాస్ న్యూస్ అనేక చర్యలు చేపట్టింది. మేము వీడియో నుండి కీఫ్రేమ్స్ తీసుకొన్నాము మరియు రివర్స్ ఇమేజ్ సెర్చెస్ నిర్వహించుటకు గూగుల్ లెన్స్ ఉపయోగించాము. మాకు ఫిబ్రవరి 22 న యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది. ఇందులో ముఖ్యమంత్రి భజన్ లాల్ ప్రసంగం ఉంది. ఈ ప్రసంగములో, భజన్ లాల్ ఇలా పేర్కొనడం వినవచ్చు, “ప్రతిపక్షాలు ఆర్టికల్ 370 ని తొలగించలేము అని అనేవారు”

రక్తము ప్రవహిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదము. వాళ్ళు నినాదాల ఆధారంగా ఓట్లు అడుగుతారు. మనము చెప్పేది అంతా ప్రకటన కాదు అని మేము అన్నాము.”

తదుపరి దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కు RKG TV అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై ఫిబ్రవరి 21 నాడు లైవ్ గా ప్రసారం అయిన దీని అసలైన మరియు సుదీర్ఘమైన వీడియో లభించింది. భజన్ లాల్ యొక్క ప్రసంగం వీడియోలో 24:40 మార్క్ వద్ద ప్రారంభం అవుతుంది, వైరల్ క్లిప్పింగ్ కు సంబంధించిన భాగము 35:17 నిమిషాలకు కనిపిస్తుంది.

ఫిబ్రవరి 21 నాడు నిర్వహించబడిన ఒక వేడుక అయిన శ్రీ ఆలం నకళంగ్ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్యమమ్త్రి భజన్ లాల్ శర్మ హాజరు అయ్యారు అని ఈ వీడియో యొక్క శీర్షిక వెల్లడిస్తుంది. ఈ వేడుక కొత్తగా నిర్మించబడిన నకళంగ్ ఆలంజీ మహరాజ్ మందిరము, ఆల్పురా ధోరా, గుడమలాని, బార్మర్ జిల్లా కొరకు మూడు-రోజుల ప్రతిష్ఠాపన వేడుకల ప్రారంభోత్సవం కొరకు ఫిబ్రవరి 20 నాడు జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి హాజరు అయ్యారు.

దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ధృవీకరణ కొరకు విశ్వాస్ న్యూస్ రాజస్థాన్ లోని బ్యూరో ఆఫ్ దైనిక్ జాగరణ్, నరేంద్ర శర్మను సంప్రదించింది. వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది అని సూచిస్తూ, భాజపాకు సంబంధించి భజన్ లాల్ ఇటువంటి ప్రకటన ఏది చేయలేదని శ్రీ శర్మ ధృవీకరించారు

చివరిగా, మేము ఫేస్‎బుక్ పేజ్ ఆర్‎జే.55.పోకరణ్.సిటి ని స్కాన్ చేశాము. ఈ పేజ్ రాజస్థాన్ లోని జైసల్మేర్ నుండి ఆపరేట్ చేయబడుతోందని, దీనికి 3,000 మంది ఫాలోయర్స్ ఉన్నారని తెలిసింది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ ఒక దర్యాప్తు నిర్వహించింది మరియు ఈ వైరల్ పోస్ట్ అసత్యము అని కనుగొనింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ ప్రసంగము ఎడిట్ చేయబడి, తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో వైరల్ చేయబడిందని ఈ దర్యాప్తులో తేలింది.

  • క్లెయిమ్ సమీక్ష : https://www.facebook.com/reel/692817903051771
  • క్లెయిమ్ చేసినది : ఫేస్‎బుక్ పేజ్ ఆర్‎జే.55.పోకరణ్.సిటి
  • వాస్తవ తనిఖీ : అసత్యము
  • Claim Review : భజన్ లాల్ బాజపా ను ఈ విధంగా వర్ణించారు అనే క్లెయిమ్ తో సోషల్ మీడియా యూజర్లు ఈ క్లిప్పింగ్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
  • Claimed By : ఫేస్‎బుక్ పేజ్ ఆర్‎జే.55.పోకరణ్.సిటి
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later