వాస్తవ తనిఖీ: నిరుద్యోగము కొరకు రాహుల్ గాంధి బిజేపిని నిందించలేదు, వైరల్ వీడీయో మార్చబడినది మరియు నకిలీది
- By: Devika Mehta
- Published: Nov 16, 2022 at 11:01 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సమయములో, రాహుల్ గాంధి ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఆయన ప్రసంగం సమయములో, దేశములో బిజేపీ పాలనలో నిరుద్యోగ డేగల గురించిన ఆందోళనను ఆయన వ్యక్తపరచారు అని క్లెయిమ్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేయబడినదని మరియు రాహుల్ గాంధికి వ్యతిరేకంగా ప్రచారం చేయుటకు సోషల్ మీడియాపై సర్క్యులేట్ చేయబడిందని కనుగొనింది. అసలైన వీడియో ఢిల్లీ ఎన్నికల సమయములో రాహుల్ గాంధి బిజేపి మరియు నరేంద్ర మోడిని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నప్పటిది; ఈ ప్రసంగం యొక్క ఒక ఎడిట్ చేయబడిన క్లిప్ అసత్యపు క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
క్లెయిమ్
ఇన్స్టాగ్రాం యూజర్ ‘l.క్రియేషన్స్.l’ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు (ఆర్కైవ్ లింక్). ఇందులో రాహుల్ గాంధి దేశములోని నిరుద్యోగ డేగల గురించి మాట్లాడారు.
ఆయన ఇలా అన్నారు, “…..నాకు ఒక విషయం చెప్పండి…ఇక్కడ ఉన్న డేగ….ఈ డేగలు ఇక్కడ ఎందుకు ఎగురుతున్నాయి. చెప్పండి, ఈ డేగలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? మీలో ఎవరైనా నాకు చెప్పగలరా ఈ డేగలు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయి…ఎందుకంటే గత అయిదు సంవత్సరాల నుండి వాటికి ఉపాధి దొరకడం లేదు.”
దర్యాప్తు
వీడియోలోని ఆడియో విన్న తరువాత, అది సహజమైనది కాదు అని స్పష్టం అవుతుంది, కాని ఇది ఎడిట్ చేయబడింది మరియు టాంపర్ చేసింది. వైరల్ వీడియో పై తగిన కీవర్డ్స్ ఆధారంగా చేసిన సెర్చ్ ద్వారా మేము ఆ వీడియో రెండు సంవత్సరాల క్రితం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిందని కనుగొన్నాము. అందించబడిన సమాచారము ప్రకారం, ఈ వీడియో డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 కొరకు రాహుల్ గాంధి కోండ్లిలో ఒక బహిరంగ సభలో చేసిన ప్రసంగం.
23.3. నిమిషాల వీడియోలో 8.50 నిమిషాల ఫ్రేం కంటే ఎక్కువగా విన్న తరువాత, ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క పూర్తి సందర్భము మనకు తెలుస్తుంది. బిజేపి మరియు నరేంద్రమోడిలను టార్గెట్ చేస్తూ, రాహుల్ గాంధి ఇలా అన్నారు, “….గత అయిదు సంవత్సరాలలో, నరేంద్ర మోడి 3 లక్షల 50 వేల కోట్ల రూపాయలను అనిల్ అంబాని మరియు అదాని వంటి వారికి అందించారు. ఎందుకు అనేది మీకు అర్థం అవుతోందా? మీలో మీరు పోట్లాడుకునేవారు కాబట్టి, మీరు విభజించబడ్డారు. మీ డబ్బు అదాని మరియు అంబాని జేబుల్లోకి ఎంత వెళ్తుందో అని కూడా మీకు తెలియదు.”
దీని తరువాత, ఆయన ఆకాశం వైపు చూపిస్తూ ఇలా అన్నారు, “……ఈ డేగలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? నాకు చెప్పండి! ఈ డేగలు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయి, అవి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాయి?….. చెప్పండి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అయిదు కోట్లు, పది కోట్లు…. చూడండి, ఆ బాలిక అయిదు కోట్లు ….పది కోట్లు అని చెప్తోంది. సరే, దానికి యాభై కోట్లు అవుతుంది. నరేంద్ర మోడిగారు కేవలం కొన్నిరోజులలో భారతదేశములోని అత్యంత సంపన్నులైన వారికి ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయల పన్నును మాఫీ చేశారు.”
వీడియోను విన్న తరువాత, రాహుల్ గాంధి మురికిని తొలగించే సందర్భములో డేగల గురించి మాట్లాడారు మరియు నిరుద్యోగానికి సంబంధించి కాదు అని స్పష్టం అవుతుంది. నిరుద్యోగ సమస్య మార్చబడింది మరియు ఈ మొత్తం ప్రసంగము యొక్క సందర్భాన్ని మార్చే విధంగా చేర్చబడింది.
తదుపరి ధృవీకరణ కోసం, విశ్వాస్ న్యూస్ ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి అభిమన్యు త్యాగి గారిని సంప్రదించింది. ఆయన ఇలా అన్నారు, “ఈ వీడియో ఎడిటింగ్ సహాయముతో తయారు చేయబడింది మరియు బిజేపి ఐటి సెల్ ఈ పని చేస్తూ ఉంటూ వాస్తవమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తుంది.”
అసత్యము క్లెయిమ్ తో ఈ వైరల్ వీడియోను షేర్ చేసిన ఈ యూజర్ కు ఇన్స్టాగ్రాం పై 400 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: నరేంద్ర మోడి ప్రభుత్వ పాలనలో డేగలు నిరుద్యోగముతో ఉన్నాయి అనే క్లెయిమ్ తో రాహుల్ గాంది పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో నకిలీది మరియు ప్రచారము కోసం సృష్టించబడింది.
- Claim Review : దేశములో బిజేపి పాలనలో డేగల నిరుద్యోగముపై రాహుల్ గాంధి
- Claimed By : Iజి యూజర్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.