కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్ – ఒక వైరల్ వీడియో కాషాయ రంగు జండాలతో అలంకరించబడిన ఒక ర్యాలీ వైపు రాళ్ళు విసురుతున్న వ్యక్తులను చూపుతుంది. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన ఒక సంఘటన నుండి తీసుకోబడిన విజువల్స్ గా తప్పుగా క్లెయిమ్ చేస్తూ కొంతమంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ వైరల్ వీడియో ఒడిశాకు సంబంధించినది అని మరియు 2023 నాటిదని కనుగొనింది.
ఇది బెంగాల్ లో జరిగిన ఒక సంఘటన అనే ఒక శీర్షికతో, ఒక ఫేస్బుక్ యూజర్ ధర్మేంద్ర ఓఝ, మే 1, 2024 నాడు ఒక వైరల్ వీడియోను షేర్ చేశారు.
ఈ పోస్ట్ ను ధృవీకరించుటకు, మేము ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ తీసుకొని గూగుల్ లెన్స్ పై సెర్చ్ చేశాము. దీని ద్వారా మేము టైమ్స్ నౌ యొక్క యూట్యూబ్ ఛానల్ పై ఏప్రిల్ 13, 2023 నాటి ఒక వీడియోను చూశాము. ఈ వీడియోలో వైరల్ క్లిప్ లో ఉన్నటువంటి దృశ్యాలే ఉన్నాయి మరియు సంభాల్పూర్, ఒడిశాలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీ సమయములో మతపరమైన హింసను రిపోర్ట్ చేశాయి.
దైనిక్ జాగరణ్ మరియు The వైర్ నుండి రిపోర్ట్స్ వంటి అదనపు వనరులు ఏప్రిల్ 2023 లో జరిగిన ఈ సంఘటన యొక్క వివరాలను ధృవీకరించాయి.
ఇటీవల పశ్చిమ బెంగాల్ లో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగాయా అని మేము దర్యాప్తు చేశాము. మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్ పై ఒక రిపోర్ట్ లభించింది. పశ్చిమ బెంగాల్ లోని పుర్బా మేదినిపూర్ జిల్లాలో జరిగిన రామనవమి ఊరేగింపు సమయములో రాళ్ళు విసరడం మరియు హింస జరిగిందని, ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారని ఈ రిపోర్ట్ లో పేర్కొనబడింది.
పశ్చిమ బెంగాల్ లోని దైనిక్ జాగరణ్ లో పనిచేసే విలేఖరి అయిన జేకే వాజ్పేయి, ఈ వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్ లో జరిగినది కాకపోయినా, రాష్ట్రములో రామనవమి సమయములో ఇటువంటి సంఘటనలు జరిగాయని ధృవీకరించారు.
చివరిగా, మేము వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను దర్యాప్తు చేశాము మరియు యూజర్ ధర్మేంద్ర ఓఝ అహ్మదాబాద్ నివాసి అని ఆయనకు 1000 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.
ముగింపు: వైరల్ వీడియో 2023లో ఒడిశాలో జరిగిన సంఘటన అని మరియు పశ్చిమ బెంగాల్ లో జరిన సంఘటనలకు సంబంధం లేదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో కనుగొనింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923