X
X

వాస్తవ తనిఖీ: ‘డిస్నీలాండ్ లో నాట్యం చేస్తున్న చైనీస్ రోబోలు’ నిజానికి మనుషులే; క్లెయిమ్ నకిలీది

  • By: Devika Mehta
  • Published: Apr 30, 2023 at 04:02 PM
  • Updated: May 24, 2023 at 05:05 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాపై ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఇద్దరు నృత్యకారులు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, కలిసి నాట్యం చేయడం చూడవచ్చు. అయితే, సోషల్ మీడియాప అనేక వైరల్ పోస్ట్స్ లలో, ఈ ఇద్దరు నృత్యకారులు మనుషులు కాదని, షాంఘై డిస్నీలాండ్ వద్ద నాట్యం చేస్తున్న చైనీస్ రోబోలని క్లెయిమ్ చేయబడింది.

వీడియోలో ఉన్న ఇద్దరు మానవ నృత్యకారులు రష్యాకు చెందిన వారని, రోబోలు కాదు కాబట్టి ఈ క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. వారు డొమినికన్ రిపబ్లిక్ లో మూలాలు ఉన్న ఒక ఇంద్రియ నృత్యం అయిన ‘బచాటా’ చేస్తున్నారు.

క్లెయిమ్:

ఈ వైరల్ video అసత్యపు క్లెయిమ్ చేసింది: మీరు నమ్ముతారా? వీళ్ళు మనుషులు కాదు, కాని పూర్తి ముఖకవళికలతో అచ్చం మనుషుల మాదిరిగా ఉన్న రెండు చైనీస్ రోబోలు. ఇది చైనాలోని డిస్నీలాండ్ వద్ద ఒక వ్యక్తికి $75 టికెట్ ధర ఉన్న ఒక 5 నిమిషాల షో. ప్రవేశ టికెట్ పొందుటకు ఒక వ్యక్తి సుమారు 4 గంటలు వేచి ఉండవలసినంతగా బయట గుంపు ఉంది.”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు

ఫేస్‎బుక్ మరియు ట్విట్టర్ పై అనేకమంది సోషల్ మీడియా యూజర్లు కూడా ఇటువంటి క్లెయిమ్స్ తో వీడియోను షేర్ చేశారు.

విశ్వాస్ న్యూస్ వాట్సాప్ టిప్ లైన్ నంబర్ +919599299372 పై వీడియో గురించి అనేక ప్రశ్నలను అందుకుంది.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ ముందుగా వీడియోను ఇన్విడ్ టూల్ ద్వారా దర్యాప్తు చేసింది, కీఫ్రేమ్స్ ను సంగ్రహించింది మరియు వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ మరియు యాండెక్స్ ద్వారా సెచ్ చేసింది, ఇది ‘దిలారా బచతేరా’ ఇన్స్టాగ్రాం పేజ్ పై ఒరిజినల్ వీడియోకు తీసుకెళ్తుంది.

బచాతా. డిమా మరియు దిలారా పేజీకి తీసుకెళ్ళే ఒక ఒక యూట్యూబ్ వీడియో  లింక్ మాకు లభించింది

వారి పేర్లకు సంబంధించి గూగుల్ ఓపెన్ సెర్చ్ చేయడము ద్వారా, విశ్వాస్ న్యూస్ కు ఈ website ను చూసింది, ఇది వారిని డిమిత్రి మరియు దిలారా దావిడోవ్ గా గుర్తించింది. వీరు రష్యా మరియు యూఎస్‎ఎస్‎ఆర్ లో ఇదివరకు భాగమైన ఇరుగుపొరుగు దేశాలలో ప్రముఖ బచాతా జంటలలో ఒకరుగా గుర్తించింది

వెబ్సైట్ యొక్క సంక్షిప్త వివరణ ఈ విధంగా ఉంది: “డిమిత్రి మరియు దిలారా సుమారు 10 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ తరగతులను నిర్వహిస్తూ, వివిధ బచాతా ఫార్మాట్స్ ను నేర్పిస్తూ ఉన్నారు. వారు రష్యాలో ఆధునిక బచాతా పార్టీ ఫార్మేషన్ యొక్క మూలాలుగా మరియు సిఐఎస్ లో బచాతా పరిశ్రమ యొక్క ఇంజన్లుగా నిలిచారు.”

టెలిగ్రాం యాప్ పై సంప్రదించినప్పుడు, వారి బృందము స్పందించింది, “అవును, ఇది డిమా (డిమిత్రి సంక్షిప్త నామం) మరియు దిలారా. రష్యాకు చెందిన జంట.”

ఈ వైరల్ పోస్ట్ ను డోరి డిక్రుజ్ అనే యూజర్ షేర్ చేశారు. ఈ యూజర్ కు ఫేస్‎బుక్ పై 166 ఫ్రెండ్స్ ఉన్నారు మరియు వారి ఉండేది ముంబై, మహారాష్ట్రగా చూపించబడింది.

ముగింపు: తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ “చైనీస్ రోబోలు నృత్యం చేయడం” అనే క్లెయిమ్ అసత్యము అని, వీడియోలో కనిపించే నృత్యకారులు మనుషులే అని కనుగొనింది. ఈ ఇద్దరు నృత్యకారుల పేరు డిమా మరియు దిలారా దావిడోవ్ మరియు వారు రష్యాకు చెందినవారు.

  • Claim Review : షాంఘై డిస్నీలాండ్ వద్ద నృత్యం చేస్తున్న చైనీస్ రోబోలు
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: డోరీ డిక్రుజ్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later