చివరిగా : ‘పిఎం (PM) రాంబాన్ యోజన’ కింద రూ. 4,000 మంజూరు చేయబడుతుందని తెలియచేసే మెసేజ్‌లు మరియు పోస్ట్‌లు నకిలీవి. ప్రభుత్వం నుంచి ఆ విధమైన పథకం ఏమీ లేదు.
న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్): వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విశ్వాస్ న్యూస్ ఒక వైరల్ పోస్ట్‌ను చూసింది. ‘ప్రధాన్ మంత్రి రాంబాన్ సురక్ష యోజన’ కింద ఇచ్చిన సందేశంలో అందించిన లింక్‌లో నమోదు చేసుకొనగానే యువతకు రూ.4000 లభిస్తున్నట్లుగా ఆ పోస్ట్ తెలిపింది. లింక్‌తో పాటుగా మెసేజ్‌లు వాట్సాప్‌లో కూడా చాలా ఎక్కువగా షేర్ చేయబడ్డాయి.
ప్రభుత్వం ప్రధానమంత్రి రాంబాన్ సురక్ష యోజనతో ఉచిత చికిత్స మరియు భద్రతను ప్రవేశపెట్టిందని ఫేస్‌బుక్ యూజర్ రాజన్ కుమార్ సజన్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో ఉన్న ఒక బ్యానర్‌ను షేర్ చేశారు.
పోస్ట్ మరియు ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడండి.
మరొక యూజర్ విశాల్ కనూజియా తాను ఫార్వార్డ్ చేసిన మెసేజ్ లాగా కనిపించే వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు (హిందీలో), ప్రధానమంత్రి రాంబాన్ సురక్ష యోజన పధకం రిజిస్ట్రేషన్ జరుగుతోంది ఇక దేశంలోని యువత అందరికీ రూ. 4000 సహాయంగా అందజేయబడుతుంది. మెసేజ్‌లో లింక్ కూడా ఉంది.
పోస్ట్ మరియు ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడండి.
అన్ని పోస్ట్‌లలో వారు రిజిస్టర్ చేయమని అడిగిన లింక్‌లు ఉన్నాయి, ఆ లింక్ ఒక బ్లాగ్‌స్పాట్ లింక్.
వైరల్ మెసేజ్‌తో పాటుగా చాలా ఎక్కువగా షేర్ అవుతున్న లింక్‌ను విశ్వాస్ న్యూస్ ముందుగా పరిశోధించింది.
(అటువంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారి పాఠకులకు విశ్వాస్ న్యూస్ విజ్ఞప్తి చేసింది.)
లింక్‌లో ప్రధానమంత్రి రాంబాన్ సురక్ష యోజన కింద రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన ఫారమ్ కూడా ఉంది.
మేము రిజిస్టర్ చేయడానికి క్లిక్ చేయగా ఫారమ్ UPI APP మరియు కాంటాక్ట్ నంబర్‌ను ఎంచుకోమని వచ్చింది.
ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయడానికి, కాంటాక్ట్ వివరాలు మాత్రమే సరిపోవు, ఆ వ్యక్తి దరఖాస్తు ఫారమ్‌తో పాటుగా వివిధ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.
మేము అన్ని పథకాలతో ఉన్న ప్రభుత్వ పోర్టల్‌లోని విభాగాన్ని సందర్శించాము.
మేము సముచితమైన కీలకపదాలతో కూడా వెతికాము, ‘ప్రధానమంత్రి రాంబాన్ సురక్ష యోజన’ పేరుతో ఏ పథకం కనిపించలేదు.
పరిశోధన చివరి దశలో, విశ్వాస్ న్యూస్ నాగ్‌పూర్ సిటీకి చెందిన అమేయ విశ్వరూప్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రముఖ్‌తో మాట్లాడింది. ‘ప్రధానమంత్రి రాంబాన్ సురక్ష యోజన’ పేరుతో ఎలాంటి పథకం లేదని ఆయన తెలియజేశారు. ఇది ప్రభుత్వ పథకం పేరుతో జరుగుతున్న మోసం.
విశ్వాస్ న్యూస్ ఎట్టకేలకు పోస్ట్‌ను షేర్ చేసిన యూజర్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసింది. విశాల్ కానూజియా అతను ఖలీలాబాద్ నివాసి.
निष्कर्ष: చివరిగా : ‘పిఎం (PM) రాంబాన్ యోజన’ కింద రూ. 4,000 మంజూరు చేయబడుతుందని తెలియచేసే మెసేజ్‌లు మరియు పోస్ట్‌లు నకిలీవి. ప్రభుత్వం నుంచి ఆ విధమైన పథకం ఏమీ లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923