Fact Check : తెలంగాణ-కర్నాటక మధ్యలో నడిచే ప్రత్యేక తీర్థయాత్ర రైలుకు చెందిన వీడియోకు సంప్రదాయిక హంగులు అద్ది తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడింది
- By: Pallavi Mishra
- Published: Aug 30, 2023 at 04:26 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। సోషల్ మీడియా పై ఒక రైలుకు చెందిన వీడియో చక్కర్లు కొడుతోంది. రైలు ముందు ఒక మసీదు కటౌట్ తగిలించబడింది అని మరియు దాని దగ్గర ఉర్దూలో వ్రాసి ఉంది అని వైరల్ వీడియోలో చూడవచ్చు. రైలు పైన కూడా అలంకార వస్తువులు పెట్టి ఉన్నాయి. పోస్ట్ ను షేర్ చేస్తూ, హైదరాబాదు నుండి పశ్చిమ బెంగాల్ వెళ్ళే ప్యాసింజర్ రైలును ముస్లిం వర్గానికి చెందిన వారు బలవంతంగా అలంకరించారు అని క్లెయిమ్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ వీడియోలో ఒక ప్రత్యేక తీర్థయాత్ర రైలు కనిపిస్తుంది, ఇది ఈ సంవత్సరం ఆగస్ట్ 1-3 మధ్యలో వాడి, కర్నాటక మరియు హైదరాబాదు మధ్య నడిచింది. ఇది మామూలు ప్యాసింజర్ రైలు కాదు.
ఏది వైరల్ అవుతోంది?
ఫేస్బుక్ యూజర్ ‘సంజయ్ కుమార్ చౌదరీ’ ఆగస్ట్ 4న ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “హైదరాబాదు నుండి పశ్చిమ బెంగాల్ వెళ్ళే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్ప్రెస్ గా తయారు చేశారు. ఇలాంటి బండి నడవదు అని గార్డ్ చెప్తూ ఉన్నా కాని జిహాదీలు మొండిగా బండిని ఇలాగే నడిపించమని చెప్పారు. ఇది ఎలాంటి మానసిక పరిస్థితి? ఇస్లామిక్ రాజ్యముగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా?”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ పోస్ట్ యొక్క దర్యాప్తు కొరకు మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయం తీసుకున్నాము. కీవర్డ్స్ తోపాటు వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ఉపయోగించి మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు మాకు ఒక వీడియో లభించింది. ఆగస్ట్ 2, 2023 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియోలో ఈ రైలును చూడవచ్చు. ఈ వీడియోలో కనిపించే ఇంజన్ నంబరు మరియు వైరల్ వీడియోలో కనిపించే ఇంజన్ నంబరు ఒకటే. వీడియో వెంబడి ఉన్న వివరణలో ఇలా వ్రాసి ఉంది, “46 URS-E-QUADEER HAZRAT KHWAJA SYED MOHAMMED BADSHAH QUADRI CHISHTI YAMANI QUADEER HALKATTA SHAREEF” (46 ఉర్స్-ఏ-క్వాదీర్ హజ్రత్ ఖ్వాజా సయ్యద్ మొహమ్మద్ బాద్షా క్వాద్రి చిస్తి యమాని కాదిర్ హల్కత్త షరీఫ్)”
ఇక్కడి నుండి క్లూ తీసుకొని మేము గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మాకు “హకట్టా షరీఫ్‘’ సైయ్యద్ మొహమ్మద్ బాద్షా క్వాద్రి-ఉల్-చిస్తి యమనీ షాయ్చురీ యొక్క దర్గా అని, ఇది బాద్షా క్వాద్రీ పేరున కూడా అందరికి తెలుసు అని మరియు కర్నాటకలోని గుల్బర్గా జిల్లా, వాడిలో ఉంది అని తెలిసింది. ప్రజలు ప్రతి సంవత్సరం బదేషా క్వాద్రీ యొక్క బర్సీ లేదా “ఉర్స్” కొరకు హల్కట్టా షరీఫ్ యాత్ర చేస్తారు. ఈ యాత్రల సమయ్ అములో రైలును అలంకరిస్తారు.
మరింత సెర్చ్ చేసినప్పుడు మాకు దక్షిణ మధ్య రైల్వే జులై 27, 2023 నాడు “ఉర్స్ వేడుకల కొరకు హైదరాబాదు – వాడి మధ్య రిజర్వేషన్ లేని ప్రత్యేక రైళ్ళ” పై ఒక పత్రికా ప్రకటన విడుదల చేయబడింది. పత్రికా ప్రకటనలో ఇలా వ్రాయబడింది, “ఆగస్ట్ 1, 2023 నాడు వాడి జంక్షన్ దగ్గర హల్కట్టా షరీఫ్ లో మహనీయ సంత్ హజరత్ క్వాజా సైయ్యద్ మొహమ్మద్ బదేషా కాద్రీ చిస్తీ యమనీ యొక్క ఉర్స్-ఏ-షరీఫ్ యొక్క 46వ వార్షికోత్సవములో పాల్గొనే యాత్రీకులు కాక రద్దీని తక్కువ చేయటానికి నాలుగు ప్రత్యేక రైళ్ళను ఈ దిగువన తెలిపిన విధంగా నడిపించబడతాయి.”
దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం ఉర్స్ ఉత్సవం సందర్భంగా యాత్రికుల కొరకు కర్నాటకలో హల్కట్టా షరీఫ్ వెళ్ళేందుకు ప్రత్యేక రైళ్ళ ఏర్పాటు చేస్తుంది. మాకు 2017 మరియు 2018 యొక్క యాత్ర సూచనలు ఉన్న ఒక ట్వీట్ కూడా లభించింది. ఇందులో ఈ అంశానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే యొక్క పిఆర్ఓ, సీహెచ్ రాకేష్ ను సంప్రదించాము. ఈ వీడియో ఒక ప్రత్యేక రైలుకు సంబంధించినది అని, ప్యాసెంజర్ రైలు కాదని ఆయన ధృవీకరించారు. ఆయన ఇలా అన్నారు, “ఇది ఒక ప్రత్యేక రైలు, ఇది హైదరాబాదు మరియు వాడి మధ్య నడుస్తుంది. ప్రతి సంవత్సరం హజరత్ ఖ్వాజా సైయ్యద్ మొహమ్మద్ బాదేషా కాద్రీ చిస్తీ యమనీ యొక్క ఉర్స్-ఏ-షరీఫ్ యొక్క వార్షికోత్సవ వేడుకలకు వచ్చే యాత్రికులకు మరియు రద్దీ కొరకు ప్రత్యేక రైళ్ళు నడిపించబడతాయి. ఈ సంవత్సరం ఆగస్ట్ 1-3, 2023 మధ్యలో ప్రత్యేక రైళ్ళ రెండు ట్రిప్ ను నడిపించబడతాయి.”
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ ‘సంజయ్ కుమార్ చౌదరీ’ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేసినప్పుడు, అతనికి 4000 కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు మరియు ఆయన మీరట్ నివాసి అని తెలిసింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ వీడియోలో ఒక ప్రత్యేక తీర్థయాత్ర రైలు కనిపించింది, ఇది ఈ సంవత్సరం ఆగస్ట్ లో వాడి, కర్నాటక మరియు హైదరాబాదుల మధ్య నడుస్తుంది. ఇది ఒక మామూలు ప్యాసింజర్ రైలు కాదు.
- Claim Review : హైదరాబాదు నుండి పశ్చిమ బెంగాల్ వెళ్ళే ఒక రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్ప్రెస్ చేశారు.
- Claimed By : ఫేస్బుక్ యూకర్ ‘సంజయ్ కుమార్ చౌదరీ’
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.