కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): పంజాబ్-హర్యాణా సరిహద్దులలో జరిగిన రైతుల ఉద్యమము యొక్క వీడియో తప్పుదోవపట్టించే వీడియో మరియు ఫోటోతో వైరల్ చేయబడుతోంది. ఈ లింక్ లో ఒక వీడియో వైరల్ చేయబడుతోంది, ఇందులో కొంతమంది నమాజ్ చదువుతూ ఉండడం చూడవచ్చు. ఈ వీడియోను మతపరమైన క్లెయిమ్ తో షేర్ చేస్తూ యూజర్ దీనిని ఇటీవలి రైతు ఉద్యమానికి సంబంధించినది అని షేర్ చేస్తున్నారు.
వైరల్ చేయబడుతున్న వీడియో 2021 సంవత్సరము నుండి సోషల్ మీడియోలో ఉందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియోకు ఇటీవలి రైతు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు.
ఫేస్బుక్ యూజర్ వైరల్ అయిన పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “హర్యాణా సరిహద్దులలో పంజాబ్ రైతులలో ఎక్కువమంది నిహంగ్ సిఖ్ తల్వార్ లు ఉన్నారు, వారు మసీదులో నమాజ్ చదువుతూ కనిపించారు లేదా వీళ్ళు నిహంగ్ వేషములో ఉన్న ముస్లింలు కావచ్చు లేదా వీళ్ళు ఇస్లాం మతం పుచ్చుకున్న నిహంగ్ కావచ్చా? విచిత్రంగా ఉంది”
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ X పై కూడా ఈ వీడియోను సామాన్య క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.
ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి
దర్యాప్తును ప్రారంభిస్తూ ముందుగా మేము గూగుల్ లెన్స్ ద్వారా వైరల్ అయిన వీడియోను సెర్చ్ చేశాము. సెర్చ్ లో మాకు ఈ వీడియో మార్చ్ 22, 2022 నాడు ‘సునీల్ గోస్వామి పెహల్వాన్ జి’ పేరున ఉన్న ఒక ఫేస్బుక్ పేజ్ పై అప్లోడ్ చేయబడి లభించింది. ఇక్కడ వ్రాయబడిన శీర్షిక ఈ విధంగా ఉంది, “నిహంగ్ సర్దారులు మసీదులో నమాజ్ చదవడం ప్రారంభించారు, జైహింద్, జైశ్రీరామ”
దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ మేము వేరువేరు కీవర్డ్స్ తో వీడియోను సెర్చ్ చేయడం ప్రారంభించాము. సెర్చ్ లో మాకు షేర్ చాట్ పై ‘d€€p s@rd@rni’ పేరున ఉన్న ఒక ఖాతాపై అప్లోడ్ చేయబడిన వైరల్ వీడియో లభించింది. ఇక్కడ ఈ వీడియోను ఒక సంవత్సరం క్రితం పోస్ట్ చేస్తూ ‘ఈద్ ముబారక్’ మరియు ‘ఈద్ స్పెషన్’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇవ్వబడింది.
సెర్చ్ చేసినప్పుడు మాకు ఈ వీడియో ‘వేదిక్ ట్రైబ్’ అనే ఒక ఫేస్బుక్ పై కూడా అప్లోడ్ చేయబడి లభించింది. అయినప్పటికీ, ఈ వీడియో ఆగస్ట్ 2, 2021 నాడు అప్లోడ్ చేయబడింది.
ఈ వీడియో ఎక్కడిది మరియు ఎప్పటిది అనే విషయాన్ని మాత్రం విశ్వాస్ న్యూస్ నిర్ధారణ చేయదు. అయినప్పటికీ, ఇది పాత వీడియో అని స్పష్టం అవుతోంది. ధృవీకరణ కొరకు మేము అంబాలాలోని దైనిక్ జాగరణ్ విలేఖరి దీపక్ బహల్ ను సంప్రదించాము మరియు ఈ వీడియోకు ప్రస్తుత రైతు ఆందోళనకు ఎలాంటి సంబంధం లేదు అని ధృవీకరించారు.
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ పేజ్ యొక్క సోషల్ స్కానింగ్ చేసినప్పుడు, ఈ యూజర్ కు 5వేల మంది ఫాలోయర్స్ ఉన్నారని తెలిసింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ అవుతున్న వీడియో 2021 సంవత్సరం నుండి సోషల్ మీడియా పై ఉందని కనుగొనింది. ఈ వీడియోకు ప్రస్తుత రైతు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923