X
X

Fact Check: ప్రజలు నమాజ్ చదువుతున్న వీడియోకు ఇటీవలి రైతుల ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు, పాత వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడింది

  • By: Umam Noor
  • Published: Mar 15, 2024 at 07:33 PM
  • Updated: Apr 18, 2024 at 12:27 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): పంజాబ్-హర్యాణా సరిహద్దులలో జరిగిన రైతుల ఉద్యమము యొక్క వీడియో తప్పుదోవపట్టించే వీడియో మరియు ఫోటోతో వైరల్ చేయబడుతోంది. ఈ లింక్ లో ఒక వీడియో వైరల్ చేయబడుతోంది, ఇందులో కొంతమంది నమాజ్ చదువుతూ ఉండడం చూడవచ్చు. ఈ వీడియోను మతపరమైన క్లెయిమ్ తో షేర్ చేస్తూ యూజర్ దీనిని ఇటీవలి రైతు ఉద్యమానికి సంబంధించినది అని షేర్ చేస్తున్నారు. 

వైరల్ చేయబడుతున్న వీడియో 2021 సంవత్సరము నుండి సోషల్ మీడియోలో ఉందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియోకు ఇటీవలి రైతు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఫేస్‎బుక్ యూజర్ వైరల్ అయిన పోస్ట్ ను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “హర్యాణా సరిహద్దులలో పంజాబ్ రైతులలో ఎక్కువమంది నిహంగ్ సిఖ్ తల్వార్ లు ఉన్నారు, వారు మసీదులో నమాజ్ చదువుతూ కనిపించారు లేదా వీళ్ళు నిహంగ్ వేషములో ఉన్న ముస్లింలు కావచ్చు లేదా వీళ్ళు ఇస్లాం మతం పుచ్చుకున్న నిహంగ్ కావచ్చా? విచిత్రంగా ఉంది”

సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ X పై కూడా ఈ వీడియోను సామాన్య క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.

 ఫేస్‎బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి

దర్యాప్తు

దర్యాప్తును ప్రారంభిస్తూ ముందుగా మేము గూగుల్ లెన్స్ ద్వారా వైరల్ అయిన వీడియోను సెర్చ్ చేశాము. సెర్చ్ లో మాకు ఈ వీడియో మార్చ్ 22, 2022 నాడు ‘సునీల్ గోస్వామి పెహల్వాన్ జి’ పేరున ఉన్న ఒక ఫేస్‎బుక్ పేజ్ పై అప్లోడ్ చేయబడి లభించింది. ఇక్కడ వ్రాయబడిన శీర్షిక ఈ విధంగా ఉంది, “నిహంగ్ సర్దారులు మసీదులో నమాజ్ చదవడం ప్రారంభించారు, జైహింద్, జైశ్రీరామ”

దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ మేము వేరువేరు కీవర్డ్స్ తో వీడియోను సెర్చ్ చేయడం ప్రారంభించాము. సెర్చ్ లో మాకు షేర్ చాట్ పై ‘d€€p s@rd@rni’ పేరున ఉన్న ఒక ఖాతాపై అప్లోడ్ చేయబడిన వైరల్ వీడియో లభించింది. ఇక్కడ ఈ వీడియోను ఒక సంవత్సరం క్రితం పోస్ట్ చేస్తూ ‘ఈద్ ముబారక్’ మరియు ‘ఈద్ స్పెషన్’ అనే హ్యాష్‎ట్యాగ్ ఇవ్వబడింది.

సెర్చ్ చేసినప్పుడు మాకు ఈ వీడియో ‘వేదిక్ ట్రైబ్’ అనే ఒక ఫేస్‎బుక్ పై కూడా అప్లోడ్ చేయబడి లభించింది. అయినప్పటికీ, ఈ వీడియో ఆగస్ట్ 2, 2021 నాడు అప్లోడ్ చేయబడింది.

ఈ వీడియో ఎక్కడిది మరియు ఎప్పటిది అనే విషయాన్ని మాత్రం విశ్వాస్ న్యూస్ నిర్ధారణ చేయదు. అయినప్పటికీ, ఇది పాత వీడియో అని స్పష్టం అవుతోంది. ధృవీకరణ కొరకు మేము అంబాలాలోని దైనిక్ జాగరణ్ విలేఖరి దీపక్ బహల్ ను సంప్రదించాము మరియు ఈ వీడియోకు ప్రస్తుత రైతు ఆందోళనకు ఎలాంటి సంబంధం లేదు అని ధృవీకరించారు.

తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ పేజ్ యొక్క సోషల్ స్కానింగ్ చేసినప్పుడు, ఈ యూజర్ కు 5వేల మంది ఫాలోయర్స్ ఉన్నారని తెలిసింది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ అవుతున్న వీడియో 2021 సంవత్సరం నుండి సోషల్ మీడియా పై ఉందని కనుగొనింది. ఈ వీడియోకు ప్రస్తుత రైతు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు.

  • Claim Review : హర్యాణా సరిహద్దులలో నిహంగ్ సిఖ్ తల్వార్లు చాలామమ్ది మసీదులో నమాజ్ చేస్తూ
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: పకారి గా
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later