Fact Check: ముఖ్యమంత్రి శివరాజ్ సాధువులతో మాట్లాడుతున్న వీడియో ఎడిట్ చేయబడింది మరియు అసత్యపు క్లెయిమ్స్ తో వైరల్ అవుతోంది
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ముఖ్యమంత్రి శివరాజ్ ఉన్న ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని మరియు ఎన్నికల ప్రచారము కొరకు సర్క్యులేట్ చేయబడుతోందని కనుగొనింది. అసలైన వీడియో కోవిడ్-19 మహమ్మారి సమయములో 2020లో ఆయన సాధువులతో వారి సహకారాన్ని కోరుతూ వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు తీయబడింది.
- By: Pragya Shukla
- Published: Nov 22, 2023 at 06:06 PM
కొత్త ఢిల్లీ | విశ్వాస్ న్యూస్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల మధ్య, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాపై ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ వీడియోలో, ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి మద్ధతు ఇవ్వమని ఉద్దేశపూర్వకంగా సాధువులను అభ్యర్ధిస్తున్నారు. అయితే, సవాలు తమకు సమానంగా డిమాండ్ చేస్తున్నదని నొక్కి చెప్తూ వాళ్ళు ఆయన అభ్యర్ధనను తిరస్కరించారు. చాలామంది వీక్షకులు దీని ప్రమాణతను నిజమని నమ్ముతుండగా మరియు రాబోయే ఎన్నికలకు దీనిని జతచేసుకోవడముతో ఈ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
దర్యాప్తు చేసిన పిమ్మట, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడినదని మరియు ఎన్నికల ప్రచారములో భాగంగా వ్యాప్తి చేయబడుతోందని నిర్ణయించారు. అసలైన ఫుటేజ్ 2020 నాటిది, కోవిడ్-19 మహమ్మారి సమయములో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొంతమంది పూజారులతో ఒక వీడియో కాల్ మాట్లాడుతూ వారి సహకారాన్ని అభ్యర్ధిస్తున్నప్పటిది.
ఏది వైరల్ అవుతోంది?
నవంబరు 9, 2023 నాడు వైరల్ వీడియోను షేర్ చేస్తూ ఫేస̴్బుక్ యూజర్ ‘సచిన్ సోని’ క్యాప్షన్ లో ఇలా వ్రాశారు, “వైరల్ వీడియో” సాధుపుంగవులు శివరాజ్ మరియు బిజేపి కొరకు ప్రచారం చేయటానికి నిరాకరించారు, ఈసారి బిజేపి కేవలం 50 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది, తగ్గిపోతుంది అని ఒక సాధువు చెప్పారు. ”
దర్యాప్తు:
వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను తనిఖీ చేయుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ నిర్వహించాము. మా సెర్చ్ లో మాకు పంజాబ్ కేసరి మధ్య ప్రదేశ్ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజ్ పై ఏప్రిల్ 28, 2020 నాడు అప్లోడ్ చేయబడిన అసలైన వీడియో లభించింది. ఈ వీడియోలో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కోవిడ్-19 విపత్తు వలన కలిగిన సవాళ్లను ప్రస్తావిస్తూ పూజారులతో ఒక వీడియో కాల్ మాట్లాడారు. ఈ ఇంటరాక్షన్ సమయములో, ఆయన ఈ విపత్తు నిర్వహణ సమయములో వారి సహకారాన్ని కోరారు. అయితే, మొత్తం ఒక గంట 21 నిమిషాల వీడియను సమీక్షించిన తరువాత అందులో మాకు, వైరల్ వీడియోలో చేయబడిన క్లెయిమ్స్ కు సమానమైన ఏ విషయము మాకు లభించలేదు.
సేకరించబడిన సమాచారము ఆధారంగా జరిగిన తదుపరి దర్యాప్తులో సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి మరొక గూగుల్ సెర్చ్ చేయబడింది. వైరల్ వీడియో ఐబిసి24 యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై ఉంది మరియు దీని వెంట ఉన్న నివేదిక ఏప్రిల్ 28, 2020 నాడు షేర్ చేయబడింది. నివేదిక ప్రకారము, నిజానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్-19 మహమ్మారి యొక్క సవాళ్ళ గురించి ఒక వీడియో కాల్ లో సాధువులతో చర్చించారు.
మా దర్యాప్తు సమయములో, అసలైన video లభించింది. ఇది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజ్ పై షేర్ చేయబడింది. ఈ లైవ్ వీడియో ఏప్రిల్ 28, 2020 నాడు ప్రసారం అయ్యింది. దీని వెంబడి ఉన్న శీర్షికలో శివరాజ్ సింగ్ చౌహన్ కోవిడ్-19 యొక్క సవాళ్ళ గురించి మరియు ఐకమత్యము గురించి ప్రాముఖ్యత గురించి సాధువులతో చర్చించుటకు ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అసలైన వీడియోలో, ముఖ్యమంత్రి శివరాజ్ ఉన్న వైరల్ వీడియోకు సంబంధించిన ఒక భాగము 35 నుండి 45వ క్షణాల వద్ద చూడవచ్చు. అంతేకాకుండా, సాధువుల వైరల్ వీడియో అసలైన ఫుటేజ్ లో 12:55 టైమ్ స్టాంప్ వద్ద చూడవచ్చు. తదనంతరం, ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించి ఆడియో చెరికతో సహా వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని స్పష్టం అయ్యింది
మరిన్ని అంతర్దృష్టులు సేకరించుటకు మేము అభయ్ ప్రతాప్ సింగ్, మధ్యప్రదేశ్ బిజేపి వర్కింగ్ కమిటీ సభ్యుడిని కలిశాము. ఆయన మాకు ఈ విధంగా తెలిపారు, “ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రతిపక్ష పార్టీలు మా పార్టీ అరియు శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క పేరుప్రతిష్ఠలను పాడుచేయటానికి ఇటువంటి వ్యూహాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఎడిట్ చేయబడిన వీడియో ముఖ్యమంత్రి పరువు తీయటానికి వైరల్ చేయబడుతోంది. అయితే వారి ప్రయత్నాలు ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వలేదు. మేము మరొకసారి విజయం సాధిస్తాము అని నేను విశ్వసిస్తున్నాను”. వివిధ కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ లను నిర్వహించినప్పటికీ, మాకు ఎన్నికల ప్రచారము మరియు పబ్లిసిటి కొరకు సాధువులు ముఖ్యమంత్రి శివరాజ్ ను విమర్శించారు అనే వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన ఏ నివేదికలు లభించలేదు.
తర్వాత, మేము తప్పు క్లెయిమ్ తో ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను పరీక్షించాము. ఈ యూజర్, రేవా, మధ్య ప్రదేశ్ లో నివసిస్తున్నారు. ఇతనికి 4,697 స్నేహితులు మరియు 4700 ఫాలోయర్స్ ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ముఖ్యమంత్రి శివరాజ్ ఉన్న ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని మరియు ఎన్నికల ప్రచారము కొరకు సర్క్యులేట్ చేయబడుతోందని కనుగొనింది. అసలైన వీడియో కోవిడ్-19 మహమ్మారి సమయములో 2020లో ఆయన సాధువులతో వారి సహకారాన్ని కోరుతూ వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు తీయబడింది.
- Claim Review : సాధుపుంగవులు శివరాజ్ మరియు బిజేపికి మద్ధతుగా ప్రచారం చేయటానికి తిరస్కరించారు, ఈసారి బిజేపి కేవలం 50 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది అని చెప్పారు. తగ్గిపోతుంది.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘సచిన్ సోని’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.