Fact Check: అయోధ్య రామమందిరం నేపథ్యములో నిర్మించబడిన దుర్గా పూజ మంటపం వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): “రామ్ లల్ల” యొక్క పత్రిష్ఠాపన వేడుక వచ్చే సంవత్సరం జనవరి 22వ తేదీనాడు జరుగనుంది. ఈ వేడుకకు సంబంధించి, అయోధ్యలో కొత్తగా నిర్మించబడిన రామమందిరాన్ని చూపించే ఉద్దేశముతో సోషల్ మీడియాపై ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విద్యుత్ దీపాలతో అలంకరించిన మందిరం-వంటి నిర్మాణం చూపించబడింది.

అయితే, ఈ క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో నిర్ణయించింది. వైరల్ వీడియోలో అయోధ్యలోని రామమందిరాన్ని చూపించదు, అది పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్కత్తాలో రామమందిరం మాదిరిగా కనిపించేదిగా నిర్మించబడిన దుర్గా పూజ మంటపం. అయోధ్యలోని రామమందిరం వద్ద విద్యుత్ పని పూర్తి అయ్యిందనే అసత్యపు క్లెయిమ్స్ తో ఈ వీడియో షేర్ చేయబడుతోంది.

ఏది వైరల్ అవుతోంది?

సోషల్ మీడియా యూజర్ ‘సనాతని సీమ’ డిసెంబరు 11వ తేదీన “రామమందిరములో విద్యుత్ పని పూర్తి అయ్యింది, అద్భుతమైన వెలుగు…జైశ్రీరాం…రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు”.

ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు

https://twitter.com/shivamkhodani/status/1735003506296377739

సోషల్ మీడియా వేదికలపై అనేకమంది యూజర్లు కూడా ఇటువంటి క్లెయిమ్స్ తో ఈ వీడియోను షేర్ చేశారు.

దర్యాప్తు:

వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్స్ యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చింగ్ ద్వారా, మేము సంబంధిత చిత్రాలు ఉన్న అనేక వార్తా నివేదిక లను కనుగొన్నాము. అవుట్‎లుక్ ఇండియా వెబ్సైట్ పై అక్టోబరు 24, 2023 నాడు ప్రచురించబడిన ఒక నివేదిక, ఇవి ఉత్తర కోల్కత్తాలోని సంతోష్ మిర స్క్వేర్ లో నిర్మించబడిన దుర్గా పూజ మంటపము యొక్క చిత్రాలు అని ధృవీకరించింది. రామమందిరము మాదిరిగానే నిర్మించబడిన ఈ మంటపము గురించి నివేదికలో హైలైట్ చేయబడింది.

ఈ ఫోటోలు అనేక ఇతర నివేదికలలో కూడా ఇటువంటి సందర్భములోనే వినియోగించబడ్డాయి. సుమారు, ఒక నెల క్రితం, ఓటివి న్యూస్ ఇంగ్లీష్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై ఒక వీడియో బులెటిన్ అప్లోడ్ చేయబడింది, ఇందులో ఈ మంటపము రామమందిరము నేపథ్యములో నిర్మించబడటమే దీని ఆకర్షణ అని పేర్కొనింది. మా సోషల్ మీడియా సెర్చ్ లో, తపన్ మిస్రి అనే ఒక ఫేస్‎బుక్ యూజర్ లైటింగ్ ఉన్న ఒక క్లిప్ తో సహా ఆ మంటపము గురించిన వివరాలు అందించారు.

దీని వెంబడి ఉన్న సమాచారములో ఈ విధంగా పేర్కొనబడింది, “ఇది సంతోష్ మిత్ర చౌక్ వద్ద నిర్మించబడిన రామ మందిర మంటపము యొక్క వీడియో”. వైరల్ వీడియో అయోధ్యలోని రామమందిరాన్ని చూపించదు అని, అది దుర్గా పూజ సమయములో కోల్కత్తాలో రామమందిరం నేపథ్యములో నిర్మించబడిన మంటపము అని మా దర్యాప్తు నిస్సందేహంగా తెలుపుతుంది.

వైరల్ వీడియో యొక్క ప్రామాణికాన్ని ధృవీకరించుటకు, మేము రాం శరణ్ అవస్థి, దైనిక్ జాగరణ్ యొక్క అయోధ్య యూనిట్ యొక్క ఎడిటర్-ఇన్-చార్జ్ ను కలిశాము. ఆయన “ఈ వీడియో అయోధ్య రామమందిరానికి సంబంధించినది కాదు” అని నొక్కిచెప్పారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర యొక్క అధికారిక హ్యాండిల్ X పై అందుబాటులో ఉంది మరియు ఇది కొనసాగుతున్న మందిర నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. డిసెంబరు 15వ తేదీన, శ్రీ రామ జన్మభూమి మందిరము యొక్క మొదటి అంతస్తుపై నిర్మాణము పురోగతి చిత్రాలు ఈ హ్యాండిల్ నుండి పోస్ట్ చేయబడ్డాయి.

తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ కు ఫేస్‎బుక్ పై సుమారు 25,000మంది స్నేహితులు ఉన్నారు. ఇది ఈ భావజాలము ద్వారా ప్రేరేపితమైన కంటెంట్ ను నిరంతరం షేర్ చేస్తుంది.

ముగింపు: కోల్కత్తాలో దుర్గా పూజ సమయములో రామ మందిరము నేపథ్యం ఉన్న మంటపం యొక్క వీడియో అయోధ్యలోని రామమందిరం పేరున తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు