Fact-Check: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే పాత వీడియో తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ చేయబడింది
- By: Ashish Maharishi
- Published: Jun 20, 2023 at 04:24 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): 288 మంది మరణాలకు మరియు 1,100 మంది గాయపడటానికి దారితీసిన ఒడిశా రైలు ప్రమాదము జరిగినప్పటికీ, నకిలీ మరియు ఎడిట్ చేయబడిన వీడియోలు మరియు ఫోటోలు ఇంటర్నెట్ పై పిచ్చిగా వైరల్ అవుతున్నాయి. ఇదే కాకుండా, ఈ విషాదానికి మతపరమైన రంగులు అద్దుతూ అనేక పోస్టులు ఇంటర్నెట్ పై చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రల్వే ట్రాక్ లను కొంతమంది పాడుచేస్తున్నారు అనే క్లెయిమ్ తో ఇంటర్నెట్ పై ఒక వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది యూజర్లు ఈ వీడియోను మతపరమైన అజెండాతో వైరల్ చేస్తున్నారు.
వైరల్ పోస్ట్ పై విశ్వాస్ న్యూస్ వాస్తవ-తనిఖీ నిర్వహించింది, ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని నిర్ణయించింది. వాస్తవానికి, ఈ వీడియో ఒక సంవత్సరం పాతది మరియు భరత్పూర్, రాజస్తాన్ లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సమయములో చిత్రీకరించబడింది.
క్లెయిమ్:
ఈ వీడియో ఫేస్బుక్ పై హరేంద్ర ప్రజాపతి (ఆర్కైవ్ లింక్) జూన్ 6న, “వీరంత ఎవరో చూడండి. రాజకీయాల కారణంగా అంతా జరుగుతోంది. 2024 ఎన్నికలు వస్తున్నాయి మరియు మోడి-వ్యతిరేకులైన వారు స్పృహలోకి వచ్చారు.” అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది. ఇది నిజమని భావించి చాలామంది యూజర్లు కూడా ఈ పోస్ట్ ను షేర్ చేశారు.
దర్యాప్తు:
వీడియో యొక్క ప్రమాణాన్ని దర్యాప్తు చేయుటకు, విశ్వాస్ న్యూస్ ఆన్లైన్ టూల్స్ ను వినియోగించింది. ముందుగా, కీఫ్రేమ్స్ సంగ్రహించుటకు ఇన్విడ్ టూల్ ద్వారా వైరల్ వీడియో రన్ చేయబడింది. తరువాత ఈ కీఫ్రేమ్స్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో ఉపయోగించబడ్డాయి, ఇది ఒక సంవత్సరం క్రితం Bhaskar.com పై ఉన్న ఒక రిపోర్ట్ కు దారితీసింది. ఆ రిపోర్ట్ ఈ వైరల్ వీడియోను ఉపయోగించి ఇలా పేర్కొనింది, “భరత్పూర్, రాజస్తాన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి చాలా వ్యతిరేకత ఉంది. జూన్ 17 న, భరత్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు చాలా కోలాహలం జరిగింది. నిరసనకారులు రైల్వే ట్రాక్ యొక్క ఫిష్ ప్లేట్స్ ను తొలగించారు. ట్రాక్ ను లాక్ చేసే కీస్ కూడా పాడుచేయబడ్డాయి. రైల్వే పోలీసులు వారిని పట్టుకోవాలని చూసినప్పుడు, కోపగించిన యువకులు వారిపైకి రాళ్ళు రువ్వారు.” రిపోర్ట్ ను ఇక్కడ చదవవచ్చు.
అంతేకాకుండా, ఈ సంఘటన గురించి మరింత సమాచారం సేకరించుటకు సెర్చ్ లు నిర్వహించబడ్డాయి. గూగుల్ ఓపెన్ సెర్చ్ లో సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించిన విశ్వాస్ న్యూస్ కు Jagran.com పై జూన్ 17, 2022 నాడు ప్రచురించబడిన ఒక వార్తా వ్యాసం లభించింది. ఆ వ్యాసములో భరత్పూర్, రాజస్తాన్ లో మూడు రోజుల నుండి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కొంతమంది యువకులు భరత్పూర్ రైల్వే స్టేషన్ లో గుమిగూడారు మరియు నిరసన తెలుపుతున్న యువకులు రాళ్ళు రువ్వడముతో సహా పోలీసులతో గొడవలు జరిగాయి. రిపోర్ట్ ను ఇక్కడ చదవండి.
దర్యాప్తును కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్ దీపక్ పూరి, భరత్పూర్ లో ఉన్న స్థానిక విలేఖరిని కలిశారు. వైరల్ వీడియోను అతనికి షేర్ చేశాము మరియు అది అగ్నిపథ్ నిరసనను చిత్రీకరించిన ఒక పాత వీడియో అని ఆయన ధృవీకరించారు. భరత్పూర్ నుండి మరొక విలేఖరి అయిన సురేంద్ర గోపాలియ కూడా ఈ వీడియో పాతదని వెరిఫై చేస్తూ ఆ సమయములో అగ్నిపథ్ పథకము కింద నియామకాలను నిరసించిన యువతను చూపిస్తోందని వివరించారు.
విశ్వాస్ న్యూస్ వైరల్ క్లెయిమ్ ను ముందుగా షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ హరేంద్ర ప్రజాపతి యొక్క ప్రొఫైల్ ను పరీక్షించింది. ఆ యూజర్ ఆ ప్రాంత నివాసి అని మరియు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయని కనుగొనబడింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తును నిర్వహించి వైరల్ వీడియో, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భరత్పూర్, రాజస్తాన్ లో జరిగిన నిరసనలను చూపించే ఒక సంవత్సరం పాత నిర్ణయించింది. కొంతమంది వ్యక్తులు ఒడిశా రైలు ప్రమాదం పేరుతో, అది జరిగినప్పటి నుండి వీడియోను సర్క్యులేట్ చేస్తూ గందరగోళాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
క్లెయిమ్ సమీక్ష: ఒడిశా రైలు ప్రమాదము తరువాత, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కొంతమంది వ్యక్తులు రైల్వే ట్రాక్ లను ధ్వంసం చేస్తున్నారు.
క్లెయిమ్ చేసినది : ఎఫ్బి యూజర్: హరేంద్ర ప్రజాపతి
వాస్తవ తనిఖీ: తప్పుదోవపట్టించేది
- Claim Review : ఒడిశా రైలు ప్రమాదము తరువాత, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ కొంతమంది వ్యక్తులు రైల్వే ట్రాక్ లను ధ్వంసం చేస్తున్నారు.
- Claimed By : ఎఫ్బి యూజర్: హరేంద్ర ప్రజాపతి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.