వాస్తవ తనిఖీ : యుపి పోలీసులు బరేలీలో 30 రోజుల మాస్క్ చెక్ క్యాంపెయిన్ చేపట్టలేదు, వైరల్ పోస్ట్ అబద్ధం
వైరల్ పోస్ట్ అబద్ధం. పోలీసులు బరేలీలో 30 రోజుల మాస్క్చెక్ క్యాంపెయిన్ ప్రారంభించలేదు.
- By: Amanpreet Kaur
- Published: Dec 9, 2020 at 09:54 PM
- Updated: Dec 14, 2020 at 12:10 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో పోలీసులు 30 రోజుల మాస్క్ చెక్ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ షేర్ చేశారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడానికి ఫేస్ మాస్క్ ధరించాలంటూ ఈ పోస్ట్ ప్రజలను హెచ్చరిస్తోంది.
విశ్వాస్ న్యూస్ తన ఫ్యాక్ట్ చెకింగ్ వాట్సాప్ చాట్‌బాట్ (+919599299372) లో వాస్తవ తనిఖీ కోసం ఈ దావాను స్వీకరించింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. బరేలీలో పోలీసులు ఇంకా మాస్క్ చెక్ ఆపరేషన్ ప్రారంభించలేదు.
దావా :
‘బరేలీ ది సిటీ ఆఫ్ లవ్’ ఫేస్బుక్ పేజీలో నవంబర్ 20వ తేదీన చేసిన పోస్ట్‌లో ఈ రైటప్ రాశారు, ‘ముఖ్యమైన సమాచారం : రేపు ఉదయం బరేలీలో, పోలీసులచే 30 రోజుల మాస్క్ చెక్ క్యాంపెయిన్ మొదలవుతుంది’ ఇది చలాన్ నుంచి తప్పించుకోవడానికి ఫేస్ మాస్క్ ఉపయోగించమని ప్రజలను కూడా హెచ్చరిస్తుంది. ఈ పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
వైరల్ దావా గురించిన వార్తా కథనాల కోసం మేము మొదట ఇంటర్నెట్లో శోధించాము. ఏ ప్రాంతం అనే వివరాలు లేకుండా ఇలాంటి అనేక సందేశాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. అయినప్పటికీ, బరేలీలో పోలీసుల మాస్క్ చెక్ క్యాంపెయిన్ గురించి ప్రామాణికమైన మీడియా కథనాలు లేదా అధికారిక ఉత్తర్వులు మాకు దొరకలేదు.
ఈ దావాను ధృవీకరించడానికి మేము బరేలీ ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ను సంప్రదించాము. వాదనలను ఖండించిన ఎస్పీ, బరేలీలో ఇటువంటి మాస్క్ చెక్ క్యాంపెయిన్ ఏదీ జరగడం లేదని మాకు స్పష్టం చేశారు.
వైరల్ దావాను పోస్ట్ చేసిన ఫేస్బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్‌లో ఆ పేజీకి 6676 మంది ఫాలోవర్లు ఉన్నారని తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. పోలీసులు బరేలీలో 30 రోజుల మాస్క్చెక్ క్యాంపెయిన్ ప్రారంభించలేదు.
- Claim Review : 'ముఖ్యమైన సమాచారం : రేపు ఉదయం బరేలీలో, పోలీసులచే 30 రోజుల మాస్క్ చెక్ క్యాంపెయిన్ మొదలవుతుంది'
- Claimed By : Facebook page
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.