విశ్వాస్ న్యూస్ పరిశోధనలో వైరల్ పోస్ట్ నకిలీదని రుజువైంది. హత్రాస్‌కు చెందిన బాధిత కుటుంబంతో వీడియో కాలింగ్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. కొందరు వ్యక్తులు అదే చిత్రాన్ని ఎడిట్ చేసి తప్పుడు దావాలతో వైరల్ చేస్తున్నారు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో జరిగిన నేర సంఘటన తర్వాత సోషల్ మీడియాలో చాలా వదంతులు హల్చల్ చేస్తున్నాయి. హత్రాస్ ఘటనకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఓ ఫోటో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో సీఎం యోగి ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఉండటం చూడవచ్చు. ఆ ల్యాప్‌టాప్‌లో హత్రాస్ బాధితురాలి అంత్యక్రియల లైవ్ వీడియోని సీఎం చూస్తున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అసత్యమని తేలింది. సీఎం యోగి, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫొటోలను ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ది ఏమిటి ?
‘అప్పన్ మహారాజ్ గంజ్ ‘ అనే ఫేస్బుక్ పేజీలో సెప్టెంబర్ 30వ తేదీన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన ఒక ఎడిటెడ్ చిత్రాన్ని అప్ లోడ్ చేశారు : “హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని యూపీ పోలీసులు తీసుకెళ్లి దహనం చేశారు, ఒక నిరుపయోగమైన ముఖ్యమంత్రి ఆ లైవ్ వీడియోని వీక్షించారు.’ అని దానికి కామెంట్ రాశారు.
ఈ పోస్ట్‌లో ఉన్నది ఉన్నట్లు ప్రజెంట్ చేయబడింది. ఈ ఫోటోని నిజం చేస్తూ జనాలు వైరల్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ మొదట ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన మరియు ప్రామాణిక వార్తాపత్రికలలో హత్రాస్‌కు సంబంధించిన వార్తలపై తన పరిశోధనను ప్రారంభించింది. దైనిక్ జాగరణ్ యొక్క హత్రాస్ ఎడిషన్‌లో ప్రచురించబడ్డ ఒరిజినల్ పిక్చర్ మాకు లభించింది. ఈ ఫోటోకు సంబంధించిన క్యాప్షన్‌లో బుధవారం లక్నోలోని హత్రాస్‌కు చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి యోగి వీడియో కాలింగ్ చేస్తున్నారని రాశారు. యూపీ ప్రభుత్వ సమాచారశాఖ నుంచి ఈ ఫోటోను విడుదల చేశారు.
దర్యాప్తు సమయంలో, మేము యుపి ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాను పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్‌పై కూడా ఒరిజినల్ ఫోటో వచ్చింది. సెప్టెంబర్ 30, 2020 రాత్రి 7:24 గంటలకు CM Office, GoUP (@CMOfficeUP) ట్విట్టర్ హ్యాండిల్ మీద ఒరిజినల్ ఫోటోను ట్వీట్ చేసి ఇలా రాశారు: “ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath హత్రాస్ బాధితురాలి కుటుంబంతో వీడియో కాలింగ్ ద్వారా చర్చలు జరిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
దర్యాప్తులో భాగంగా, విశ్వాస్ న్యూస్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు రితంజయ కుమార్‌ను ఆశ్రయించింది. వాస్తవమైన చిత్రాన్ని తమ అకౌంట్నుంచి షేర్ చేసుకొని, వైరల్ అవుతున్న ఫోటోను ఎడిట్ చేశారని చెప్పారు.
విచారణ చివరి దశలో నకిలీ పోస్టును షేర్ చేసిన వినియోగదారుడి అకౌంట్‌ను పరిశీలించడం జరిగింది. ‘ఆపన్ మహారాజ్ గంజ్’ అనే ఈ ఫేస్బుక్ పేజీని ఐదు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ పేజీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాళ్లు నిర్వహిస్తున్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ పరిశోధనలో వైరల్ పోస్ట్ నకిలీదని రుజువైంది. హత్రాస్‌కు చెందిన బాధిత కుటుంబంతో వీడియో కాలింగ్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. కొందరు వ్యక్తులు అదే చిత్రాన్ని ఎడిట్ చేసి తప్పుడు దావాలతో వైరల్ చేస్తున్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923