విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై నిరంతరంగా యాక్టివ్ గా ఉన్నారు. వేరొకరి ట్విట్టర్ ఖాతా యొక్క స్క్రీన్షాట్ సోషల్ మీడియాపై ఎలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయబడింది అనే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఎలాన్ మస్క్ ఖాతా సస్పెండ్ అయ్యింది అని చూపించే ఉద్దేశముతో కొంతమంది సోషల్ మీడియా యూజర్లు స్క్రీన్షాట్లు షేర్ చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ తో తన డీల్ ను రద్దు చేసుకున్నారు కాబట్టి ట్విట్టర్ ఇలా చేసింది అని యూజర్లు క్లెయిమ్ చేస్తున్నారు.
ఈ క్లెయిమ్ పూర్తిగా నిరాధారమైనది అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై నిరంతరంగా యాక్టివ్ గా ఉన్నారు. నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క స్క్రీన్షాట్ తప్పు క్లెయిమ్ తో సోషల్ మీడియాపై షేర్ చేయబడుతోంది.
ట్విట్టర్ యూజర్ డేనియల్ మార్వెన్ తన హ్యాండిల్ పై ఒక స్క్రీన్షాట్ ను జులై 10న పోస్ట్ చేశారు. దీని వెంబడి ఉన్న శీర్షిక ఇలా ఉంది, ‘ఎలాన్ మస్క్ ఇకపై ట్విట్టర్ ను కొనబోవటం లేదు, అందుకే ట్విట్టర్ ఆయనను సస్పెండ్ చేసింది.’
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
వైరల్ క్లెయిమ్ లోని వాస్తవాన్ని తెలుసుకొనుటకు మేము ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ యొక్క తనిఖీ చేయబడిన ట్విట్టర్ ఖాతా ను స్కాన్ చేయడం ప్రారంభించాము. ఎలాన్ మస్క్ యొక్క ఖాతా సస్పెండ్ చేయబడలేదు అని మరియు ఆయన ట్విట్టర్ పై నిరంతరంగా యాక్టివ్ గా ఉన్నారని మేము కనుగొన్నాము. మేము వెబ్ ఆర్కైవ్ టూల్, ఉపయోగించి ఎలాన్ మస్క్ యొక్క ఖాతాను సెర్చ్ చేశాము, కాని ఇక్కడ కూడా మాకు ఆయన ట్విట్టర్ పై నిరంతరంగా యాక్టివ్ గా ఉన్నారనే అదే సమాచారము లభించింది.
ఆయన ఈరోజు ఉదయం 11:08 (జులై 13, 2022) కు తన స్టార్షిప్ ప్రారంభము గురించి ఒక ట్వీట్ లో సమాచారం ఇచ్చారు. వాస్తవ తనిఖీ సమయానికి ఇది ఆయన చివరి ట్వీట్. ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ కు 101 మిలియన్ మంది అనుచరులు ఉన్నారు. ఎలాన్ మస్క్ 2009 నుండి ట్విట్టర్ పై యాక్టివ్ గా ఉన్నారు.
దర్యాప్తును మరింత ముందుకు కొనసాగిస్తూ, మేము అనేక కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ పై సెర్చ్ చేయడం ప్రారంభించాము. ఈ వైరల్ క్లెయిమ్ ను ధృవీకరిస్తూ మాకు ఎలాంటి విశ్వసనీయమైన మీడియా నివేదికలు లభించలేదు. ఇది ఒక ఆలోచన మాత్రమే. ఎలాన్ మస్క్ ఒక ప్రముఖ వ్యక్తి. ఒకవేళ డీల్ రద్దు తరువాత ట్విట్టర్ ఆయన ఖాతాను సస్పెండ్ చేసి ఉంటే, దానికి సంబంధించి మీడియాలో ఏదైనా నివేదిక ఉంటుంది.
పూర్తి వాస్తవాన్ని తెలుసుకొనుటకు మేము స్క్రీన్షాట్ పై యూజర్ పేరు గురించి సెర్చ్ చేయడం ప్రారంభించాము. ఈ సమయములో ఇది మరొక ఖాతా అని, ఎలాన్ మస్క్ పేరున ఇది రన్ అవుతోందని మాకు తెలిసింది. ఇది ట్విట్టర్ ద్వారా సస్పెండ్ చేయబడింది మరియు దానిని ఎలాన్ మస్క్ అనుకొని ప్రజలు షేర్ చేస్తున్నారు. నిజానికి, ఎలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ యొక్క పేరు @elonmusk, సస్పెండ్ అయిన ఎలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ పేరు @eionmusk.
మరిన్ని వివరాల కొరకు, మేము సోషల్ మీడియా నిపుణుడు మనీష్ పాండేని సంప్రదించాము. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని వాళ్ళు మాతో చెప్పారు. వైరల్ అయిన స్క్రీన్షాట్ నకిలీ ఖాతాది. యూజర్ ప్రజలు ఇది ఎలాన్ మస్క్ యొక్క అసలైన ఖాతా అనుకోవాలని మరియు వారిని తికమక పెట్టేందుకు స్పెల్లింగ్ లో చిన్న మార్పు చేసి నకిలీ ఖాతాను సృష్టించారు మరియు ఇప్పుడు ప్రజలు నకిలీ మరియు సస్పెండ్ అయిన ఖాతాను వాస్తవముగా షేర్ చేస్తున్నారు. యూఆర్ఎల్ లో చిన్న మార్పు చేయడము ద్వారా, ప్రజలు తరచూ ఇలాంటి నకిలీ ఖాతాలను రన్ చేస్తారు, వీటిని చాలామంది నిజమని విశ్వసిస్తారు.
దర్యాప్తు చివరిలో, విశ్వాస్ న్యూస్ నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ డేనియల్ మార్వెన్ యొక్క సోషల్ స్కానింగ్ చేసింది. స్కానింగ్ నుండి, ఈ యూజర్ దక్షిణ ఆఫ్రిక నివాసి అని మాకు తెలిసింది. డేనియల్ మార్వెన్ కు 830.4k అనుచరులు ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో వైరల్ క్లెయిమ్ నకిలీది అని తేలింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై నిరంతరంగా యాక్టివ్ గా ఉన్నారు. వేరొకరి ట్విట్టర్ ఖాతా యొక్క స్క్రీన్షాట్ సోషల్ మీడియాపై ఎలాన్ మస్క్ యొక్క ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయబడింది అనే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923