వాస్తవ తనిఖీ: టిటిఈ ప్రయాణీకుడితో తప్పుగా ప్రవర్తించిన వీడియో ఢిల్లీ-పాట్నా రైలుకు సంబంధించినది, తమిళనాడు కాదు

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఇంటర్నెట్ పై ఒక వీడియో వైరల్ అవుతోంది, దీనిలో ఒక టికెట్ చెక్కర్ (టిటిఈ – ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) రైలులో ఒక ప్రయాణిస్తున్న ప్రయాణీకుడితో తప్పుగా ప్రవర్తించడం చూడవచ్చు. ప్రయాణీకులు తమిళనాడు వదిలి తిరిగి వెళ్తున్న బీహార్ కు చెందిన వలస కూలీలనే క్లెయిమ్ తో ఈ వీడియో షేర్ చేయబడింది. వైరల్ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ వాస్తవ తనిఖీ నిర్వహించింది మరియు ఇది తప్పుదోవపట్టించే క్లెయిమ్ అని కనుగొనింది. మా దర్యాప్తులో, ఈ వీడియో కొత్త ఢిల్లీ నుండి బీహార్ లోని పాట్నాకు ప్రయాణించే సంపూర్ణ క్రాంతి ఎక్స్‎ప్రెస్ అని తేలింది. ఇది ఇప్పుడు తమిళనాడుకు లింక్ చేస్తూ తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది. వీడియోలో చూపించబడిన సంఘటన దనాపూర్, బీహార్ లో జరిగింది. వీడియోను షూట్ చేసిన యూట్యూబర్ కూడా కెమెరాపై దీనిని ధృవీకరించారు.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ పేజ్ ఘోరక్పూరియా (ఆర్కైవ్ లింక్) మార్చ్ 9 నాడు 26-క్షణాల ఒక వీడియో క్లిప్ ను అప్లో చేసి ఇలా వ్రాశారు “తమిళనాడు నుండి పారిపోతున్న బీహారీలకు కొంతమంది టీటీ టికెట్లను ఈ విధంగా ఇస్తున్నారు. టీటీ యొక్క ఈ ప్రవర్తన సరైనదేనా మరియు ఆయన తన యూనిఫార్మ్ కూడా ధరించడం లేదు.”

https://twitter.com/Tiwari_Sintu999/status/1633377504617697280

సింతు తివారి అనే ఒక ట్విట్టర్ యూజర్ మార్చ్ 8 నాడు వీడియో క్లిప్ ను ఈ క్లెయిమ్ తో అప్లోడ్ చేశారు, “తమిళనాడు నుండి పారిపోయి వస్తున్న బీహారీలకు కొంతమంది టీటీ టికెట్లను ఈ విధంగా ఇస్తున్నారు. టీటీ యొక్క ఈ ప్రవర్తన సరైనదేనా మరియు ఆయన తన యూనిఫార్మ్ కూడా ధరించడం లేదు.”

దర్యాప్తు:

విశ్వాస్ న్యూస్ ముందుగా వైరల్ వీడియోను జాగ్రత్తగా చూసింది. వీడియోలో, ఒక వ్యక్తి సంపూర్ణ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలు గురించి ప్రస్తావించడం వినవచ్చు. ఆ తరువాత మేము పోస్ట్ యొక్క వ్యాఖ్యల విభాగాన్ని స్కాన్ చేశాము. వ్యాఖలలో ఒకదానిలో, రైల్వే విభాగము మార్చ్ 9న దానాపూర్ డివిజన్ డిఆర్‎ఎం యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను టాగ్ చేసి, ఈ విషయము గురించి సంబంధిత అధికారులకు తెలియజేయబడింది అని తెలిపింది. అంతేకాకుండా, వ్యాఖ్యలలఓ, చాలామంది ఈ రైలు కొత్త ఢిల్లీ మరియు పాట్నాల మధ్య నడుస్తుందని తెలిపారు మరియు ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది అని కూడా పేర్కొన్నారు.

సెర్చ్ సమయములో, ‘రన్ ఆన్ ట్రాక్’ అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ మార్చ్ 13న వైరల్ వీడియోకు సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ ను తిరిగి ట్వీట్ చేసి ఇలా వ్రాసింది, “ఈ వీడియోను నేను రికార్డ్ చేశాను. ఇది ఢిల్లీ నుండి పాట్నాకు వచ్చే సంపూర్ణ క్రాంతి ఎక్స్‎ప్రెస్ యొక్క వీడియో. దీనికి తమిళనాడు రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. అందరు హోలీ జరుపుకునేందుకు ఢిల్లీ నుండి బీహార్ కు వెళ్తున్నారు.”

దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము యూట్యూబ్ పై ‘రన్ ఆన్ ట్రాక్’ ఛానల్ ను సెర్చ్ చేశాము. ఈ ఛానల్ పై మార్చ్ 3, 2023 నాడు పూర్తి వీడియో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, కొత్త ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్ళే సంపూర్ణ క్రాంతి ఎక్స్‎ప్రెస్ రైలు యొక్క జనరల్ బోగీ యొక్క పరిస్థితి గురించి యూట్యూబర్ సంక్షిప్తీకరించారు.

https://twitter.com/RunOnTrack4/status/1635318824282238982

విశ్వాస్ న్యూస్ ‘రన్ ఆన్ ట్రాక్’ యూట్యూబ్ ఛానల్ యొక్క మాడరేటర్ అయిన గణేష్ ను సంప్రదించింది. ఆయన ఇలా అన్నారు, “వైరల్ క్లిప్ అసలు వీడియో యొక్క అసంపూర్ణ భాగము. దీనికి తమిళనాడుకు ఎలాంటి సంబంధం లేదు. ఇది సంపూర్ణ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలు యొక్క వీడియో. హోలీకి ముందు, ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్ళే ఈ రైలులో చాలా రద్దీ ఉండింది. టీటీఈ సంఘటన దానాపూర్, బీహార్ లో జరిగింది”.

దర్యాప్తు యొక్క చివరి దశలో, ఫేస్‎బుక్ పేజ్ ‘గోరఖ్పూరియా’ యొక్క సోషల్ స్నానింగ్ నిర్వహించబడింది. ఈ పేజ్ ను 3.87 లక్షల మంది ఫాలో చేస్తున్నారు అని కనుగొనబడింది. గోరఖ్పూర్ నుండి ఆపరేట్ చేయబడే ఈ పేజ్ పై అనేక రకాల వైరల్ కంటెంట్ ఉన్నాయి.

ముగింపు: ప్రయాణీకులతో టీటీఈ తప్పుగా ప్రవర్తించడము గురించిన వీడియోకు తమిళనాడుకు ఎలాంటి సంబంధం లేదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు కనుగొనింది. ఈ సంఘటన హోలీకి ముందు కొత్త ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్‎ప్రెస్ పై జరిగింది.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు