X
X

వాస్తవ తనిఖి: ఒక ఈ-రిక్షా నుండి పడిపోతున్న ఒక పోలీస్ యొక్క వీడియో రాజస్తాన్ కు చెందినది, ఉత్తర్ ప్రదేశ్ కాదు.

ముగింపు: వీడియో వెంబడి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదు కాని రాజస్థాన్ కు చెందినది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్) – సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో వరదనీరు ఉన్న ఒక రోడ్డుపై ఒక ఈ-రిక్షా తలక్రిందులు కావడం చూడవచ్చు. ఈ ఈ-రిక్షా బోల్తా పడినప్పుడు అందులో కొంతమంది పోలీసులు కూర్చొని ఉన్నారు. ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది అని ఈ పోస్ట్ వెంబడి క్లెయిమ్ చేయబడింది. ఈ వీడియో వెంబడి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన విచారణలో కనుగొనింది. ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ నుండి కాదు, రాజస్తాన్ కు చెందినది.

వైరల్ పోస్ట్ లో ఏమి ఉంది?

వీడియో షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ పేజ్ యాంటి భక్త్స్ ఇలా వ్రాశారు, उत्तर प्रदेश में विकास की गंगा के बीच पुलिस वाले की गाड़ी पलट गई।।😀😀😀 देखो देश का सबसे स्मार्ट राज उत्तर प्रदेश का हाल।।।”.

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

మా విచారణను ప్రారంభించుటకు ముందుగా మేము ఒక కీవర్డ్ సెర్చ్ తో విషయాన్ని విచారించాము. ఈ వీడియో రాజస్థాన్ లోని దాసాకు చెందినది అని ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదు అని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చేసిన ఒక ట్వీట్ ను మేము కనుగొన్నాము.

దీని తరువాత, ఈ వీడియో యొక్క స్క్రీన్‎షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ పై ‘దాసా ఈ-రిక్షా ఓవర్టర్న్స్’ వంటి కీవర్డ్స్ తో సహా శోధించాము. ఈ వీడియోను మేము నవభారత్ టైమ్స్ పై ఫైల్ చేయబడిన ఒక వార్తా నివేదికలో కనుగొన్నాము. ఈ వ్యాసము ప్రకారము, ఈ సంఘటన రాజస్థాన్ లోని దాసాలో జరిగింది.

ఈ వీడియోను మేము www.bhaskar.com పై ఒక వార్తా వ్యాసాలలో కనుగొన్నాము. ఈ వార్తల ప్రకారము ఈ సంఘటన దాసా జిల్లాలోని బందిక్యూయి పట్టణములో జరిగింది.

దీనికి సంబంధించి విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ జైపూర్ యొక్క కరెస్పాండెంట్ అయిన నరేంద్ర శర్మ గారిని సంప్రదించింది. ఆయన కూడా ఈ వీడియో దాసా కు చెందినది అని ధృవీకరించారు.

చివరిగా మేము యాంటి భక్త్స్ పేజ్ ను స్కాన్ చేశాము. ఈ పేజ్ ఫేస్‎బుక్ పై 23,452 మందిచే అనుసరించబడుతోందని కనుగొన్నాము.

निष्कर्ष: ముగింపు: వీడియో వెంబడి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వీడియో ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది కాదు కాని రాజస్థాన్ కు చెందినది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later