వాస్తవ తనిఖీ: ఈ సర్వీస్‌ ప్రొవైడర్‌ 200GB డేటాను ఉచితంగా అందించడం లేదు, వైరల్ పోస్ట్‌ స్కామ్

ఎయిర్‌టెల్ నెలరోజుల పాటు ఉచిత 200GB డేటాను అందించడం లేదు. అలాగే, వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన వెబ్‌సైట్ లింక్‌ ఒక స్కామ్‌కు సంబంధించినది.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఫ్యాక్ట్ చెక్ కోసం విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో ఒక పోస్ట్ అందుకుంది. 1 నెల పాటు ఎయిర్‌టెల్ 200 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ఆ పోస్ట్ పేర్కొంది. పోస్ట్‌తో పాటు, ఒక లింక్ కూడా జోడించబడింది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు ఈ లింక్ నకిలీదని మేము కనుగొన్నాము. ఈ లింక్‌ స్కామ్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతుంది. వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న విధంగా ఏ ఆఫర్‌ను ప్రకటించలేదని ఎయిర్‌టెల్ ధృవీకరించింది.

దావా :
విశ్వాస్‌ న్యూస్ వాట్సాప్ చాట్‌బాట్‌లో అందుకున్న పోస్ట్‌లో ఇలా ఉంది. :
ఎయిర్‌టెల్ నెల రోజుల పాటు 200GB డేటాను ఉచితంగా అందిస్తోంది. పోస్ట్‌తో పాటు, ఒక లింక్‌ను https://www.k1g6p8.top/app/4g/index.php జోడించారు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ పోస్ట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి దర్యాప్తు చేసింది. ఇది ఒక నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా ధృవీకరించమని మమ్మల్ని ప్రేరేపించింది. మేము ఆ నెంబర్‌ను నమోదు చేసినప్పుడు, ఈ క్రింది దశలను పూర్తి చేయమని మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లింది:

  1. ఉచిత ఇంటర్నెట్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే మొదట ‘WHATSAPP’అనే గ్రీన్ బటన్‌పై క్లిక్ చేసి, ఈ వార్తలను వాట్సాప్‌లోని 3 గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపండి, తద్వారా వారు కూడా ఈ లాంగ్ క్వారంటైన్ సమయంలో ఈ ఉచిత సేవను పొందవచ్చు!
  2. షేర్‌ చేసిన తర్వాత, మీరు తదుపరి దశకు వెళతారు, తద్వారా మీరు ఈ ఉచిత ఇంటర్నెట్ సేవను 60 రోజులపాటు యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ airtel.in లేదా airtel.com. వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న లింక్‌ వీటిలో ఏదీ కాదు.

అలాగే, ఏదైనా ఆఫర్‌ను పొందడానికి 20 మంది స్నేహితులు లేదా 3 గ్రూపులకు వాట్సాప్‌లో ఈ మెస్సేజ్‌ను షేర్‌ చేయాలని ఎయిర్‌టెల్ వినియోగదారులను ఎప్పుడూ అడగదు.

మేము 200GB ఉచిత డేటా ఆఫర్ కోసం ఎయిర్‌టెల్ సోషల్ మీడియా ఖాతాలను మరియు దాని అధికారిక వెబ్‌సైట్‌ను శోధించాము. మేము అటువంటి ఆఫర్ ఏదీ కనుగొనలేదు.

Whois టూల్‌ను ఉపయోగించి వైరల్ సందేశంలో పేర్కొన్న వెబ్‌సైట్ డొమైన్‌ను కూడా మేము శోధించాము, ఆ వెబ్‌సైట్ ఆగస్టు 2020 లో సృష్టించబడిందని మరియు ఆ సైట్‌ ఎయిర్‌టెల్‌కు చెందినది కాదని కనుగొన్నాము.

ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ అధికారి మిస్టర్ బాదల్‌తో విశ్వాస్ న్యూస్ మాట్లాడటం జరిగింది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 200GB డేటాను ఉచితంగా అందించడం లేదని, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న వెబ్‌సైట్ కూడా నకిలీదని ఆయన ధృవీకరించారు.

निष्कर्ष: ఎయిర్‌టెల్ నెలరోజుల పాటు ఉచిత 200GB డేటాను అందించడం లేదు. అలాగే, వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన వెబ్‌సైట్ లింక్‌ ఒక స్కామ్‌కు సంబంధించినది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు