వాస్తవ తనిఖీ: ఇది మనాలి – లేహ్‌లను కలిపే అటల్ సొరంగం ఫోటో కాదు, వైరల్ ఫోటో నకిలీ
మనాలి మరియు లేహ్‌లను కలిపే అటల్ సొరంగం పేరిట వైరల్ అవుతున్న ఫోటో కాలిఫోర్నియాలోని సొరంగం, ఇది ఇటీవల భారతదేశంలో ప్రారంభించిన అటల్ టన్నెల్ అంటూ తప్పుడు వాదనతో వైరల్ అవుతోంది.
- By: Abhishek Parashar
- Published: Oct 9, 2020 at 12:12 PM
- Updated: Oct 9, 2020 at 12:59 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : అటల్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన తరువాత, ఇదే ఆ సొరంగం యొక్క ఫోటో అంటూ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదోవ పట్టించేదిగా తేలింది. ఇది అటల్ సొరంగం అంటూ వైరల్ అవుతోంది. అయితే, వాస్తవానికి ఈ ఫోటోలో ఉన్నది అసలు భారతదేశానికి సంబంధించిన సొరంగమే కాదు.
వైరల్ అవుతున్నది ఏంటి?
ట్విట్టర్ యూజర్ ‘సునీల్ భారతి (west delhi president at MPS) ఈ వైరల్ ఫోటోను (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు. “ప్రపంచంలోని అతి పొడవైన రహదారి సొరంగం ‘అటల్ టన్నెల్’ ప్రారంభించిన పిఎం శ్రీ నరేంద్ర మోడీ జికి అభినందనలు. ఈ సొరంగం మా దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సొరంగం వల్ల మనాలి మరియు లేహ్ మధ్య ప్రయాణించే సమయం కూడా 4 నుండి 5 గంటలు తగ్గుతుంది, ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు.. పర్యాటక రంగం పురోగతికి దోహదపడుతుంది.”
ట్విట్టర్ యూజర్ ‘చైల్ బిహారీ‘ కూడా వైరల్ ఫోటోను (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేశారు, “ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ అయిన ‘అటల్ టన్నెల్’ ప్రారంభించిన పిఎం శ్రీ నరేంద్రమోడి జికి అభినందనలు. AtalTunnel #AtalTunnelRohtang.”
ట్విట్టర్ యూజర్ ‘నరేంద్ర కుమార్ చావ్లా‘ కూడా ఈ చిత్రాన్ని (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు, “ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం ‘అటల్ టన్నెల్’ ప్రారంభించిన పీఎం శ్రీ నరేంద్రమోడీ జీకి అభినందనలు. దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఈ సొరంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనాలి మరియు లేహ్ మధ్య దూరం కూడా 4 నుండి 5 గంటలు తగ్గి, ఆర్థిక వ్యవస్థ మరియు పర్యాటక రంగం పురోగతికి దోహదపడుతుంది. AtalTunnelRohtang. “
చాలా మంది మిగతా యూజర్లు కూడా ఈ ఫోటోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి క్లెయిమ్‌లతో షేర్ చేసుకున్నారు.
దర్యాప్తు :
లేహ్‌ను మనాలికి కలిపే అటల్ సొరంగం అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ తెలియజేసింది.
ఈ సొరంగం ప్రవేశద్వారం అక్టోబర్ 3వ తేదీన ‘MyGov Himachal’ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌పై ట్వీట్ చేసిన చిత్రాలలో చూడవచ్చు. ఇచ్చిన సమాచారం ప్రకారం, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ ప్రారంభం వల్ల పర్యాటక నగరమైన మనాలి నుండి లేహ్ వరకు 46 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
వైరల్ అవుతున్న ఫోటోతో ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేసిన అటల్ సొరంగం ఫోటో భిన్నంగా ఉంది. వైరల్ పోస్ట్‌లో అసలు ఫోటో కాకుండా.. వేరే ఫోటోను షేర్ చేస్తున్నారు.
మా సహోద్యోగి అయిన దైనిక్ జాగరణ్ మండి యొక్క డిప్యూటీ చీఫ్ కరస్పాండెంట్ మరియు అటల్ టన్నెల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేసిన హన్స్‌రాజ్ సైనీని సంప్రదించి స్పష్టత ఏంటో కోరడం జరిగింది, “వైరల్ అవుతున్న ఫోటో అటల్ సొరంగానికి సంబంధించినది కాదు” అని హన్స్‌రాజ్ చెప్పారు. అటల్ సొరంగం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన పలు యాంగిల్స్‌లో ఫోటోలు తీశారు. వాటిని మాకు పంపించారు. అయితే, వైరల్ అవుతున్న ఫోటోతో ఇవేవీ సరిపోలడం లేదు.
ఆ తరువాత, అటల్ టన్నెల్ పేరిట వైరల్ అవుతున్న చిత్రం యొక్క అసలు మూలాన్ని కనుగొనడానికి మేము ప్రయత్నించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్‌లో శోధించగా ఈ ఫోటోను inspectionservices.netలో కనుగొన్నాము.
ఆ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోటో కాలిఫోర్నియాలోని శాన్ పెడ్రో పర్వతం కిందినుంచి తొలిచిన 4200 అడుగుల పొడవైన సొరంగం, దీనిని న్యూ ఆస్ట్రియన్ టన్నెల్ మెథడ్ సహాయంతో నిర్మిస్తున్నారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (కాల్‌ట్రాన్స్) సుమారు 3,343 మిలియన్ల వ్యయంతో సొరంగం నిర్మిస్తోంది.
ఇప్పుడు ఈ సొరంగం సామాన్య ప్రజల సందర్శణ కోసం తెరిచారు. ఈ సొరంగం వద్ద రాకపోకల దృశ్యాలను కింది యూట్యూబ్‌లోని వీడియోలో చూడవచ్చు.
తప్పుదోవ పట్టించే వాదనతో వైరల్ ఫోటోను షేర్ చేసిన యూజర్ తనను తాను మహారాణా ప్రతాప్ సేన (పశ్చిమ ఢిల్లీ) అధ్యక్షుడిగా తన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.
निष्कर्ष: మనాలి మరియు లేహ్‌లను కలిపే అటల్ సొరంగం పేరిట వైరల్ అవుతున్న ఫోటో కాలిఫోర్నియాలోని సొరంగం, ఇది ఇటీవల భారతదేశంలో ప్రారంభించిన అటల్ టన్నెల్ అంటూ తప్పుడు వాదనతో వైరల్ అవుతోంది.
- Claim Review : ప్రపంచంలోని అతి పొడవైన రహదారి సొరంగం 'అటల్ టన్నెల్' ఫోటో
- Claimed By : Narendra Kumar Chawla
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.