X
X

Fact Check: పాకిస్తాన్ లో మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి సంబంధించిన పాత కేసు తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). పాకిస్తాన్ లో ఒక హిందూ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారము మరియు ఆమె కుటుంబముపై దాడి జరిగిన ఒక సంఘటన అని పేర్కొంటూ సోషల్ మీడియాపై ఒక వీడియో క్లిప్ షేర్ చేయబడుతోంది. ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. వైరల్ అయిన వీడియో పాకిస్తాన్ లో జరిగిన ఒక పాత సంఘటన, కాని అది ఇటీవలే జరిగినది అని తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో ప్రచారం చేయబడుతోంది.

ఏది వైరల్ అవుతోంది?

వైరల్ వీడియో (ఆర్కైవ్ లింక్) ను షేర్ చేస్తూ, ఫేస్‎బుక్ యూజర్, ‘పారస్ జేత్వా’ ఇలా వ్రాశారు, “ఈ వీడియో చూసిన తరువాత నేను అవాక్కయ్యాను…. అయినా ఇది కొంతమంది సెక్యులర్ హిందువుల కళ్ళు తెరుస్తుందని వ్రాస్తున్నాను. ఈ వాస్తవ సంఘటన పాకిస్తాన్ లో జరిగింది, ఒక 13-సంవత్సరాల హిందు బాలిక మరియు ఆమె కుటుంబము విలపిస్తున్నారు కాని ఆ 5 మంది ముస్లింలు ఆమెపై అత్యాచారము చేసి ఆమెను కొట్టారు. ఎందుకంటే ఆమె ఒక హిందువు కాబట్టి.

ఈ అత్యాచారము మరియు అసహన దుష్ప్రవర్తన వీడియో చూసిన తరువాత నా హృదయము రోదించింది. కేవలం ఇదే కాదు, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి.”

ఇటువంటి క్లెయిమ్స్ తో ఇతర యూజర్స్ చాలామంది ఇదే వీడియోను ట్విట్టర్ పై షేర్ చేశారు. చాలామంది యూజర్లు కూడా ఇదే క్లెయిమ్ తో వివిధ సోషల్ మీడియా వేదికలపై షేర్ చేశారు.

దర్యాప్తు

వైరల్ వీడియోలోని కీవర్డ్స్ యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ‘పాకిస్తాన్ డెయిలీ’ యొక్క వెబ్సైట్ పై ఫిబ్రవరి 13, 2021 నాడు ప్రచురించబడిన ఒక report  లభించింది, ఇందులో ఉపయోగించబడిన చిత్రము వైరల్ వీడియో యొక్క విజువల్స్ తో సరిపోలుతుంది.

నివేదికలో ఇవ్వబడిన సమాచారము ప్రకారము, “గుల్షన్-ఏ-హదీద్, కరాచి లో ఒక 16-సంవత్సరాల మైనర్ బాలికపై అయిదుమంది అత్యాచారం చేశారు. సమాచారము ప్రకారము, అయిదుమంది యువకులు ప్రభుత్వ కళాశాల, గుల్షన్-ఏ-హదీద్ నుండి ఒక మైనర్ బాలికను అపహరించారు.” ఈ విషయములో బాలిక వాజ్ఞ్మూలము తరువాత ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

బాధితుల మద్ధతు కొరకు ప్రజలు పాకిస్తానీ సోషల్ మీడియాపై ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ సంఘటన చాలా పాకిస్తానీ వార్తా ఛానల్ మరియు వెబ్సైట్స్ పై కూడా పేర్కొనబడింది. కరాచి-ఆధారిత కార్యకర్త శామ్స్ చందీస్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ పై ఈ సంఘటన చిత్రాన్ని షేర్ చేశారు.

arynews.tv వెబ్సైట్ పై వచ్చిన ఫిబ్రవరి 17,2021 నాటి నివేదిక ప్రకారము, “డెప్యూటి ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఈస్ట్, కరాచీ ప్రంతములోని గుల్షన్-ఏ-హదీద్ లో ఒక కళాశాల బాలిక పై ఆరోపించబడిన అపహరణ మరియు సామూహిక అత్యాచారము గురించి కూలంకషంగా దర్యాప్తు చేయుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు”

వైరల్ అవుతున్న ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగిన ఒక పాత సంఘటన అనేది స్పష్టమైన విషయం. మేము ఈ వైరల్ వీడియోకు సంబంధించి పాకిస్తాన్-ఆధారిత విలేఖరి మరియు ఫాక్ట్ చెక్కర్ లుబ్నా జరార్ నక్విని సంప్రదించాము. “వైరల్ సంఘటన పాతది” అని ఆమె ధృవీకరించారు.

ఇదివరకు, పాకిస్తాన్ సైన్యానికి చెందిన మేజర్ సామియా రెహమాన్ యొక్క చిత్రాన్ని సీమా హైదర్ సంఘటనకు అనుసంధానించి భారతీయ సోషల్ మీడియాపై వైరల్ చేయబడింది. దానిపై ఫాక్ట్ చెక్ నివేదికను ఇక్కడ చదవవచ్చు.

తన అకౌంట్ పై షేర్ చేయబడిన కంటెంట్ ప్రకారము, తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ ఒక నిర్దిష్ట భావజాలముతో ప్రభావితం అయ్యాడు అనిపిస్తోంది.

ముగింపు: కరాచీ, పాకిస్తాన్ లో ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇటీవల జరిగిందే అనే తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later