యూపాటోరియం పెర్ఫోరియం 200 అనే ఔషధము 48 గంటలలో డెంగ్యూను తగ్గించగలదు అని క్లెయిమ్ చేసే పోస్ట్ తప్పుదోవపట్టించేది.
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ) యూపాటోరియం పెర్ఫోరియం 200 అనే ఒక ఔషధము 48 గంటలలో డెంగ్యూను తగ్గిస్తుంది అనే క్లెయిమ్ తో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ క్లెయిమ్ ప్రకారం, యూపాటోరియం పెర్ఫోరియం 200 ఒక హోమియోపతిక్ ఔషధము మరియు ఈ ఔషధము యొక్క 2,3 చుక్కలను నీటిలో డైల్యూట్ చేసి రెండు రోజుల్ తీసుకుంటే, డెంగ్యూ తగ్గుతుంది. తన దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది.
హెల్త్ టిప్స్ హిందీ (ఆర్కైవ్) అని పేరు ఉన్న ఒక పేజ్ ద్వారా షేర్ చేయబడిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ఇలా క్లెయిమ్ చేస్తోంది: యూపాటోరియం పెర్ఫోరియం 200 అనే ఒక ఔషధము డైల్యూట్ చేసి 2 రోజులు తీసుకుంటే, అది డెంగ్యూను తగ్గిస్తుంది. డెంగ్యూను 48 గంటలలో తగ్గించవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ మెహ్రూలి, ఢిల్లీలోని రామానుజం హోమియోపతిక్ సెంటర్ కు చెందిన డా. శాలిని శాఖ్యను సంప్రదించి వైరల్ క్లెయిమ్ ను సెర్చ్ చేశారు. ఆమె ఇలా వివరించారు: “వ్యాధి యొక్క చికిత్స దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇంత తక్కువ సమయములో, ఎవరైనా డెంగ్యూ వ్యాధి యొక్క స్వభావాన్ని మరియు దాని పనితీరును నిర్ణయించగలరు, కాని 48 గంటలలో పూర్తిగా ఈ వ్యాధిని తగ్గించవచ్చు అని చెప్పలేము. వైరల్ పోస్ట్ లో ఉన్న ఔషధము పేరు తప్పుగా-వ్రాయబడింది, నిజానికి దాని అసలు పేరు “యూపాటోరియం పెర్ఫోలియాటం”
విశ్వాస్ న్యూస్ డెంగ్యూ చికిత్స గురించి మరింత సెర్చ్ చేసి, ప్రజారోగ్య సమాచారము కొరకు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ అయిన నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా అందించిన ఒక నివేదికను కనుగొనింది. డెంగ్యూకు ఎలాంటి ప్రత్యేక చికిత్స లేదు అని ఈ అధికారిక వెబ్సైట్ పేర్కొనింది. గుడూచి, తులసి, శొంటి మరియు బొప్పాయి వంటి ఔషధ మొక్కలు వ్యాధి యొక్క రుగ్మతలను నివారిస్తాయి మరియు వ్యాధిని వేగవంతంగా నియంత్రించడములో సహాయపడతాయి.
మెట్రో మాస్ ఆసుపత్రికి చెందిన డా. వీరేంద్ర మిట్టల్ కూడా ఈ ఔషధము డెంగ్యూను 48 గంటలలో తగ్గించలేదు అని సూచిస్తున్నారు.
ఈ వైరల్ పోస్ట్ హెల్త్ టిప్స్ హిందీ అని పేరు ఉన్న ఒక పేజ్ ద్వారా షేర్ చేయబడింది. ఈ పేజ్ 2019 లో సృష్టించబడింది.
निष्कर्ष: యూపాటోరియం పెర్ఫోరియం 200 అనే ఔషధము 48 గంటలలో డెంగ్యూను తగ్గించగలదు అని క్లెయిమ్ చేసే పోస్ట్ తప్పుదోవపట్టించేది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923