వాస్తవ తనిఖీ: ఇది అయోధ్య రామాలయం చిత్రం కాదు, వైరల్ దావా అబద్ధం

వైరల్ పోస్ట్ నకిలీ. ఫోటోలు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్‌కు సంబంధించినవి. అయోధ్యలోని రామాలయం ఫోటో కాదు.

వాస్తవ తనిఖీ: ఇది అయోధ్య రామాలయం చిత్రం కాదు, వైరల్ దావా అబద్ధం

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : నిర్మాణంలో ఉన్న ఓ ఆలయం యొక్క చిత్రం అయోధ్యలోని రామాలయం అని కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. వారణాసిలో నిర్మాణంలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ఫోటోలు నకిలీ దావాతో వైరల్ అవుతున్నాయని గుర్తించడం జరిగింది.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ కుందన్ చౌహాన్ రాజ్‌పుత్ అక్టోబర్ 31 న నిర్మాణంలో ఉన్న ఒక దేవాలయం యొక్క చిత్రాన్ని పోస్ట్ చేశారు, ‘అయోధ్య ప్రభు శ్రీ రామ్ జీ ఆలయం యొక్క మొదటి చిత్రం’ అని ఆ పోస్ట్‌కు రైటప్‌ ఇచ్చారు.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
వైరల్ ఫోటో యొక్క అసలు మూలాన్ని కనుగొనడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సాధనాన్ని ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో శోధించాము. ఈ ఫోటోలను ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్‌గా గుర్తించడం జరిగింది. జాగరణ్‌.కామ్ అక్టోబర్ 27వ తేదీన ప్రచురించిన వార్తా కథనంలో ఈ చిత్రాలను కనుగొన్నాము.

హిందూస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్ కూడా ఈ చిత్రాన్ని “నిర్మాణంలో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం యొక్క ప్రధాన సముదాయం” అనే శీర్షికతో ప్రచురించింది.

ఈ దావాను ధృవీకరించడానికి మేము దైనిక్ జాగరణ్‌ యొక్క వారణాసి కరస్పాండెంట్ శశ్వత్ మిశ్రాను సంప్రదించాము. “ఈ చిత్రాలు నిర్మాణంలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్‌కు సంబంధించినవి” అని మిశ్రా చెప్పారు.

వైరల్ పోస్ట్‌ను షేర్‌ చేసిన యూజర్ సోషల్ స్కానింగ్‌లో అతను బీహార్‌కు చెందినవాడని, ఫేస్‌బుక్‌లో 1,712 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది. అతను సెప్టెంబర్ 2017 నుండి యాక్టివ్‌గా ఉన్నాడు.

निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. ఫోటోలు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్‌కు సంబంధించినవి. అయోధ్యలోని రామాలయం ఫోటో కాదు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు