ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ సంఘటనకు సంబంధించిన బాధితురాలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తప్పు. బాధితురాలికి బదులు మరో ఫోటోను వైరల్ చేస్తున్నారు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఒక యువతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది హత్రాస్ అమానుషకాండ బాధితురలి ఫోటో అని అందరూ షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. హత్రాస్ సంఘటనకు సంబంధించి బాధితురాలి పేరిట వైరల్ అవుతున్న ఫోటో మరో అమ్మాయిది. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ తప్పుడు దావాతో ఈ ఫోటో లింక్ చేయబడి వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా యూజర్ ‘ਰਜਿੰਦਰ ਸਿੰਘ written’ (రాజీందర్ సింగ్ రాజన్) ఈ వైరల్ ఫోటోను షేర్ చేసి ఇలా కామెంట్ రాశారు. ‘ఈ కూతురు హత్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురయ్యింది. ఆమె నాలుక కత్తిరించారు..’
ఈ వైరల్ పోస్ట్‌కు సంబంధించిన అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.
హత్రాస్ ఘటనను ప్రస్తావిస్తూ చాలా మంది ఈ ఫోటోను షేర్ చేశారు. ట్విట్టర్ యూజర్ ‘గీత్’ ఈ ఫోటో షేరింగ్ (ఆర్కైవ్ లింక్) చేసి.. ఇలా రైటప్ ఇచ్చారు. “ఈ అందమైన అమాయకురాలు ఎలా భరించి ఉంటుందో… (గ్యాంగ్ రేప్, నాలుక తెగిపోవడం, మెడ & వెన్నుపాము విరిగిపోవడం) అసలు తలచుకుంటేనే నా గుండె పగిలిపోతోంది. ఇలాంటి హింసాత్మక పరిస్థితి ఎవరికీ రాకూడదు. చాలు.. చాలు… ! పరిస్థితులు మారాలి”
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది యూజర్లు హత్రాస్ సంఘటన బాధితురాలిగా భావించి ఈ ఫోటోకు ఇలాంటి వాదనలు రాసి షేర్ చేశారు.
దర్యాప్తు :
లైంగిక నేరాలను నివేదించడానికి నిర్దేశించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని విశ్వాస్ న్యూస్ బాధితురాలి పేరు మరియు గుర్తింపును బహిరంగపరచడం లేదు. దీంతో పాటు, బాధితురాలి గుర్తింపును ధృవీకరించేటప్పుడు కుటుంబ సభ్యుల భావాలను కూడా మేము పరిగణనలోకి తీసుకున్నాము. అమ్మాయి కుటుంబ సభ్యులను వేధించే బదులు, గుర్తింపును ధృవీకరించడానికి మేము ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించాము.
బాధితురాలి ఫోటో, వైరల్ అవుతున్న అమ్మాయి ఫోటో యొక్క తులనాత్మక పరిశీలనలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం స్పష్టంగా గమనించవచ్చు. ఈ రెండు ఫోటోలు.. ఇద్దరు వేర్వేరు అమ్మాయిలకు సంబంధించినవి. హత్రాస్ సంఘటన బాధితురాలి చిత్రంగా వైరల్ అవుతున్నది మరో అమ్మాయి ఫోటో.
హత్రాస్ సంఘటన బాధితురాలి పేరిట వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించిన స్వతంత్ర గుర్తింపును విశ్వాస్ న్యూస్ ధృవీకరించలేదు. అయితే, ఇది హత్రాస్ సంఘటన బాధితురాలి ఫోటో మాత్రం కాదని ధృవీకరించగలిగాం.
ఈ సంఘటనను కవర్ చేసిన మా సహోద్యోగి దైనిక్ జాగరన్ రిపోర్టర్ హిమాన్షు గుప్తాను మేం సంప్రదించడం జరిగింది. “వైరల్ అవుతున్న చిత్రం హత్రాస్ కేసు బాధితురాలిది కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫోటోలో ఉన్నది మరొక అమ్మాయి అని ఆయన తెలియజేశారు.
ముఖ్యంగా, హత్రాస్ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 14వ తేదీన జిల్లా ఆసుపత్రి హత్రాస్‌లో ఈ వీడియో రికార్డు చేసినట్లు, ఇందులో బాధిత బాలిక నిందితుడి పేరు చెప్పడాన్ని వినవచ్చని గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ… ”బాధితురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, నిందితులపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు’ అని తెలిపారు.
బాధితురాలిపై అత్యాచారం చేసిన తరువాత ఆమె నాలుక కత్తిరించబడిందని వైరల్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను హత్రాస్ పోలీసులు ఖండించారు.
2020 సెప్టెంబర్ 30వ తేదీన దైనిక్ జాగరణ్‌లో ప్రచురించిన వార్తలను గమనిస్తే, హత్రాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్‌పా గ్రామానికి చెందిన బూల్‌గారి కేసును విచారించడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్‌ను నియమించారు. ఈ సిట్ బృందం.. ప్రత్యేకంగా హత్రాస్ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. ఏడు రోజుల్లో తన నివేదికను సమర్పిస్తుంది.
వైరల్ చిత్రాన్ని తప్పుడు దావాతో పంచుకున్న యూజర్, తన ప్రొఫైల్‌లో తనను తాను కీర్తన మరియు ప్రమోటర్‌గా చెప్పుకున్నాడు. ఈ ప్రొఫైల్ ఆగస్టు 2014 నుండి యాక్టివ్‌గా ఉంది.
निष्कर्ष: ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ సంఘటనకు సంబంధించిన బాధితురాలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తప్పు. బాధితురాలికి బదులు మరో ఫోటోను వైరల్ చేస్తున్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923