విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో వాదన తప్పు అని గుర్తించింది. నిజానికి ఇది ఒక ఫోటో, పెయింటింగ్ కాదు.
న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్)- ఒక మహిళ జాతిపరమైన అలంకరణలో కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో కాదని, ఓ ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ అని పోస్ట్‌లో వాదిస్తున్నారు. విశ్వాస్ న్యూస్ తమ విచారణలో ఆ వాదన తప్పు అని తెలుసుకుంది. నిజానికి ఇది ఒక ఫోటో, పెయింటింగ్ కాదు.
ఫేస్బుక్ పేజీ రేడియో తరానా పోస్ట్‌ను షేర్ చేసింది, అందులో “ఇది ఫోటోగ్రాఫ్ కాదు పెయింటింగ్: ఇదీ భారతీయ పెయింటింగ్ ప్రతిభ.”
ఆర్కైవ్ చేసిన పోస్ట్ వర్షన్ ఇక్కడ చూడండి.
ఈ పోస్ట్‌ని ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. స్నేహలతా వసైకర్ అనే మరాఠీ నటి ఇన్స్టాగ్రామ్ అకౌంటులో 13 అక్టోబర్ 2018న ఈ ఫోటోని అప్లోడ్ చేయబడినట్లుగా మేము తెలుసుకున్నాము. క్యాప్షన్ ప్రకారం, ఈ ఫోటో పృథ్వీరాజ్_బాబర్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు.
పృథ్వీరాజ్ బాబర్ అనే ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్ అకౌంటులో కూడా మేము ఈ ఫోటోని చూశాము.
ఈ విషయమై పృథ్వీరాజ్ బాబర్‌ని మేము ఫోన్లో సంప్రదించాము. వైరల్ అయిన వాదన తప్పు అని, నిజానికి అది తను 2018లో తన కెమెరాతో తీసిన ఫోటో అని ఆయన ధృవీకరించారు. ఆయన ఈ ఫోటో షూట్ నుండి మరికొన్ని ఫోటోలను మాకు అందించారు, వాటిని ఈ క్రింద చూడవచ్చును.
తప్పుడు పోస్ట్‌ను షేర్ చేసిన పేజీ రేడియో తరానా సోషల్ అకౌంటును స్కాన్ చేస్తే, ఆ పేజీకి 805,044 మంది ఫాలోవర్లు ఉన్నట్లు మాకు తెలిసింది.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన పరిశోధనలో వాదన తప్పు అని గుర్తించింది. నిజానికి ఇది ఒక ఫోటో, పెయింటింగ్ కాదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923