Fact Check: బంగ్లాదేశ్ నిరసనను చూపించే ఈ చిత్రము ప్రతీకాత్మకమైనది మరియు AI-సృష్టి

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ చిత్రము నిజమైనది కాదని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన ఒక ప్రతీకాత్మమైన చిత్రమని కనుగొనింది. ఇది నిజమైన చిత్రము అని చేయబడిన క్లెయిమ అసత్యము.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). బంగ్లాదేశ్ లో కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసన మరియు ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా నేపథ్యములో, సోషల్ మీడియాపై రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రజలు ఒక స్తంభముపై బంగ్లాదేశ్ జెండాను ఊపుతున్న ఒక చిత్రము వైరల్ అవుతోంది. చాలామంది యూజర్స్ వివిధ ప్లాట్ఫార్మ్స్ పై దీనిని వైరల్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వైరల్ చిత్రము నిజమైనది కాదని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన ఒక ప్రతీకాత్మమైన చిత్రమని కనుగొనింది. ఇది నిజమైన చిత్రము అని చేయబడిన క్లెయిమ అసత్యము.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఒక ఫేస్‎బుక్ యూజర్ ఈ వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “ఆకలి మరియు నిరుద్యోగము తరచూ నియంతల సింహాసనాలను తీసేసుకుంటాయి!!” ఒకవేళ ప్రజలు వీధులలోకి వస్తే, ప్రధానమంత్రి కూడా దేశం వదిలి పారిపోవాలి!! ఈ చిత్రము ఈరోజే బంగ్లాదేశ్ నుండి వచ్చింది. #షేక్‎హసీన #బంగ్లాదేశ్.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు, మేము వైరల్ ఫోటోను పరిశీలించాము మరియు ఆ ఫోటోలో చాలా తప్పులు గుర్తించాము. స్తంభాన్ని ఎక్కుతున్న కొంతమంది చేతులు కాళ్ళు కృత్రిమంగా కనిపించాయి, గుంపు కూడా అస్పష్టంగా కనిపించింది. ఇదే కాకుండా, ఫోటోలో కనిపించే గుబుర్లు కూడా ఫోకస్ లో లేవు మరియు వెనుక ఉన్న భవనము కూడా వక్రీకరించబడింది. ఈ అంశాల కారణంగా చిత్రము AI-జనరేట్ చేయబడినది అనే అనుమానం మాకు కలిగింది.

మేము ఫోటోను AI-జనరేట్ చేయబడిన విషయాన్ని కనుగొనుటకు తయారుచేయబడిన ఒక టూల్, హైవ్ మాడరేషన్ కు అప్లోడ్ చేశాము. ఇది ఈ ఫోటో AI-జనరేట్ చేయబడి ఉండే సంభావ్యత 99.6 శాతము అని సూచించింది.

మేము ఫోటోను AI-జనరేట్ చేయబడిన విషయాన్ని కనుగొనుటకు మరొక టూల్ isitai.com పై కూడా చెక్ చేశాము, ఇది ఈ ఫోటో AI-జనరేట్ చేయబడి ఉండే సంభావ్యత 64 శాతముగా సూచించింది.

AI నిపుణుడు భార్గవ్ వలేరా కూడా కనిపించే లోపాలను తెలుపుతూ ఈ ఫోటో AI-జనరేట్ చేయబడినది అని ధృవీకరించారు.

రిపోర్ట్స్ ప్రకారము, బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక నిరసనల మధ్య ప్రధానమంత్రి షేక్ హసీన రాజీనామా చేశారు. ఇది దోపిడి, విధ్వంసం, హింస మరియు పెద్ద ఎత్తున హత్యలకు కూడా దారితీసింది. ప్రస్తుత పరిస్థితి గురించి మరింత తెలుసుకొనుటకు ఢాకా ట్రిబ్యూన్ నుండి వార్తలు చూడండి.

అదే సమయములో, ప్రస్తుత పరిస్థితులలో, భారతదేశ పౌరులు తదుపరి ప్రకటన వరకు బంగ్లాదేశ్ కు వెళ్ళకూడదని మరియు ఒకవేళ ఇప్పటికే అక్కడ ఉంటే, అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఖచ్ఛితంగా సూచించింది. భారత పౌరులు తమ కదలికలను పరిమితం చేసుకోవాలని సూచించబడుతోంది మరియు ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ అత్యవసర ఫోన్ నంబర్లు తెలుసుకొని ఉండాలని కూడా సూచించింది +8801958383679, +8801958383680, and +8801937400591.

చివరిగా, ఫోటోను షేర్ చేసిన పేజ్ ను సమీక్షించాము మరియు దీనికి 50000 అనుయాయీలు ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ చిత్రము నిజమైనది కాదని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన ఒక ప్రతీకాత్మకమైన చిత్రమని వెల్లడించింది. ఈ చిత్రము నిజమైనదే అనే క్లెయిమ్ అసత్యమైనది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు