వాస్తవ తనిఖీ: బిజెపి జెండాలు ప్రదర్శిస్తున్న ఈ ప్రాంతం పిఓకె కాదు, ఇది జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన వీడియో

విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ వీడియో PoKకు సంబంధించినది కాదని జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారమని కనుగొనడం జరిగింది.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మరియు బిజెపి జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఈ వీడియోను చేసిన యూజర్‌.. ఇది PoK లో దృశ్యమని పేర్కొన్నారు.

విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ వీడియో PoK లోనిది కాదని, జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించినదని కనుగొనడం జరిగింది.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ శ్రీ లైవ్ “పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో బిజెపి జెండా” అనే వాదనతో ఈ వీడియోను షేర్‌ చేశారు.

ఈ పోస్ట్‌కు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఇన్‌విడ్ సాధనాన్ని ఉపయోగించి వీడియోను పరిశోధించి కీఫ్రేమ్‌లను సేకరించడం జరిగింది. మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి ఆ స్క్రీన్‌గ్రాబ్‌లను శోధించాము. బిజెపి జమ్మూ కాశ్మీర్ యూనిట్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో నవంబర్ 22, 2020 న అప్లోడ్ చేయబడిన వీడియోను మేము కనుగొన్నాము, దీనిలో వీడియో స్క్రీన్‌షాట్లు చూడవచ్చు.

వీడియోతో ఇలా కామెంట్‌ చేశారు. ‘#DDCElections #JKWithBJP #DDCElections #JKWithBJP #జమ్ముకాశ్మీర్ నుండి వచ్చిన ఈ విజువల్స్ ప్రజల ప్రేమ మరియు ఆప్యాయతను స్పష్టంగా సూచిస్తున్నాయి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ నాయకత్వంపై వారి రాక్-హార్డ్ విశ్వాసం’. ఈ పోస్ట్ ప్రకారం, వీడియో జమ్మూ కాశ్మీర్‌కు చెందినది.

విశ్వాస్ న్యూస్ బిజెపి జమ్మూ కాశ్మీర్ యూనిట్ మీడియా హెడ్ మంజూర్ భట్ ను సంప్రదించింది. “ఈ వీడియో జమ్మూలోని కిష్త్వార్లో ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీకి సంబంధించినది” అని ఆయన చెప్పారు. ఈ వైరల్ వీడియో బిజెపి ఎన్నికల ర్యాలీకి సంబంధించినది తప్ప, PoKకు సంబంధం లేదని స్పష్టమైంది.

నవంబర్ 28 నుండి డిసెంబర్ 19 వరకు ఎనిమిది దశల్లో జమ్మూ కాశ్మీర్‌లో డిడిసి ఎన్నికలు, పంచాయతీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

నకిలీ పోస్ట్‌ను షేర్‌ చేసిన ఫేస్‌బుక్ యూజర్ శ్రీ లైవ్ యొక్క ప్రొఫైల్‌ను మేము స్కాన్ చేసాము. ఆ యూజర్‌కు ఫేస్‌బుక్‌లో 1,957 మంది ఫాలోవర్లు ఉన్నారని కనుగొన్నాము.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ ఈ దావాపై దర్యాప్తు చేసి, వైరల్ వీడియో PoKకు సంబంధించినది కాదని జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారమని కనుగొనడం జరిగింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు