ముగింపు: ఇటీవలిది అని చెప్తూ చక్కర్లు కొడుతున్న సి60 కమాండోలకు చెందిన ఒక వీడియో ఈ సంవత్సరానికి చెందినది కాదు, అది ఇటీవలి ఎన్కౌంటర్ కు సంబంధించినది కాదు.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): వివిధ సోషల్ మీడియా వేదికలలో ఒక వీడియో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇందులో సి60 కమాండోలు వేడుక చేసుకుంటున్నట్లు చూడవచ్చు. పేరుమోసిన నక్సల్ అయిన మిలింద్ తెల్తుంబ్డే మరియు 26 ఇతర నక్సల్స్ ల ఎన్కౌంటర్ తరువాత సి60 కమాండోలు వేడుక చేసుకుంటున్నట్లుగా ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. అయితే, ఈ వీడియో ప్రస్తుత సంఘటనకు సంబంధించినది కాదు అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.
అనువాదము: ఫేస్బుక్ యూజర్ సూరజ్ లోహార్ 30 క్షణాల నిడివి కలిగిన ఒక వీడియోను పోస్ట్ చేశారు మరియు ఈ విధంగా వ్రాశారు: పేరుమోసిన నక్సలైట్ మిలింద్ తెల్తుంబ్డే మరియు 26 రెడ్ మంకీస్ ఎన్కౌంటర్ తరువాత మహారాష్ట్ర పోలీస్ 33 కు చెందిన సి60 కమాండోలకు స్వాగతం
ఆ పోస్ట్ ను మరియు దాని ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి
ఇదే క్లెయిమ్ ను జమ్ము కాశ్మీర్ బిజేపి సభ్యుడు రమన్ సూరి ట్విట్టర్ పై షేర్ చేశారు.
రమణ్ సూరి యొక్క పోస్ట్ పై కామెంట్స్ ను తనిఖీ చేయడము ద్వారా విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ పోస్ట్ కు 33 రీట్వీట్స్ మరియు 187 లైక్స్ ఉన్నాయి. ఒక యూజర్ ఇలా వ్రాశారు, “ఇది పాత వీడియో. ఇది మే 2021లో మహారాష్ట్ర పోలీసులు 13 మంది నక్సల్స్ ను చంపినప్పటి సంఘటనకు సంబంధించినది.”
ఇది విశ్వాస్ న్యూస్ వారికి ఒక క్లూ అయ్యింది మరియు మేము ఇవే కీవర్డ్స్ ను మరింత తనిఖీ కొరకు ఉపయోగించాము. మేము “మే 2021 సి60 కమాండోస్” అనే కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాము.
మాకు ఇదే వీడియో ఈటీవి భారత్ వెబ్సైట్ పై మే 22, 2021 నాడు పోస్ట్ చేయబడింది. ఆ వార్త ప్రకారం “మహారాష్ట్ర యొక్క గడ్చిరోలి లోని నిషేధించబడిన అవుట్‌ఫిట్స్ కు వ్యతిరేకంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ విజయవంతం చేసిన సి60 కమాండోలకు పోలీసు జిల్లా హెడ్‌క్వార్టర్స్ వద్ద అధికారులు ‘బ్యాండ్ బాజా’ తో స్వాగతం పలికారు”.
అలాగే ఈ వీడియో ప్రస్తుత సంఘటనకు సంబంధించినది కాదు అని గడ్చిరోలి పోలీసుల ద్వారా ఒక ట్వీట్ కూడా మేము కనుగొన్నాము.
మేము గడ్చిరోలి ఎస్పి అంకిత్ గోయల్ ద్వారా కూడా ఒక ట్వీట్ చూశాము.
దర్యాప్తులో చివరి చర్యగా మేము గడ్చిరోలి ఎస్పి అంకిత్ గోయల్ గారిని కలిశామ. ఈ వీడియో ఇటీవలిది కాదని ప్రస్తుత ఎన్కౌంటర్ కు సంబంధించినది కాదని ఆయన చెప్పారు.
దర్యాప్తు యొక్క చివరి దశలో మేము ఈ పోస్ట్ ను షేర్ చేసిన ట్విట్టర్ ఖాతాపై నేపథ్య తనిఖీ చేశాము. రమణ్ సూరు బిజేపి జమ్ము & కాశ్మీర్ యొక్క బిజేపి సభ్యుడు. ఈ యూజర్ ఉ 1,373 మంది ఫాలోయర్స్ ఉన్నారు మరియు 1,431 ను అనుసరిస్తున్నారు.
निष्कर्ष: ముగింపు: ఇటీవలిది అని చెప్తూ చక్కర్లు కొడుతున్న సి60 కమాండోలకు చెందిన ఒక వీడియో ఈ సంవత్సరానికి చెందినది కాదు, అది ఇటీవలి ఎన్కౌంటర్ కు సంబంధించినది కాదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923