వాస్తవ తనిఖీ : బిడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనే వైరల్ పోస్ట్ అబద్ధం
వైరల్ పోస్ట్ నకిలీ. ఇంతవరకు తమకు ఎటువంటి ఆహ్వానం రాలేదని పేర్కొంటూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కార్యాలయం అలాంటి వాదనలను ఖండించింది.
- By: Bhagwant Singh
- Published: Nov 12, 2020 at 04:23 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ పేర్కొంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ వాదన నకిలీదని తేలింది. డాక్టర్ సింగ్ కార్యాలయ వర్గాలు కూడా ఈ వాదనను ఖండించాయి.
దావా :
నవంబర్ 9వ తేదీన, రాకేశ్ పటేల్ ఫేస్బుక్ పేజీలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోటోను అప్లోడ్ చేశారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ యునైటెడ్ స్టేట్స్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.” అని ఆ ఫోటో కింద కామెంట్ రాశారు.
పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 2020 యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. అమెరికన్ చరిత్రలోనే ట్రంప్‌ను ఓడించిన అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడు బిడెన్. 77 సంవత్సరాల మాజీ వైస్ ప్రెసిడెంట్ బిడెన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క 46 వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
బిడెన్ విజయం తరువాత, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంటూ వైరల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మేము దీనికి సంబంధించిన వార్తా కథనాల కోసం ఇంటర్నెట్లో శోధించాము. అయితే, సమాచారాన్ని ధృవీకరించే ప్రామాణికమైన నివేదికలు ఏవీ కనుగొనబడలేదు. అయినప్పటికీ, ఈ వాదనలను ఖండించిన అనేక కథనాలను మేము చూశాము.
దావాను ధృవీకరించడానికి మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ కార్యాలయాన్ని సంప్రదించాము. ఈ వాదనలను ఖండించిన మన్మోహన్ సింగ్ కార్యాలయ ప్రతినిధి.. ‘ఈ వైరల్ దావాకు సంబంధించి గత కొన్ని రోజులుగా మాకు చాలా కాల్స్ వచ్చాయి. వైరల్ దావా నకిలీ. డాక్టర్ సింగ్‌కు ఇంతవరకు అలాంటి ఆహ్వానం రాలేదు.’ అని చెప్పారు.
దైనిక్ జాగరణ్ యొక్క అసోసియేట్ వార్తాపత్రిక నయీదునియాలో ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం, ‘జో బిడెన్ 2021 జనవరి 20 న 46 వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అధికారాన్ని చేపట్టనున్నారు. ఆయన దేశంలోనే అతిపెద్ద వయసులో అధ్యక్షుడైన వ్యక్తి. అయితే, ఆయన రెండుసార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కమలా హారిస్, భారత సంతతి మహిళ అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు అవుతుంది.’
వైరల్ దావాను షేర్ చేసిన ఫేస్బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్‌లో.. దీనికి 3,843 మంది ఫాలోవర్లు ఉన్నారని, మరియు 21 ఏప్రిల్ 2019 నుండి ఈ పేజీ యాక్టివ్‌గా ఉందని తేలింది. ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఈ యూజర్ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు.
निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. ఇంతవరకు తమకు ఎటువంటి ఆహ్వానం రాలేదని పేర్కొంటూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కార్యాలయం అలాంటి వాదనలను ఖండించింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.