కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కలామసేరి ప్రాంతములో అక్టోబరు 29 నాడు జరిగిన బాంబు పేలుళ్ళలో ముగ్గురు మరణించారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, రెండు ఈడియోల ఒక కొల్లాజ్ షేర్ చేయబడింది, దీని వెంట తీవ్రవాద సంస్థ హమాస్ నాయకుడు ఖాలిద్ మషాల్ కేరళలో అక్టోబరు 28 నాడు ఒక కార్యక్రమములో ప్రజలనుద్దేశించి ఆన్లైన్ లో ప్రసంగించారు అని క్లెయిమ్ చేయబడింది. మరుసటి రోజు కలామసేరి, కేరళలోని యూదులు లక్ష్యంగా బాంబు పేలుళ్ళు జరిగాయి అని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ పోస్ట్ ద్వార ఒక వర్గాన్ని ప్రేరేపించాలని ప్రయత్నిస్తున్నారు.
పేలుళ్ళు కేరళలో క్రిస్టియన్ వర్గాల ఒక సమావేశము ‘జెహోవా యొక్క సాక్షులు” లో జరిగాయని, యూదుల సమావేశములో కాదు అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. అదే వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఈ దాడికి బాధ్యత క్లెయిమ్ చేశారు. అయితే, ఈ విషయముపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది.
ఒక వెరిఫైడ్ ఖాతా X యూజర్ ‘వి ది పీపుల్ (ఆర్కైవ్ లింక్), వీడియో యొక్క కొల్లాజ్ ను పోస్ట్ చేసి, ఈ విధంగా వ్రాసింది, “కాలానుక్రమాన్ని చూడండి. నిన్న, హమాస్ తీవ్రవాది ఖలీద్ మషాల్, కేరళలోని ఒక కార్యక్రమములో కతార్ నుండి ఆన్లైన్ లో మాట్లాడుతూ, ప్రజలు జిహాద్ కు సిద్ధంగా ఉండాలని మరియు భారతదేశపు వీధులలోకి రావాలని కోరారు……ఈరోజు యూదులు నివసించే కలామసేరి జరిగిన 4 బాంబు పేలుళ్ళు #కేరళను కుదిపేశాయి! ఇది సమన్వయపరచబడిన ఒక తీవ్రవాద దాడి… ఈరోజు యూదులపై… రేపు వేరొకరిపై! మేలుకో ఇండియా”
ఫేస్బుక్ యూజర్ ‘సపన్ సింగ్’ (ఆర్కైవ్ లింక్) కూడా ఇటువంటి క్లెయిమ్ తో అక్టోబరు 29 నాడు వీడియోల కొల్లాజ్ ఒకదానిని పోస్ట్ చేశారు.
కేరళ పేలుళ్ళకు సంబంధించిన వైరల్ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేయుటకు, మేము ముందుగా దాని గురించి గూగుల్ పై కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేశాము. అక్టోబరు 29 నాడు NDTV పై ప్రచురించబడిన ఒక వార్త ఈ విధంగా ఉంది, “కొత్త ఢిల్లీ: దేశమంతట అలజడిని సృష్టిస్తూ, కేరళలోని కలామసేరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన బాంబు పేలుళ్ళలో ఇద్దరు మహిళలు మరణించారు మరియు 45 మంది గాయపడ్డారు. ప్రార్థనా సమావేశము ప్రారంభం అయిన తరువాత కొన్ని నిమిషాలకు మూడు పేలుళ్ళు సంభవించినట్లు రిపోర్ట్ చేయబడింది. ఈ సంఘటన కొచ్చి నుండి 10 కిలోమీటర్ల దూరములో ఉన్న కలామసేరి లోని ఒక సెంటర్ లో జెహోవాస్ విట్నెసెస్ కన్వెన్షన్ సమయములో ఈ సంఘటన జరిగింది. పేలుళ్ళు జరిగిన కొన్ని గంటల తరువాత, ఒక 48-సంవత్సరాల వ్యక్తి దీనికి బాధ్యత తీసుకొని లొంగిపోయాడు. అనుమానితుడు, డోమినిక్ మార్టిన్, తాను ప్రార్థనా సమావేశము ఏర్పాటు చేసిన అదే క్రిస్టియన్ వర్గానికి చెందినవాడినని చెప్పాడు.”
ఈ సంఘటనను తెలిపే ఒక వీడియో సిఎన్బిసి-టివి18 యొక్క యూట్యూబ్ ఛానల్ పై కూడా చూడవచ్చు. ఇది “డోమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పేలుళ్ళకు బాధ్యత వహించాడు. జెహోవాస్ విట్నెసెస్ తన హెచ్చరికలను పెడచెవిన పెట్టడముతో తాను బాంబులు పెట్టానని డోమినిక్ చెప్పిన ఒక వీడియో సందేశము మాకు లభించింది.” అని పేర్కొనింది.
అక్టోబరు 30 నాడు The Indian Express పై ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారము, “ఈ సంఘటన కలామసేరిలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగింది, ఇక్కడ సుమారు 2,500 మంది ఒక ప్రార్థనా సమావేశము కొరకు కలిశారు. జెహోవాస్ విట్నెసెస్ యొక్క విడిపోయిన సభ్యుడు, ఇప్పుడు పోలీసు అధీనములో ఉన్న డోమినిక్ మార్టిన్, ఈ చర్యకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు.”
కేరళ పోలీసుల ఫేస్బుక్ పేజ్ పై అక్టోబరు 29 నాడు ప్రచురించబడిన ఒక పోస్ట్ (అర్కైవ్ లింక్) ఈ విధంగా తెలిపింది, “సోషల్ మీడియా ద్వారా మతపరమైన మరియు వర్గ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ సందేశాలు పంపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని రాష్ట్ర పోలీసు చీఫ్ చెప్పారు. కలామసేరి సంఘటనను దృష్టిలో పెట్టుకొని షేక్ దార్వేష్ సాహెబ్ ఈ హెచ్చరిక చేశారు. “ఇటువంటి సందేశాలను వ్యాప్తి చేసే ఖాతాలను కనుగొనుటకు సోషల్ మీడియాపై పోలీసులు 24-గంటల పర్యవేక్షణను బలోపేతం చేశారు.” నకిలీ పోస్ట్ లను పోస్ట్ చేసే వారి పట్ల తీసుకునే చర్యల గురించి కూడా ఇది తెలిపింది.
దీనిని కేరళ పోలీసు యొక్క అధికారిక X హ్యాండిల్ నుండి కూడా పోస్ట్ చేయబడింది.
మేము కలామసేరి పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ విబిన్ దాస్ ను ఈ విషయమై సంప్రదించాము. ఆయన, “పేలుళ్ళ ద్వారా యూదులను టార్గెట్ చేశారు అనే క్లెయిమ్ అసత్యము. ఈ పోస్ట్ నకిలీది మరియు దీనిని షేర్ చేయకండి” అని అన్నారు.
అలాగే మేము విపి ప్రమోద్ కుమార్, రాష్ట్ర పోలీసు మీడియా సెంటర్ యొక్క డెప్యూటి డైరెక్టర్ (పబ్లిక్ రిలేషన్స్) ను కలిశాము. ఆయన, “కేరళ పేలుళ్లలో యూదులను టార్గెట్ చేశారు అనే క్లెయిమ్ ఆధారరహితమైనది.” అని అన్నారు.
వెబ్సైట్ పై అక్టోబరు 29 నాడు ప్రచురించబడిన వార్తల ప్రకారము, “ఖాలిద్ మషాల్, తీవ్రవాద సంస్థ హమాస్ నాయకుడు, మల్లప్పురం, కేరళలో నిర్వహించబడిన వర్చువల్ ర్యాలీలో పాల్గొన్నట్లు సమాచారం. ఒక వీడియోలో, ఖలీద్ మషాల్ ప్రజలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడటం చూడవచ్చు. ఈ ర్యాలీకి సంబంధించి, బిజేపి రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ కేరళ పోలీసులను ప్రశ్నించారు.”
మేము కేరళ పేలుళ్ళ గురించి ఈ తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ చేసిన Xuser యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ హ్యాండిల్ నుండి ఇదివరకు నకిలీ మరియు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ చేయబడ్డాయి, వీటి గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది.
ముగింపు: కేరళలోని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించబడిన ఈవెంట్ క్రిస్టియన్ వర్గము ‘జెహోవాస్ విట్నెసెస్’ కు చెందినది, యూదులది కాదు. యూదులు టార్గెట్ చేయబడ్డారు అనే క్లెయిమ్ అసత్యము అని ఇది తెలుపుతుంది. ఈ సందర్భములో, ఇదే వర్గానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోయారు. అయితే, దీనికి సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923