విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. ఒక సినిమా సన్నివేశాన్ని వైరల్‌గా నమ్మిస్తున్నారు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను గమనిస్తే ముగ్గురు పోలీసు అధికారులు ఓ రాజకీయ నాయకుడి ముందు మోకరిల్లారు. ఈ ఫోటోను ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియా యూజర్లు.. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను నిలదీస్తున్నారు. ఇది నిజమని నెటిజన్లు అందరూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ అవుతున్న ఫోటోను పరిశోధించింది. 2011 లో విడుదలైన ఓ సినిమాలోని షాట్ ఇప్పుడు కొంతమంది వైరల్ చేస్తున్నారని మాకు తెలిసింది. మా దర్యాప్తులో, ఈ వైరల్ పోస్ట్ అబద్ధమని నిరూపించబడింది.
వైరల్ అవుతున్నది ఏంటి ?
ఫేస్బుక్ యూజర్ వేదప్రకాష్ తన వాల్‌పై ఈ ఫోటో పోస్ట్ చేశారు. ‘ఈ ఫోటో ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలియదు, కానీ భారత దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ ఫోటో ఒక్కటి సరిపోతుంది. ఈ ఒక్క ఫోటో అన్నింటికీ నిదర్శనంగా నిలుస్తోంది.’ అని ఫోటోకు కామెంట్ చేశారు.
ముగ్గురు పోలీసు అధికారులు ఒక రాజకీయ నాయకుడి ముందు చేతులు కట్టుకొని, మోకరిల్లడం ఈ ఫోటోలో చూడవచ్చు.
వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడండి.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ మొదట గూగుల్ రివర్స్ ఇమేజ్‌లో వైరల్ పోస్ట్ ఫోటోను అప్లోడ్ చేసి శోధించింది. www.koimoi.com అనే వెబ్సైట్లో ‘క్యా యేహీ సచ్ హై’ అనే చిత్రానికి సంబంధించిన సమీక్షలో మాకు వైరల్ ఫోటో కనిపించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో వాస్తవానికి 30 డిసెంబర్ 2011 న ప్రచురించిన ఓ సినిమా సమీక్షకు సంబంధించి ప్రచురించిన ఫోటో అని తెలిసింది. ఈ సినిమాను నిర్మించారు
దర్యాప్తులో, మేము గూగుల్‌లో ఈ సినిమా పేరును శోధించాము. ‘క్యా యేహీ సచ్ హై’ అనే సినిమా 2011 లో విడుదలైందని imdb అనే వెబ్సైట్ ద్వారా మాకు తెలిసింది. ఈ చిత్ర రచయిత, దర్శకుడు వైపి సింగ్.
మరింత సమాచారం కోసం మేము వైపి సింగ్‌ను సంప్రదించడం జరిగింది. వైరల్ అవుతున్న ఫోటో తన చిత్రం ‘క్యా యేహీ సచ్ హై’ లోని ఒక సన్నివేశం అని ఆయన మాకు చెప్పారు. ఆయన తన మొత్తం చిత్రానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ కూడా పంపించారు. వీడియోలో 1:48 టైమ్‌లైన్ వద్ద మాకు అదే దృశ్యం కనిపించింది, ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
చివరగా మేము ఫేస్బుక్ యూజర్ వేదప్రకాష్ అకౌంట్‌ను తనిఖీ చేసాము. యూజర్ ఛండీగఢ్‌కు చెందినవారని తెలిసింది. ప్రస్తుతం అతను ఉదయపూర్‌లో నివసిస్తున్నాడు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. ఒక సినిమా సన్నివేశాన్ని వైరల్‌గా నమ్మిస్తున్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923