ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో తీసిన చోట ప్రధాని నడిచే దారి వెంట కార్పెట్ ఉంది, కానీ ప్రధానమంత్రి మోడీ తానకు తానుగా కార్పెట్ మీద నడవకుండా నేల మీదుగా నడుస్తూనే గురుద్వారా లోపలకు వెళ్లారు. గురుద్వారా రాకాబ్‌గంజ్ కూడా వైరల్ అవుతున్న వాదనను ఖండించింది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 20వ తేదీ ఉదయం ఢిల్లీలోని గురుద్వారా రాకబ్‌గంజ్ సాహిబ్‌ను సందర్శించి గురు తేగ్ బహదూర్ జికి నివాళులర్పించారు. ప్రధాని మోడీ పర్యటన ముందుగా షెడ్యూల్ కాలేదు. అనేక వార్తా సంస్థలు కూడా ఈ పర్యటన గురించి కొన్ని ఫోటోలను షేర్ చేశాయి. ఈ ఫోటోలలో ఒకదానిలో, మోదీ పాలరాయి నేల మీద చెప్పులు లేకుండా నడుస్తున్న దృశ్యం చూడవచ్చు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. గురుద్వారా రాకబ్‌గంజ్ కమిటీ ప్రధాని మోదీ పర్యటన సమయంలో కార్పెట్ తొలగించిందని, తద్వారా మోదీ చల్లని ఫ్లోర్‌పై నడవవలసి వచ్చిందని పేర్కొన్నారు.
ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో తీసినచోట, అక్కడ కార్పెట్ ఉంది, కానీ ప్రధానమంత్రి మోదీ కార్పెట్ మీద నడవకుండా స్వేచ్ఛగా నేలమీదుగానే నడుచుకుంటూ గురుద్వారా లోపలికి వెళ్లారు. గురుద్వారా రాకాబ్‌గంజ్ కూడా వైరల్ అవుతున్న వాదనను ఖండించింది.
వైరల్ అవుతున్నది ఏంటి?
ఈ ఫేస్‌బుక్ వైరల్ పోస్ట్‌లో రాసిన డిస్క్రిప్షన్ గమనిస్తే.. ‘Gurudwara Rakabganj Committee removed the Carpet for PM Modi’s visit to make him walk on cold floor! He was never humiliated so much like this before!’ దీనిని తెలుగులోకి అనువదిస్తే.. “గురుద్వారా రాకాబ్‌గంజ్ కమిటీ ప్రధాని మోదీ సందర్శనకు వచ్చిన సమయంలో కార్పెట్ తొలగించింది, తద్వారా ప్రధాని చల్లని ఫ్లోర్‌పై నడవాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఎవరినీ ఇలా అవమానించలేదు. “
ఫేస్‌బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడండి.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ పరిశోధన కోసం ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్‌లో అప్‌లోడ్ చేసి శోధించింది. శోధన సమయంలో, వార్తా సంస్థ ANI చేసిన ట్వీట్‌లో ఈ ఫోటోను మేము కనుగొన్నాము.
ANI వార్తా సంస్థలో PM మోడీ సందర్శనకు సంబంధించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, గురుద్వారాలోకి ప్రవేశించడానికి ప్రధాని నడుస్తున్న దారివెంట, ఒక కార్పెట్ కూడా ఉండటం స్పష్టంగా చూడవచ్చు. కానీ, ప్రధాని మోడీ తనకు తానుగానే కార్పెట్ మీద నడవకుండా గురుద్వారా లోపలికి వెళ్లేందుకు ఆ చల్లని నేల మీదుగానే నడిచారు.
వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ మరియు వైరల్ ఫోటోలో పోలిక కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ నడుస్తున్న పక్కనే కార్పెట్ చూడవచ్చు.
ఈ విషయంలో ధృవీకరణ కోసం మేము ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ ప్రబంధన్ కమిటీని సంప్రదించాము. ఈ వాదన అబద్ధమని, ప్రధాని మోడీ వస్తారని ముందుగా తమకు తెలియదని చెప్పారు. రాకబ్‌గంజ్ గురుద్వారా అడ్మిన్ మేనేజర్ గురుదీప్ సింగ్ సెల్‌నెంబర్ తెలుసుకొని ఆయనకు కాల్ చేశాము. గుర్దీప్ సింగ్ మాతో మాట్లాడుతూ, ‘ఈ ఆరోపణ అబద్ధం. గురుద్వారంలోకి ప్రవేశించే మార్గంలో, ఒక కార్పెట్ ఉంది, ఇరువైపులా చాలా ఖాళీ స్థలం ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఖాళీ స్థలంలో నడుస్తూ గురుద్వారా లోపలికి వెళ్ళారు.’ అని వెల్లడించారు.
ఈ పోస్ట్‌ను వీరేంద్ర శ్రీవాస్తవ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో తప్పుడు దావాతో షేర్ చేసుకున్నారు. అతని ప్రొఫైల్ ప్రకారం, యూజర్ హైదరాబాద్‌కి చెందినవాడు. ఈ యూజర్‌కు 4,103 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో తీసిన చోట ప్రధాని నడిచే దారి వెంట కార్పెట్ ఉంది, కానీ ప్రధానమంత్రి మోడీ తానకు తానుగా కార్పెట్ మీద నడవకుండా నేల మీదుగా నడుస్తూనే గురుద్వారా లోపలకు వెళ్లారు. గురుద్వారా రాకాబ్‌గంజ్ కూడా వైరల్ అవుతున్న వాదనను ఖండించింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923