కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సుదర్శన్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేష్ చావ్హంకే భార్య లక్ష్యంగా ఇంటర్నెట్ పై ఒక పోస్ట్ చక్కర్లుకొడుతోంది. సురేష్ చావ్హంకే భార్య ఒక ముస్లిం వ్యక్తితో పారిపోయింది అని అనేకమంది యూజర్లు ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్ ను ఆజ్ తక్ అనే హిందీ న్యూస్ ఛానల్ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ను ఉపయోగించి షెర్ చేశారు.
ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. క్లెయిమ్ తో షేర్ చేయబడిన బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఎడిటింగ్ సాధనాల సహాయముతో తయారు చేయబడింది. సురేష్ చావ్హంకే, తన కుటుంబము గురించి ఈ అభ్యంతరకరమైన క్లెయిమ్స్ ను తనకు వ్యతిరేకంగా ప్రచారంగా పేర్కొంటూ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఇటువంటి వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సోషల్ మీడియా యూజర్ ‘మంజిత్ సింగ్’ ‘సురేష్ చావ్హంకే భార్య లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముస్లింగ్ యువకుడితో పారిపోయింది’ అనే శీర్షికతో ఒక వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు. చాలామంది యూజర్లు కూడా ఈ వైరల్ స్క్రీన్ షాట్ ను విశ్వాస్ న్యూస్ యొక్క టిప్ లైన్ నంబరుకు షేర్ చేశారు మరియు క్లెయిమ్ ను తనిఖీ చేయమని అభ్యర్ధించారు.
ట్విట్టర్ పై అనేకమంది యూజర్లు కూడా ఇదే క్లెయిమ్ తో వైరల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.
సుదర్శన్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేష్ చావ్హంకే భార్య ఒక ముస్లిం యువకుడితో పారిపోయింది అనే క్లెయిమ్స్ తో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ హిందీ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ తో షేర్ చేయబడింది. వైరల్ పోస్ట్ లో ఇదే రకమైన పదాలు భిన్నంగా వ్రాయబడ్డాయి మరియు బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ యొక్క ఫాంట్ కూడా అసలైన ఆజ్ తక్ న్యూస్ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ కంటే భిన్నంగా ఉంది. చిత్రాన్ని చూడగానే, ఇది ఎడిటింగ్ సాధనాల సహాయముతో తయారు చేయబడిన బ్ర్రేకింగ్ ప్లేట్ అని స్పష్టంగా తెలుస్తుంది.
మేము సురేష్ చావ్హంకే యొక్క ట్విట్టర్ హ్యాండిల్ కూడా గూగుల్ చేశాము. ఆయన ఈ వైరల్ పోస్ట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ పై ఖండించారు మరియు పోస్ట్ షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ ను తన ట్వీట్ లో టాగ్ చేస్తూ, ఆయన ఇలా వ్రాశారు, “#ప్రత్యర్ధులు నకిలీ పోస్ట్ లను వైరల్ చేస్తున్నారు. నా కుటుంబము నామాదిరిగానే హిందూత్వాన్ని ధృఢంగా విశ్వసిస్తుంది. ఇది నాతో వాదనలు మరియు సిద్ధాంతాల యుద్ధాన్ని ఓడిపోతామనేందుకు ఒక సంకేతము, ఆ కారణంగానే వక్రస్వభావము కలిగిన వారు నా కుటుంబం పరువు తీసేందుకు దిగజారాలు. వీరందరిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.”
సురేష్ చావ్హంకే మరియు అతని భార్యకు సంబంధించిన క్లెయిమ్ నిరాధారమైనది మరియు ఈ క్లెయిమ్ వెంబడి వైరల్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ కూడా ఎడిటింగ్ సాధనాల సహాయముతో తయారు చేయబడింది అని మా దర్యాప్తులో స్పష్టం అయ్యింది.
వైరల్ క్లెయిమ్ కు సంబంధించి విశ్వాస్ న్యూస్ సురేష్ చావ్హంకే ను సంప్రదించింది. “ఇది నన్ను నా కుటుంబాన్ని అపకీర్తిపాలు చేయాలని వక్రస్వభావము కలిగిన వారు చేసిన పని. దేశములో సుమారు 100 ప్రాంతాలలో సుమారు వెయ్యి పైగా మందిపైన మేము ఫిర్యాదులు నమోదు చేశాము.” అని ఆయన అన్నారు.
ముగింపు: సుదర్శన్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేష్ చవ్హంకే భార్య ఒక ముస్లిం యువకుడితో పారిపోయింది అనే క్లెయిమ్ అసత్యము. హిందీ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ కూడా ఎడిటింగ్ సాధనాలు ఉపయోగించి తయారు చేయబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923