వాస్తవ తనిఖీ: పాఠశాల పుస్తకాలపై ప్రభుత్వం పన్ను విధించలేదు, వైరల్ దావా అబద్ధం
వైరల్ దావా నకిలీ. పాఠశాల పుస్తకాలపై ప్రభుత్వం ఎటువంటి పన్ను విధించలేదు.
- By: Abhishek Parashar
- Published: Sep 28, 2020 at 10:43 AM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : పాఠశాల పాఠ్యపుస్తకాలపై పన్ను విధించిన మొదటి దేశం భారత్ అని సోషల్ మీడియాలో ఓ వైరల్ ఇన్ఫోగ్రాఫ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని బట్టబయలయ్యింది. పాఠశాల పుస్తకాలపై ప్రభుత్వం ఎటువంటి పన్ను విధించలేదు.
దావా :
‘బ్లఫ్ మాస్టర్ మోడీ’ అనే ఫేస్బుక్ పేజీలో ఈ వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు. ‘పాఠ్య పుస్తకాలపై పన్ను విధించిన మొదటి దేశం భారతదేశం’ అని కామెంట్ చేశారు.
ఈ పోస్ట్ నిజమే అని భావించి 5,000 మందికి పైగా యూజర్లు ఈ పోస్ట్‌ను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు.
దర్యాప్తు :
దేశంలో ఇకపై పాఠ్యపుస్తకాలపైనా సరికొత్త పన్ను రూపంలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) విధించబోతున్నారు. అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఈ సమాచారంపై వాస్తవ తనిఖీ చేసేందుకు మేము న్యూస్ ఆర్టికల్స్ కోసం శోధించాము.
దీనికి సంబంధించిన అనేక వెబ్సైట్లను మేము కనుగొన్నాము. పుస్తకాలు, వార్తాపత్రికలు వంటి ప్రింటింగ్ మెటీరియల్‌పై జీఎస్టీ పన్ను సున్నా.. అని తెలుసుకున్నాం.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు సంబంధించిన వెబ్సైట్లో కూడా మాకు అలాంటి ఫలితాలే కనిపించాయి. 49 వ అధ్యాయంలో, ముద్రిత పుస్తకాలకు జీరో టాక్స్‌గా పేర్కొనబడిన మొత్తం వస్తువుల జాబితాను మేము స్క్రీన్‌షాట్ తీయడం జరిగింది.
ది హిందూ బిజినెస్లైన్లో 27 జనవరి 2018వ తేదీన ప్రచురించిన వార్తల ప్రకారం, ‘పుస్తకాలు జిఎస్టి కింద మినహాయింపుగా కొనసాగుతున్నాయి’
దావాను ధృవీకరించడానికి మేము టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ మరియు Apnapaisoa.com చీఫ్ ఎడిటర్ బల్వంత్ జైన్‌ను సంప్రదించాము. “జిఎస్టి నుంచి పుస్తకాలు మినహాయించబడ్డాయి. ఇన్పుట్ టాక్స్ విషయానికొస్తే, మేము పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని జైన్ అన్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈ వాదనను ఖండించింది, పాఠశాల పుస్తకాలపై ప్రభుత్వం ఎటువంటి పన్ను విధించలేదని పేర్కొంది.
వైరల్ పోస్ట్‌ను షేర్చేసిన ఫేస్బుక్ పేజీ సోషల్ స్కానింగ్‌లో ఈ పేజీకి అర మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారని తేలింది. ఈ పేజీ మార్చి 2013 నుండి యాక్టివ్‌లో ఉందని తెలిసింది.
निष्कर्ष: వైరల్ దావా నకిలీ. పాఠశాల పుస్తకాలపై ప్రభుత్వం ఎటువంటి పన్ను విధించలేదు.
- Claim Review : పాఠశాల పుస్తకాలపై పన్ను విధించిన మొదటి దేశం భారతదేశం.
- Claimed By : FB పేజి బ్లఫ్ మాస్టర్ మోడి
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.