వాస్తవ తనిఖీ: మాజీ మన్మోహన్ సింగ్ గురించి రిషి సునాక్ ఎలాంటి వైరల్ ప్రకటన చేయలేదు. వైరల్ పోస్ట్ నకిలీది.
- By: Devika Mehta
- Published: Nov 7, 2022 at 05:09 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి అయిన తరువాత, రిషి సునాక్ అనేక కారణాల వలన వార్తలలో నిలిచారు. ఇప్పుడు సోషల్ మీడియాపై ఒక వైరల్ పోస్ట్ ఉంది, అందులో రిషి సునాక్ బలహీనమైన మరియు పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచేందుకు మన్మోహన్ సింగ్ వంటి ప్రధానమంత్రి సరైన మార్గదర్శనం చేయాలి అని అన్నారు అని క్లెయిమ్ చేయబడింది.
వైరల్ పోస్ట్ ను విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఇది నకిలీది అని కనుగొనింది. రిషి సునాక్ ఇలాంటి ప్రకటన ఏది చేయలేదు; bhaskar.com పై ఒక వార్తా నివేదిక యొక్క కొల్లాజ్ డిజిటల్ గా మార్చబడి వైరల్ చేయబడింది అని దర్యాప్తులో వెల్లడి అయ్యింది.
క్లెయిమ్
ఫేస్బుక్ పేజ్ ‘న్యూ ఇండియా కి బులంద్ ఆవాజ్’ అక్టోబరు 27 నాడు ఒక పోస్ట్ రిషి సునాక్ యొక్క ఒక సృజనాత్మకతను షేర్ చేసింది, అందులో ఇలా ఉంది, “బలహీనమైన మరియు పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచేందుకు సరిన మార్గదర్శనం చేయుటకు మన్మోహన్ సింగ్ వంటి ఒక ప్రధానమంత్రి అవసరం.”
పోస్ట్ బ్రిటన్ యొక్క కొత్త ప్రధాన మంత్రి యొక్క ఈ ప్రకటనను వివరించేందుకు రిషి సునాక్ మరియు మన్మోహన్ సింగ్ చిత్రాలను ఉపయోగించింది.
ఇది నిజమే అని భావిస్తూ, ఇతర యూజర్లు కూడా దీనిని వైరల్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ పోస్ట్ ను దర్యాప్తు చేయుటకు విశ్వాస్ న్యూస్ ముందుగా గూగుల్ ఓపెన్ సెర్చ్ ను ఉపయోగించింది. అయితే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి రిషి సునాక్ ఇటువంటి ప్రకటన చేశాడు అని ధృవీకరించే ఎలాంటి వార్తలు మాకు లభించలేదు.
దర్యాప్తును ముందుకు కొనసాగించేందుకు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సాధనము ఉపయోగించబడింది. వైరల్ కొల్లాజ్ కొరకు సెర్చ్ చేసినప్పుడు, మాకు దైనిక్ భాస్కర్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై అసలైన కొల్లాజ్ కనిపించింది. ఇది అక్టోబరు 25 నాడు షేర్ చేయబడింది. ఇది బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నిక అయిన తరువాత కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం మరియు శశి థరూర్ యొక్క ప్రకటనలతో ఉపయోగించబడింది
విశ్వాస్ న్యూస్ వాస్తవ మరియు నకిలీ కొల్లాజ్ ల తులనాత్మక అధ్యయనం చేసింది. అసలైన కొల్లాజ్ లోని ఫోటోలో భాగము రిషి సునాక్ పేరుతో ఉన్న వైరల్ పోస్ట్ ఉన్నదాని మాదిరిగానే ఉంది. కాని కింది భాగం వేరు. రెండు కొల్లాజ్ లను ఈ దిగువన చూడవచ్చు.
దర్యాప్తు యొక్క తరువాతి దశలో, దైనిక్ భాస్కర్ ను సంప్రదించాము. Bhaskar.com అధిపతి ప్రసూన్ మిశ్రా విశ్వాస్ న్యూస్ తో ఇలా అన్నారు, “రిషి సునాక్ మరియు మన్మోహన్ సింగ్ గురించి వైరల్ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడినట్లుగా నా వెబ్సైట్ లో ఇటువంటి వార్తలు ప్రచురించబడలేదు. ఇది నకిలీది.”
ముగింపు: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో, రిషి సునాక్ పేరుతో ఉన్న వైరల్ ప్రకటన నైకీలి అని కనుగొనబడింది. మాజీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సిమ్గ్ గురించి ఆయన ఇటువంటి ప్రకటన చేయలేదు, ఆ చిత్రము డిజిటల్ గా మార్చబడినది.
- Claim Review : రిషి సునాక్ మన్మోహన్ సింగ్ యొక్క ఆర్ధిక ఆలోచనలను పొగిడారు
- Claimed By : ఎఫ్బి పేజ్: नये भारत की बुलंद आवाज़
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.